E-Paper
Advertisement

Summer dry skin problems:ఎండకు చర్మం జీవం కోల్పోతోందా? ఈ సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్ మీకోసమే!

Summer dry skin problems:ఎండకు చర్మం జీవం కోల్పోతోందా? ఈ సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్ మీకోసమే!
Advertisement

Summer dry skin problems: ఎండలు కేవలం చెమటను మాత్రమే కాదు, చర్మం లోపల ఉండాల్సిన సహజమైన తేమను కూడా హరిస్తాయి. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు, గాలిలోని తేమ తగ్గడం వల్ల చర్మం పొడిగా, పగిలినట్లుగా మారుతుంది. దీని వల్ల చర్మంపై దురద, మంట , ముడతలు వచ్చే అవకాశం ఉంది. వేసవిలో కూడా మీ చర్మాన్ని కోమలంగా, కాంతి వంతంగా ఉంచుకోవడానికి అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి పరిష్కార మార్గాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

వేసవిలో చర్మం ఎందుకు పొడి బారుతుంది?
సాధారణంగా వేసవిలో చెమట ఎక్కువగా వస్తుంది. కానీ లోపలి పొరల్లో ఉండే నీరు ఆవిరి కావడం వల్ల చర్మం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఎక్కువ సమయం ఏసీ గదుల్లో గడపడం వల్ల గాలిలోని తేమ తగ్గి చర్మం త్వరగా పొడిబారుతుంది. దీనికి తోడు వేడి గాలి, కాలుష్యం చర్మాన్ని నిర్జీవంగా మారుస్తాయి.

Advertisement

పొడి చర్మం తగ్గడానికి పాటించాల్సిన చిట్కాలు:

1. నీరు ఎక్కువగా తాగండి:
చర్మ సంరక్షణ లోపలి నుంచి మొదలవ్వాలి. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడం వల్ల చర్మ కణాలు తేమగా ఉంటాయి. కేవలం నీరు మాత్రమే కాకుండా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, తాజా జ్యూస్ లు తీసుకోవడం వల్ల చర్మం లోపలి నుంచి నిగారిస్తుంది.

Advertisement

2. సరైన మాయిశ్చరైజర్ :
చలికాలంలో వాడే మాయిశ్చరైజర్లు వేసవిలో పని చేయవు. వేసవిలో ‘వాటర్ బేస్డ్’లేదా ‘జెల్ బేస్డ్’ మాయిశ్చరైజర్లు వాడాలి. ఇవి చర్మానికి బరువుగా అనిపించకుండా తేమను అందిస్తాయి. స్నానం చేసిన వెంటనే చర్మం కాస్త తేమగా ఉన్నప్పుడే దీనిని అప్లై చేయడం వల్ల ఫలితం బాగుంటుంది.

3. సన్‌స్క్రీన్ తప్పనిసరి:
ఎండలోకి వెళ్ళే ముందు కనీసం SPF 30 ఉన్న సన్‌స్క్రీన్‌ను ముఖం, చేతులు, కాళ్లకు రాసుకోవాలి. ఇది ఎండ నుంచి చర్మాన్ని కాపాడటమే కాకుండా పొడిబారకుండా అడ్డుకుంటుంది.

4. స్నానం చేసేటప్పుడు జాగ్రత్త:
చాలా మంది వేసవిలో చల్లగా ఉంటుందని ఎక్కువసేపు స్నానం చేస్తారు. కానీ ఎక్కువసేపు స్నానం చేయడం వల్ల చర్మంపై ఉండే సహజ నూనెలు తొలగిపోయి పొడిగా మారుతుంది. అలాగే ఘటైన సోపులకు బదులు బాడీ వాష్ లేదా సున్నిపిండి వాడటం మేలు.

5. ఏసీ వాడకం తగ్గిస్తే మంచిది:
ఏసీ గదుల్లో ఉండటం వల్ల చర్మంలోని తేమ త్వరగా ఆవిరైపోతుంది. ఒకవేళ ఏసీలో ఉండాల్సి వస్తే.. గదిలో ఒక మూలన గిన్నెలో నీరు ఉంచడం వల్ల గాలిలో తేమ తగ్గకుండా ఉంటుంది.

6. సహజమైన ప్యాక్‌లు:
అలోవెరా (కలబంద): ఇది చర్మానికి చలువ చేయడమే కాకుండా మంచి తేమను ఇస్తుంది.

పెరుగు, తేనె: పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని శుభ్రం చేస్తే, తేనె తేమను అందిస్తుంది.

వేసవిలో పొడి చర్మం అనేది కేవలం సౌందర్య సమస్య మాత్రమే కాదు.. ఇది చర్మ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. సరైన ఆహారం, తగినంత నీరు, పైన పేర్కొన్న స్కిన్ కేర్ టిప్స్ పాటిస్తే ఎండల తీవ్రతలో కూడా మీ చర్మం మెరుస్తూ ఉంటుంది.

 

Related News

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

చాణక్య నీతి.. ఈ 6 సందర్భాల్లో మౌనంగా ఉండటమే తెలివైన నిర్ణయం

Big Stories

Advertisement
×