E-Paper
Advertisement

Summer Skin Care Routine: సమ్మర్‌లో ముఖంపై ట్యాన్ రాకుండా.. మెరిసిపోవాలా ?

Summer Skin Care Routine: సమ్మర్‌లో ముఖంపై ట్యాన్ రాకుండా.. మెరిసిపోవాలా ?
Advertisement

Summer Skin Care Routine: సమ్మర్ రాగానే భానుడి భగభగలు మొదలవుతాయి. ఈ ఎండల వల్ల కేవలం దాహం వేయడమే కాదు. మన చర్మం కూడా చాలా ఇబ్బందులకు గురవుతుంది. మితి మీరిన చెమట, జిడ్డు, సన్ ట్యాన్ , మొటిమలు ఈ సీజన్‌లో సర్వసాధారణం. అందుకే వేసవిలో మీ చర్మం తాజాగా, కాంతివంతంగా ఉండాలంటే ఒక ప్రత్యేకమైన స్కిన్ కేర్ రొటీన్ పాటించడం చాలా అవసరం. ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్లెన్సింగ్ :
వేసవిలో చర్మంపై జిడ్డు, చెమట ఎక్కువగా పేరుకుపోతాయి. కాబట్టి రోజుకు కనీసం రెండు సార్లు (ఉదయం, రాత్రి) మంచి ఫేస్ వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. మీది జిడ్డు చర్మం అయితే.. ‘సాలిసిలిక్ యాసిడ్’ ఉన్న క్లెన్సర్ వాడండి. దీని వల్ల రంధ్రాల్లో పేరుకుపోయిన మురికి పోయి మొటిమలు రాకుండా ఉంటాయి.

Advertisement

టోనింగ్:
ఎండల వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. టోనర్ వాడటం వల్ల ఈ రంధ్రాలు బిగుతుగా మారి.. జిడ్డు ఉత్పత్తి తగ్గుతుంది. మార్కెట్లో దొరికే కెమికల్ టోనర్స్ కంటే.. సహజమైన రోజ్ వాటర్ వేసవికి దివ్యౌషధం. ఇది చర్మానికి తక్షణ చల్లదనాన్ని ఇస్తుంది.

మాయిశ్చరైజింగ్ :
చాలా మంది వేసవిలో చర్మం జిడ్డుగా ఉంటుందని మాయిశ్చరైజర్ రాయడం మానేస్తారు. ఇది చాలా తప్పు. చర్మానికి తేమ లేకపోతే.. అది మరిన్ని నూనెలను ఉత్పత్తి చేస్తుంది. అందుకే వేసవిలో ‘లైట్ వెయిట్’ లేదా ‘జెల్ బేస్డ్’ మాయిశ్చరైజర్ వాడండి. అలోవెరా జెల్ కూడా మంచి ఆప్షన్.

Advertisement

సన్‌స్క్రీన్ :
సమ్మర్ స్కిన్ కేర్‌లో అత్యంత ముఖ్యమైన స్టెప్ ఇదే. బయటకు వెళ్లే ముందు కనీసం SPF 30 లేదా 50 ఉన్న సన్‌స్క్రీన్‌ను తప్పని సరిగా ముఖానికి అప్లై చేయాలి. ఇది సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన UV కిరణాల నుంచి చర్మాన్ని రక్షించి.. ట్యాన్ , ముడతలు రాకుండా చూస్తుంది. సమ్మర్‌లో ఇంట్లో ఉన్నా కూడా సన్‌స్క్రీన్ వాడటం మంచిది.

Also Read: ఎండ దెబ్బ నుంచి తప్పించుకోవాలంటే.. వీటిని వదిలేయాల్సిందే!

ఎక్స్‌ఫోలియేషన్ :
వారానికి రెండు సార్లు మైల్డ్ స్క్రబ్‌తో చర్మాన్ని రుద్దడం వల్ల మృత కణాలు తొలగిపోతాయి. దీని వల్ల చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. అయితే.. మరీ ఎక్కువగా స్క్రబ్ చేయకండి. అది చర్మాన్ని దెబ్బతీస్తుంది.

హైడ్రేషన్ :
పైన ఎన్ని క్రీములు రాసినా.. లోపల నుంచి చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. నీళ్లు ఎక్కువగా తాగాలి. రోజుకు 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోయి.. చర్మం మెరుస్తుంది. కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ లాంటివి మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇలా చేయడంవల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఈ సింపుల్ స్టెప్స్‌తో పాటు బయటకు వెళ్లేటప్పుడు గొడుగు వాడటం, ముఖానికి స్కార్ఫ్ కట్టుకోవడం వంటివి చేస్తే ఎండ దెబ్బ నుంచి చర్మాన్ని సులభంగా కాపాడుకోవచ్చు. చర్మం మరీ ఎర్రబడినా లేదా ఇన్ఫెక్షన్లు వచ్చినా వెంటనే స్కిన్ స్పెషలిస్ట్‌ను కలవడం మర్చిపోకండి.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×