E-Paper
Advertisement

ఛోళీ కే పీచే.. మళ్ళీ అదే డర్టీ పిక్చర్! తమన్నాకు ఇది అవసరమా?

ఛోళీ కే పీచే.. మళ్ళీ అదే డర్టీ పిక్చర్! తమన్నాకు ఇది అవసరమా?

Tamannaah Controversy : మిల్కీ బ్యూటీ తమ్మూ ఇపుడు రూటు మార్చిందా అంటే అవుననే అంటున్నాయ్ బాలీవుడ్ సర్కిల్స్.మరి హీరోయిన్‌గా ఛాన్స్‌లు రావట్లేదా లేక ఐటమ్ సాంగ్స్ (స్పెషల్ సాంగ్స్)కి కోట్లు కుమ్మరిస్తున్నారా తెలీదు కాని నటిగా మెప్పించడం అటుంచి పాటల్లో డాన్స్‌లు చేసేందుకు రెడీ అయిపొయింది.

సెన్సార్‌ని షేక్ చేసిన ‘చోళీ కే పీచే క్యా హై’

శ్రద్దా కపూర్ మెయిన్ లీడ్‌గా చేసిన ‘స్త్రీ-2’ ఎంతటి సక్సెస్ అయిందో, ఆ సినిమాలోని ‘ఆజ్ కి రాత్’ అంతకుమించి హిట్ అయ్యింది.ఈ పాటలో తమ్మూ వేసిన స్టెప్స్ ఇప్పటికీ యూట్యూబ్‌ని షేక్ చేస్తున్నాయంటే ఆశ్చర్యం లేదు.అలా తనదైన స్టెప్పులతో యూత్ కి ముచ్చెమటలు పట్టించిన ఈ మిల్కీ బ్యూటీ ఇపుడు మరో బోల్డ్ కాంట్రవర్సీ సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.అవును.. ఒకప్పుడు అడల్ట్ లిరిక్స్‌తో సెన్సార్‌ని షేక్ చేసిన ‘చోళీ కే పీచే క్యా హై’ సాంగ్ రీమేక్‌లో తమ్మూ బేబీ నటించబోతుందన్న వార్తలు బీ-టౌన్‌లో వినిపిస్తున్నాయ్.

ALSO READ :సౌండ్‌ప్రూఫ్ రూమ్‌లో లాక్ చేసి.. సింగర్ పై ప్రముఖ సంగీత దర్శకుడి అఘాయిత్యం!

 అదే అశ్లీలత.. అదే డబుల్ మీనింగ్!

‘చోళీ కే పీచే క్యా హై’ విషయానికి వస్తే, 1993లో సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో సంజయ్ దత్ హీరోగా వచ్చిన ‘ఖల్ నాయక్’ సినిమాలో ఈ పాట అప్పట్లో ఎంతటి సెన్సేషన్ అయ్యిందో, అంతకుమించిన కాంట్రవర్సీలను కూడా తెచ్చుకుంది.ఇందులో స్టెప్పులేసిన మాధురీ దీక్షిత్ గ్లామర్ షో ఒకెత్తయితే..ఆ పాటలోని లిరిక్స్ అయితే మరీ దారుణం.”చోళీ కే పీచే క్యా హై” (జాకెట్ వెనుక ఏముంది?) అంటూ వచ్చే ఈ పాట డబుల్ మీనింగ్‌గా ఉందంటూ అప్పట్లో పెద్ద దుమారం రేగింది.ఇక ఇదే పాట గురించి అప్పటి పార్లమెంట్‌లో కూడా హాట్ హాట్‌గా డిబేట్ జరిగిందంటే పాట ఎంతగా వైరల్ అయ్యిందో అర్థమవుతుంది.ఇక ఇదే పాటను మళ్లీ ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ కోసం రీమేక్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.అసలే ట్రెండ్ మారింది. చిన్న చిన్న విషయాలనే బూతద్దంలో చూస్తున్న పరిస్థితి.
మరి అలాంటి ఈ సమయంలో బూతు అర్థం వచ్చే పాటని రీమేక్ చేయడం అవసరమా? అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయ్.

తమన్నా.. మాధురీ దీక్షిత్‌ని మ్యాచ్ చేయగలదా?

ఇక ‘చోళీ కే పీచే క్యా హై’ అంటూ సరోజ్ ఖాన్ కొరియోగ్రఫీలో మాధురీ దీక్షిత్ పలికించిన ఎక్స్ప్రెషన్స్ ఎవర్ గ్రీన్.మరి ఆ ప్లేసులోకి వస్తున్న తమన్నా, మాధురీ దీక్షిత్ గ్రేస్‌ని మ్యాచ్ చేయగలదా అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న.మరి మాధురీని మైమరిపిస్తుందా లేక అచ్చొచ్చిన గ్లామర్ నే ఒలకబోసి పాస్ మార్కులు వేసుకుంటుందా అన్నది చూడాలి.

హీరోయిన్‌గా ఫేడ్ అవుట్ ?

ఇక తమ్మూ సెలెక్ట్ చేసుకుంటున్న రోల్స్ చూస్తే హీరోయిన్‌గా ఈ అమ్మడిని అసలు ఎవరూ కన్సిడర్ చేయనట్టే కనిపిస్తుంది.అందుకే వరుసగా నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లేదా ఓన్లీ స్పెషల్ సాంగ్స్ మీద ఫోకస్ పెడుతోంది.ఇక సంజయ్ దత్ క్లాసిక్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.చూడాలి మరి జియో స్టూడియోస్, యాస్పెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు సంజయ్ దత్ హోమ్ బ్యానర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలకు తెర తీస్తుందో!

ALSO READ :57 ఏళ్ల వయసులో 18 ఏళ్ల చిన్నదానితో ప్రేమాయణం.. ఎవరీ స్టైలిష్ విలన్? వీడియో వైరల్

Related News

థియేటర్ డోర్ వెనుక బాలీవుడ్ లవ్ బర్డ్స్ సీక్రెట్ ప్లాన్.. కెమెరామెన్స్ దెబ్బకు స్కెచ్ రివర్స్!

వివాదాల్లో పెద్ది…రామ్ చరణ్ సినిమాపై ఈ రేంజ్ నెగెటివిటీనా?

నెట్టింట వైరల్ అవుతున్న మృణాల్ ‘ఐస్‌క్రీమ్ రైస్’.. అంతలా అడిక్ట్ అయిపోయిందా?

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

Big Stories

×