Relationships In 2025: నేటి ఆధునిక యుగంలో.. మానవ సంబంధాలు ఎన్నో ఒత్తిళ్లకు లోనవుతున్నాయి. పని ఒత్తిడి, సామాజిక మాధ్యమాలు, ఆర్థిక సమస్యలు.. ఇవన్నీ భార్యాభర్తలు లేదా భాగస్వాముల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి. సాధారణంగా.. సంబంధాలు విచ్ఛిన్నం కావడానికి ప్రధాన కారణం సరైన సంభాషణ లేకపోవడం, అంచనాలు నెరవేరకపోవడం. ఈ సమస్యలను పరిష్కరించడానికి.. 2025లో ప్రపంచ వ్యాప్తంగా కౌన్సిలింగ్ థెరపిస్ట్‌లు జంటలకు ఒకే ఒక్క ప్రశ్నను సిఫార్సు చేస్తున్నారు. ఈ ప్రశ్నకు ఉన్న శక్తి ఏమిటంటే.. ఇది నిందలు వేయడం లేదా ఫిర్యాదుల నుంచి దృష్టిని మళ్లించి, సమస్యను పరిష్కరించే దిశగా భాగస్వాములను నడిపిస్తుంది.
బంధాన్ని నిలబెడుతున్న ఆ ఒక్క ప్రశ్న ఇదే !
సాధారణంగా భాగస్వాములు ఒకరికొకరు నిందించుకోవడం లేదా సమస్య గురించి పదే పదే మాట్లాడటం చేస్తుంటారు. అయితే.. సమస్యను పరిష్కరించడానికి థెరపిస్ట్‌లు అడగమనే ఆ మంత్రం ఇది.
నిందల నుంచి పరిష్కారం వైపు ప్రయాణం:
సాధారణంగా భాగస్వాముల సంభాషణ ఇలా ఉంటుంది: “నువ్వు ఎప్పుడూ ఇంటి పనుల్లో సహాయం చేయవు,” లేదా “నువ్వు నా మాట వినడం లేదు.” ఈ వాక్యాలు అవతలి వ్యక్తిని ఇబ్బందులలోకి నెట్టేస్తాయి. కానీ.. పైన చెప్పిన ప్రశ్నను అడగడం ద్వారా.. వారిలొ కాలక్రమేణా కొన్ని రకాల మార్పులు వస్తాయి.
బాధ్యత : “నేను మీకోసం ఏం చేయగలను?” అని అడగడం ద్వారా.. మీ భాగస్వామికి మద్దతు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారని, మార్పుకు బాధ్యత వహించడానికి మీరు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తారు. ఇది మీ ప్రేమను, నిబద్ధతను తెలియజేస్తుంది.
నిర్దిష్టత: “మరింత సహాయం చేయండి” అనేది సాధారణమైన కోరిక. కానీ ఈ ప్రశ్నను అడిగినప్పుడు.. భాగస్వామి “ప్రతి మంగళవారం చెత్తను బయట పడేయండి” లేదా “సాయంత్రం టీ తాగేటప్పుడు 10 నిమిషాలు నా వైపు చూడండి” వంటి ఒక నిర్దిష్టమైన, చిన్న పనిని అడుగుతారు. ఈ చిన్న పనులను అమలు చేయడం చాలా సులభం, ఇది తక్షణమే సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
భావోద్వేగ భద్రత: ఈ ప్రశ్న అడగడం ద్వారా.. సంబంధంలో అభద్రత స్థానంలో సురక్షితమైన అనుబంధం పెరుగుతుంది. భాగస్వామి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే భావన కలుగుతుంది.
బంధం నిలబడటానికి కీలకం:
ఈ ప్రశ్న ప్రతి వారం అడగడం ద్వారా.. సంబంధంలో ఎమోషనల్ స్కోర్‌కీపింగ్ (నేను ఎక్కువ చేశాను, నువ్వు తక్కువ చేశావు అనే లెక్కలు వేసుకోవడం) తగ్గిపోతుంది. మీ భాగస్వామి ఆనందంగా ఉండటానికి కావాల్సిన “ఒక చిన్న పని”పై మీరు దృష్టి పెడతారు. ప్రతి వారం ఆ చిన్న కోరిక నెరవేరినప్పుడు.. ఇద్దరి మధ్య నమ్మకం, సంతృప్తి పెరుగుతాయి.
ప్రతి వారం ఒక మార్పు గురించి మాట్లాడటం ద్వారా.. మీ సంబంధం నిస్సారంగా మారకుండా.. నిరంతరం అభివృద్ధి చెందే క్రియా శీల భాగస్వామ్యంగా మారుతుంది. ఇది 2025లో థెరపిస్ట్‌లు బంధాలను రక్షించడానికి చెబుతున్న అత్యంత ప్రభావ వంతమైన, సులభమైన మంత్రం.. మీరూ ఈ రోజు నుంచే దీన్ని ప్రారంభించండి.