Tattoo: ట్యాటూలు.. కేవలం చర్మంపై గీసిన చిత్రాలు మాత్రమే కాదు. అవి మీ అంతర్గత భావాలకు నిదర్శనాలు. మనం ఎంచుకునే డిజైన్ ఎంత ముఖ్యమో.. దానిని శరీరంపై ఎక్కడ వేయించుకుంటున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. ట్యాటూ ప్లేస్‌మెంట్ అనేది ఒక వ్యక్తి యొక్క సామాజిక దృక్పథాన్ని, వారి మనస్తత్వాన్ని అంతే కాకుండా వారు ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అనే విషయాన్ని ప్రతిబింబిస్తుంది. బాడీ లాంగ్వేజ్ నిపుణుల ప్రకారం.. 20 విభిన్న శరీర భాగాలపై ట్యాటూలు ఇతరులకు ఎలాంటి సందేశాలను పంపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ట్యాటూ వేయించుకునే స్థానం మీ ధైర్యాన్ని, సున్నితత్వాన్ని లేదా రహస్య స్వభావాన్ని తెలియజేస్తుంది. ఆ 20 స్థానాలు , వాటికి అర్థాలు ఇవే..
1. ముఖం :
ముఖంపై ట్యాటూ అంటే.. “నేను ఎవరికీ భయపడను” అని అర్థం. ఇతరులకు మీరు చాలా తిరుగుబాటు స్వభావం కలవారిగా.. సామాజిక నియమాలను లెక్కచేయని వారిగా కనిపిస్తారు.
2. మెడ వెనుక:
ఇది ఒక రకమైన ద్వంద్వ స్వభావాన్ని సూచిస్తుంది. అవసరమైనప్పుడు జుట్టుతో దాచుకోవచ్చు. కావాలన్నప్పుడు చూపించుకోవచ్చు. మీరు మీ జీవితంలో నియంత్రణను కోరుకుంటారని ఇది సూచిస్తుంది.
3. చెవి వెనుక :
మీరు చాలా సున్నిత మనస్కులని, మీకంటూ ఒక సొంత ప్రపంచం ఉందని ఇది చెబుతుంది. ఇది రహస్యంగా ఉండే మనస్తత్వాన్ని సూచిస్తుంది.
4. గొంతు :
ఇక్కడ ట్యాటూ ఉంటే మీరు చాలా ధైర్యవంతులని, మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతారని ఇతరులు భావిస్తారు.
5. భుజం :
ఇది బలానికి చిహ్నం. మీరు బాధ్యతలను మోసే వ్యక్తి అని, మీ జీవితంలో ఒక గమ్యం ఉందని ఇతరులు అనుకుంటారు.
6. ఛాతీ:
గుండెకు దగ్గరగా ఉండే ఈ భాగం ప్రేమను సూచిస్తుంది. ఏదైనా విషయం లేదా వ్యక్తి మీ హృదయానికి చాలా దగ్గర అని దీని అర్థం.
7. వీపు :
వీపుపై ట్యాటూ వేయించుకునే వారు కొంచెం మిస్టరీగా కనిపిస్తారు. మీరు గతాన్ని వెనక వదిలేశారని లేదా పెద్ద నిర్ణయాలకు సిద్ధంగా ఉన్నారని ఇది చెబుతుంది.
8. ముంజేయి :
చాలా మంది ముంజేయిపై ట్యాటూ కనిపిస్తుంది. వీరు ఆలోచనలను ప్రపంచానికి గర్వంగా చాటిచెప్పే వ్యక్తి అని అర్థం. చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తారు.
9. మణికట్టు :
మణికట్టు లోపలి వైపు ట్యాటూ ఉంటే మీరు చాలా భావోద్వేగ పరులని, ఆ డిజైన్ మీ ఆత్మకు దగ్గరైనదని సూచిస్తుంది.
10. వేళ్లు :
చిన్నవి కానీ శక్తివంతమైనవి. మీరు ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటారని.. చాలా క్రియేటివ్ అని ఇతరులు భావిస్తారు.
11. అరచేయి :
ఇక్కడ ట్యాటూ వేయించుకోవడం చాలా నొప్పినిస్తుంది. కాబట్టి మీరు శారీరక, మానసిక నొప్పిని తట్టుకోగల మొండివారని ఇతరులు గుర్తిస్తారు.
12. పొత్తికడుపు :
ఇది చాలా ప్రైవేట్ ప్లేస్. మీరు మీ వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పరని.. కేవలం సన్నిహితులకు మాత్రమే మీ అసలు రంగు చూపిస్తారని అర్థం.
13. తొడ:
ఇది రహస్యానికి , ఆకర్షణకు చిహ్నం. మీరు కొంచెం అంతర్ముఖులు అని, మీలో చాలా లోతైన భావాలు ఉన్నాయని సూచిస్తుంది.
14. మోకాలు :
ఇది చాలా కష్టమైన ప్లేస్. జీవితంలోని అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీకు ఉందని ఇతరులు అర్థం చేసుకుంటారు.
15. పిక్కలు :
మీరు క్రీడల పట్ల ఆసక్తి ఉన్నవారని లేదా చాలా చురుకైన వారని ఇది చెబుతుంది.
16. చీలమండ :
మీరు స్వేచ్ఛను ఇష్టపడే వ్యక్తి అని, ప్రయాణాల పట్ల మక్కువ కలిగిన వారని ఇది సూచిస్తుంది.
17. పాదం :
పాదంపై ట్యాటూ ఉంటే మీరు చాలా గ్రౌండెడ్ (విలువలకు కట్టుబడే) వ్యక్తి అని అర్థం.
18. పక్కటెముకలు :
ఇక్కడ ట్యాటూ వేయించుకోవాలంటే.. చాలా ఓపిక కావాలి. మీరు లోపల చాలా బలంగా ఉంటారని, ఏదైనా సాధించగలరని ఇది చెబుతుంది.
19. వెన్నెముక:
మీరు మీ విలువలకు, నమ్మకాలకు వెన్నెముకలా నిలబడతారని ఇతరులకు ఒక గంభీరమైన సందేశాన్ని పంపుతుంది.
20. కాలి వేళ్లు:
ఇది సరదాగా ఉండే మనస్తత్వాన్ని సూచిస్తుంది. మీరు చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని వెతుక్కుంటారని అర్థం.