E-Paper
Advertisement

Garlic Spray: వెల్లుల్లి స్ప్రే ఇలా తయారుచేశారంటే ఇంట్లో దోమలు పారిపోతాయి

Garlic Spray: వెల్లుల్లి స్ప్రే ఇలా తయారుచేశారంటే ఇంట్లో దోమలు పారిపోతాయి
Advertisement

ఇంట్లో దోమలు, ఈగలు, చిన్నచిన్న పురుగులు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో దోమలు అధికంగా పెరిగిపోతాయి. మార్కెట్లో దోమల కాయిల్స్, లిక్విడ్స్, కెమికల్ స్ప్రేలున్నా… వాటిలో ఉన్న రసాయన పదార్థాలు ఆరోగ్యానికి హానికరం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఇంట్లోనే సహజ పదార్థాలతో తయారు చేసే వెల్లుల్లి స్ప్రే మంచి ప్రత్యామ్నాయం అవుతోంది. ఖర్చు తక్కువ, తయారీ సులభం, దుష్ప్రభావాలు ఉంటాయి. అందుకే ఇప్పుడు చాలామంది ఈ వెల్లుల్లి స్ప్రేను ఇంట్లో చేసుకొని వాడుతున్నారు.

వెల్లుల్లి స్ప్రే అంటే ఏమిటి?
వంటగదిలోనే లభించే వెల్లుల్లి, మిరపకాయల్ని కలిపి నీటితో మరిగించి తయారు చేసే ఈ స్ప్రేను దోమలు, ఈగలు వంటివి దూరం చేసేందుకు వినియోగిస్తారు. వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే పదార్థం పురుగులు తట్టుకోలేని వాసనను విడుదల చేస్తుంది. అందుకే దోమలు ఉన్న ప్రదేశాల్లో దీనిని స్ప్రే చేస్తే అవి వెంటనే దూరంగా పారిపోతాయి.

Advertisement

దీన్ని తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు
వెల్లుల్లి రెబ్బలు – 5 నుండి 6
ఎండుమిరపకాయలు – 2 నుంచి 3
నీరు – 1 లీటర్
నిమ్మ గడ్డి లేదా యూకలిప్టస్ ఆయిల్ – రెండు స్పూన్లు

ఎలా తయారు చేయాలి?
మొదట వెల్లుల్లి రెబ్బలను శుభ్రంగా పొట్టు తీసి పేస్ట్‌లా మెత్తగా నూరాలి. వీటితో పాటు ఎండుమిరపకాయల్ని కూడా పేస్ట్ చేయాలి. తరువాత ఒక పెద్ద పాత్రలో నీటిని పోసి వేడి చెయ్యాలి. నీరు మరిగే సమయంలో వెల్లుల్లి, మిరప పేస్ట్ వేసి పది నిమిషాలు మరిగించాలి. మరిగిన తరువాత పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన మిశ్రమాన్ని శుభ్రమైన గుడ్డ లేదా ఫిల్టర్‌తో వడగట్టి ద్రవాన్ని స్ప్రే బాటిల్లో నింపాలి. వాసన కొంచెం బలంగా అనిపిస్తే చివరలో 3–4 చుక్కలు నిమ్మగడ్డి లేదా పుదీనా ఆయిల్ వేసుకోవచ్చు.

Advertisement

ఎక్కడ ఎలా వాడాలి?
ఈ స్ప్రేను దోమలు ఎక్కువగా వచ్చే కిటికీలు, తలుపుల దగ్గర స్ప్రే చేయాలి. చెత్త బుట్టల చుట్టూ, వంటగది మూలల్లో, బెడ్‌రూంలో పడకల కింద వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది. రోజుకు కనీసం 2–3 సార్లు స్ప్రే చేస్తే ఇంట్లో దోమలు ఉండే అవకాశం తగ్గుతుంది. బయట కూర్చునే ప్రదేశాల్లో కూడా వాడుకోవచ్చు. ఈ స్ప్రే మనుషులకు, పెంపుడు జంతువులకు నేరుగా హాని చేయదు. కానీ నేరుగా చర్మంపై స్ప్రే చేయకపోవడం మంచిది. ముఖ్యంగా పిల్లలు, పెట్స్ ఉన్న ఇళ్లలో ఇది కెమికల్ స్ప్రేల కంటే చాలా సురక్షితమైన ఎంపిక.

ఇది ఎలా పనిచేస్తుంది?
వెల్లుల్లిలో ఉండే సహజ సంయోగ పదార్థాలు దోమలకు అసహ్యం కలిగించే వాసనను విడుదల చేస్తాయి. అలిసిన్ వాసన చాలా తీవ్రంగా ఉండటం వలన దోమలు దగ్గరికి రావు. అదే విధంగా ఎండు మిరపకాయల్లోని క్యాప్సైసిన్ పురుగులకు చికాకు కలిగిస్తుంది. ఈ రెండింటి కలయిక పురుగులను గందరగోళానికి గురి చేసి దూరంగా తరిమేస్తుంది.

ఈ జాగ్రత్తలు తీసుకోండి
స్ప్రే వాడే ముందు బాటిల్ బాగా షేక్ చేయాలి. మిశ్రమం సహజ పదార్థాలతో తయారవుతున్నందున 4–5 రోజుల్లో పాడైపోయే అవకాశముంది. కాబట్టి చిన్న పరిమాణాల్లోనే తయారు చేసుకోవాలి. కళ్ళలో పడకుండా జాగ్రత్త. ఫర్నిచర్ లేదా అలంకార వస్తువులపై నేరుగా స్ప్రే చేయకుండా పక్క ప్రాంతాల్లో వాడాలి.

Related News

లగ్జరీ లైఫ్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ జీవిస్తారు

మీ పిల్లలు రాత్రి 10 వరకు మేల్కొంటున్నారా? త్వరగా నిద్రపోయేందుకు ఈ టిప్స్ పాటించండి

పాలు తాగడం ఇష్టం లేదా? కాల్షియం కోసం ఈ 8 ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి

ఖరీదైన ఫేస్‌వాష్ అవసరం లేదు.. కిచెన్‌లో లభించే ఈ ఐటెమ్స్‌తో మీ ఫేస్ డీప్ క్లీన్

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

Big Stories

Advertisement
×