E-Paper
Advertisement

IBomma Ravi Father: వాళ్లు ఏం అయిన ఆకాశంలో నుంచి ఊడి పడ్డారా.. మెగా హీరోలపై ఐ బొమ్మ రవి తండ్రి షాకింగ్ కామెంట్

IBomma Ravi Father: వాళ్లు ఏం అయిన ఆకాశంలో నుంచి ఊడి పడ్డారా.. మెగా హీరోలపై ఐ బొమ్మ రవి తండ్రి షాకింగ్ కామెంట్
Advertisement

IBomma Ravi Father: ఐ బొమ్మ రవి(IBomma Ravi)అరెస్టు కావడంతో రవికి సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా రవి అరెస్టు కావడంతో తన తండ్రి అప్పారావు(Appa Rao) కూడా వరుసగా మీడియాతో సమావేశం అవుతూ తన కొడుకు గురించి ఆయన చేసిన తప్పులు గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే తాజాగా రవి తండ్రి అప్పారావు బిగ్ టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా రవి గురించి అలాగే సినిమా ఇండస్ట్రీ గురించి ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వండి..

సినిమాల విషయంలో తన కొడుకు చేసిన పనిని తాను సమర్థించనని తెలిపారు. అలాగే తన కొడుకును ఎన్కౌంటర్ చేయాలి అంటూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలను కూడా స్వాగతించనని తెలిపారు. నా కొడుకు చేసిన తప్పుకు చట్టం శిక్ష విధిస్తుందని అప్పారావు తెలిపారు. ఇక సినిమా ఇండస్ట్రీ గురించి కూడా ఈయన మాట్లాడుతూ… సినిమా ఇండస్ట్రీలో ఒక్క సినిమా చేయాలి అంటే వేల కోట్ల బడ్జెట్ అవుతుందని అయితే ఇలా వేలకోట్లు ఖర్చు చేయకుండా కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలని తెలిపారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోల కంటే అందంగా ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్, నాగార్జున, చిరంజీవి లాంటి హీరోలు ఎలా ఉండేవారో వాళ్ళ మొదటి సినిమాలు చూస్తేనే తెలుస్తుంది. అల్లు రామలింగయ్య గొప్ప నటుడు ఆయన కూతురిని చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేయడంతో చిరంజీవి హీరోగా సక్సెస్ అయ్యారు అలాగే తన తమ్ముని కూడా తీసుకువచ్చారు.

ఆకాశంలో నుంచి ఊడి పడ్డారా?

Advertisement

ఇలా ఇండస్ట్రీలో మెగా హీరోలు మాత్రమే కొనసాగడానికి వాళ్ళు ఏమైనా ఆకాశంలో నుంచి ఊడి పడ్డారా? బయట ఎంతోమంది మంచి నటన నైపుణ్యం ఉండి అందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలా కొత్త వాళ్లకు అవకాశం కల్పిస్తే వాళ్లు కూడా సినిమాల ద్వారా వారి టాలెంట్ నిరూపించుకుంటారు .కొత్త వాళ్లు ఒకటి రెండు సినిమాలు చేస్తే ప్రేక్షకులు వారిని కూడా ఆదరిస్తారని తెలిపారు. ఎంతసేపు ఉన్న హీరోలకే కోట్లు కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తూ సినిమా రేట్లు పెంచుతున్నారని రవి తండ్రి అప్పారావు తెలిపారు.

Advertisement

ఇలా కొత్త వాళ్లకు అవకాశాలు కల్పించినప్పుడే సినిమా చేయడానికి కూడా డబ్బులు తక్కువ అవుతాయని ఇతరులకు కూడా జీవితాన్ని ప్రసాదించిన వాళ్లు అవుతారని , దయచేసి కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వమని ఈ సందర్భంగా రవి తండ్రి తనఅభిప్రాయాలను తెలియజేశారు. ఇలా రవి చేస్తున్న వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అప్పారావు మెగా కుటుంబం గురించి మాట్లాడటంతో మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన మరికొంతమంది ఆయన చేసిన వ్యాఖ్యలలో తప్పులేదని, ఈయనకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక అప్పారావు కూడా తన కొడుకు చేసిన పని ఒప్పు అని ఎక్కడ సమర్పించకపోవడం విశేషం.

Also Read: I Bomma Ravi: ఐబొమ్మ రవిని పట్టించింది పెళ్ళాం కాదు… ఫ్రెండ్.. ఆ రోజు అసలేం జరిగిందంటే?

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×