E-Paper
Advertisement

ఈ బీర్లలో B6 పుష్కలం.. కిక్కుకు కిక్కు, ఆరోగ్యానికి ఆరోగ్యం!

ఈ బీర్లలో B6 పుష్కలం.. కిక్కుకు కిక్కు, ఆరోగ్యానికి ఆరోగ్యం!
Advertisement

Beer Health Benefits: సాధారణంగా ఆరోగ్యకరమైన జీవనశైలి అనగానే మనందరికీ ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ గుర్తొస్తాయి. కానీ, కొంతమంది మందుబాబులు తాగే బీర్‌లో కూడా మన శరీరానికి అవసరమైన విటమిన్లు ఉంటాయని ఎప్పుడైనా అనుకున్నామా? రీసెంట్‌గా జర్మనీ శాస్త్రవేత్తలు చేసిన ఒక రీసెర్చ్‌లో మనకు తెలియని కొన్ని క్రేజీ విషయాలు బయటపడ్డాయి.

జర్మనీలోని సూపర్ మార్కెట్లలో దొరికే సుమారు 65 రకాల బీర్లను తెచ్చి పరీక్షించగా.. అందులో విటమిన్ B6 దండిగా ఉన్నట్లు తేలింది. మన మెదడు చురుగ్గా ఉండాలన్నా, ఇమ్యూనిటీ పెరగాలన్నా ఈ విటమిన్ చాలా ముఖ్యం. నిజానికి ఇది చికెన్, చేపలు, పప్పుల్లో ఉంటుంది. కానీ బీర్ తయారీలో వాడే బార్లీ, ఈస్ట్ వల్ల ఇది మన గ్లాసులోకి కూడా వచ్చేస్తోంది.

ఏ బీర్‌లో విటమిన్ ఎక్కువ ఉంటుంది?

Advertisement

ఈ రీసెర్చ్ ప్రకారం.. అన్ని బీర్లు ఒకేలా ఉండవు బాస్. Bock అనే ఒక ప్రత్యేకమైన బీర్ రకంలో విటమిన్ B6 చాలా ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది చూడటానికి కాస్త ముదురు రంగులో, మంచి ఫ్లేవర్‌తో ఉంటుంది. దీని తర్వాత మనకు ఎక్కువగా తెలిసిన లాగర్, పిల్స్నర్ రకాలు కూడా మంచి పోషకాలను ఇస్తున్నాయి. ఇక గోధుమలతో చేసే వీట్ బీర్లు కూడా లిస్టులో ఉన్నాయి. కానీ, బియ్యం వాడి తయారు చేసే బీర్లలో మాత్రం విటమిన్లు అంతంత మాత్రంగానే ఉన్నాయని తేలింది. కాబట్టి.. మీరు తాగే బీర్ రకాన్ని బట్టి మీకు అందే పోషకాలు మారుతుంటాయి.

Also Read: గ్యాస్‌ స్టవ్‌తో పనిలేదు.. 5 నిమిషాల్లో రెడీ అయ్యే కుకుంబర్ సలాడ్, ఆరోగ్యానికి ఎంతో మేలు!

ఆల్కహాల్ లేని బీర్లతో లాభం ఉందా?

Advertisement

చాలామందికి నాన్-ఆల్కహాలిక్ బీర్లు అంటే పెద్దగా ఇష్టం ఉండదు. మద్యం ఉండదు కాబట్టి.. అందులో ఏముంటుందిలే అని లైట్ తీసుకుంటారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆల్కహాల్ లేని బీర్లలో కూడా విటమిన్ B6 ఏమాత్రం తగ్గలేదు కదా.. ఇంకా పెరిగింది. మామూలు బీర్ తాగితే మనకు అందాల్సిన విటమిన్లలో 20 శాతం వస్తే.. ఈ నాన్-ఆల్కహాలిక్ బీర్ల ద్వారా ఏకంగా 59 శాతం వరకు విటమిన్ అందుతోందట. దీంతో మద్యం అలవాటు లేనివాళ్లు కూడా హెల్త్ కోసం ఈ నాన్-ఆల్కహాలిక్ డ్రింక్స్‌ను ఒక ఆప్షన్‌లా చూడొచ్చన్నమాట.

మితంగా తాగితేనే బెనిఫిట్స్..

శరీరంలో విటమిన్ B6 తగ్గితే గుండె జబ్బులు, నీరసం, షుగర్ వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. సాధారణంగా మగవారికి రోజుకు 1.4 మి.గ్రా, ఆడవారికి 1.2 మి.గ్రా విటమిన్ B6 అవసరం. ఒక లీటర్ బీర్ తాగితే దాదాపు 1 మి.గ్రా వరకు విటమిన్ దొరుకుతుంది. అయితే, విటమిన్లు దొరుకుతున్నాయి కదా అని విపరీతంగా తాగేయమని దీని అర్థం కాదు. కేవలం విటమిన్లు కావాలనుకునే వారు తమ డైట్‌లో మార్పులు చేసుకునేటప్పుడు ఈ విషయాన్ని ఒక సమాచారంగా మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా సరే హద్దులో ఉంటేనే ఆరోగ్యం, ఆనందం.

Also Read: కేవలం 3 వస్తువులతో కమ్మని వెనీలా ఐస్‌క్రీమ్.. పిల్లల ఫేవరెట్ డిజర్ట్ అయిపోద్ది!

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×