E-Paper
Advertisement

Michael Vaughan: వెస్టిండీస్‌, ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్లను దొంగాళ్ళ లాగా కోల్ క‌తాలో దాచి, పిచ్చోళ్ల‌ను చేశారు

Michael Vaughan: వెస్టిండీస్‌, ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్లను దొంగాళ్ళ లాగా కోల్ క‌తాలో దాచి, పిచ్చోళ్ల‌ను చేశారు
Advertisement

Michael Vaughan: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026 )
మార్చి 8వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంటులో న్యూజిలాండ్ పై అద్భుతంగా రాణించిన టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ నేపథ్యంలో బీసీసీఐ అలాగే ఐసీసీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ ( Michael Vaughan). ఎలిమినేట్ అయిన వెస్టిండీస్, దక్షిణాఫ్రికా ప్లేయర్లను దొంగల్లాగా కోల్ క‌తాలో దాచేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు మైఖేల్ వాన్. వాళ్లను వారి స్వదేశాలకు పంపించకుండా నరకం చూపించారని బాంబు పేల్చారు.  ఆ క్రికెట‌ర్లను పిచ్చోళ్ల‌ను చేశారని సీరియ‌స్ అయ్యారు. దీంతో మైఖేల్ వాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Arshdeep Singh: Arshdeep Singh: అర్ష్‌దీప్‌ సింగ్‌ కు ఐసీసీ బిగ్ షాక్‌.. ముక్కు పిండి డ‌బ్బులు వ‌సూలు

వెస్టిండీస్, దక్షిణాఫ్రికా ప్లేయర్లకు నరకం చూపించారు

Advertisement

మిడిల్ ఈస్ట్ దేశాల్లో ( Middile east ) యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో టి20 ప్రపంచ కప్ ఆడేందుకు వచ్చిన జట్లు ఇండియాలోనే చిక్కుకున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల గుండా వెళ్లే వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి జట్లు ఇండియాలోనే ఉన్నాయి. మార్చి 8వ తేదీ తర్వాత అన్ని జట్లను స్పెషల్ చార్టెడ్ విమానం వేయించి మరీ.. వాళ్ల సొంత దేశాలకు పంపింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. అయితే ఎలిమినేట్ అయిన వెంటనే వాళ్ళ దేశాలకు ఈ క్రికెటర్లను ఎందుకు పంపలేదని మైఖేల్ వాన్ విషం కక్కాడు. మార్చి 1వ తేదీన వెస్టిండీస్ ఎలిమినేట్ కాగా.. దక్షిణాఫ్రికా నాలుగో తేదీన టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. వాళ్లు ఎలిమినేట్ అయిన వెంటనే స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ వేయించి వాళ్లను ఇంటికి ఎందుకు పంపలేదని మైఖేల్ వాన్ నిలదీశారు. ఈ ప్లేయర్ లందరినీ కోల్ క‌తాలో ఉంచి నరకం చూపించారని మండిపడ్డారు.

దొంగల్లాగా వాళ్లను కోల్కతాలోని ( Kolkata) ఉంచి చుక్కలు చూపించారని నిప్పులు చెరిగారు. డారెన్ స‌మీ ( Daren Sammy) ఎన్ని ట్వీట్లు పెట్టినా, ప‌ట్టించుకోలేద‌ని విమ‌ర్శ‌లు చేశారు. ఇక ఇంగ్లాండ్ మార్చి 5వ తేదీన సెమీ ఫైనల్ లో ఎలిమినేటర్ అయింది. అయితే ఇంగ్లాండ్ కు మాత్రం 36 గంటల్లోపే ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్ వేయించి మరీ, ఐసీసీ పంపించినట్లు గుర్తు చేశారు మైఖేల్ వాన్. దక్షిణాఫ్రికా ( South Africa), వెస్టిండీస్ ( West indies) క్రికెట్ బోర్డుల కంటే ఇంగ్లాండ్ చాలా బలమైనది. అందుకే బీసీసీఐ, ఐసీసీ కుట్రలు చేసి ముందుగానే ఇంగ్లాండ్ జట్టును ( England) సొంత దేశానికి పంపిందని మండిపడ్డారు. బలహీనమైన క్రికెట్ జట్లపైన ఒకలాగా, బలమైన క్రికెట్ జట్లపైన మరొక లాగా బీసీసీఐ, ఐసీసీ వ్యవహరించాయని సీరియస్ అయ్యారు. దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

Advertisement

Also Read: T20 World Cup 2026: పేరుకే మోడీ స్టేడియం..కానీ మొత్తం దోపిడే, ఒక్క వాట‌ర్ బాటిల్ రూ.100

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×