Raju Weds Rambai : కొన్ని సినిమాలలో ఎవరూ ఊహించని స్టోరీ ఉంటుంది. ఇలా కూడా జరుగుతుందా అనిపించేలా ఒక ఆలోచనని కొన్ని సినిమాలు పుట్టిస్తాయి. మెగా హీరో వైష్ణవ తేజ్ హీరోగా పరిచయమైన సినిమా ఉప్పెన. బుచ్చిబాబు దర్శకుడుగా పరిచయమైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా గురించి అప్పట్లో రకరకాల వార్తలు వినిపించాయి. మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటే మెగాస్టార్ చిరంజీవి కథన వినడం సహజంగా జరుగుతుంది. ఒక సందర్భంలో బుచ్చిబాబు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ కథను విన్న తర్వాత వైష్ణవ తేజ్ ను పిలిచి ఈ సినిమా నువ్వు చేస్తావా? నన్ను చేసే మంటావా అని అడిగారట. అయితే దీని మీద విపరీతమైన ట్రోలింగ్ కూడా నడిచింది. అలా నడవడానికి కూడా కారణం ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు సినిమా కాన్సెప్ట్ లో అలాంటి పాయింట్ ఉంటుంది.
నవంబర్ 21వ తారీఖున రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ సినిమా గురించి విపరీతంగా మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో ఎవరు ఊహించని విధంగా క్లైమాక్స్ ఉండబోతుంది అని తెలుస్తుంది.
సోషల్ మీడియాలో ఒక మీమ్ విపరీతంగా వైరల్ అయింది. అయితే దానినే ఈ సినిమాలో పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ విషయం యావత్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీని షాప్ కి గురిచేస్తుంది. ఈ సినిమాలో హీరో చచ్చిపోతాడు అని టాలీవుడ్ వర్గాల్లో టాపిక్.
ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కొద్ది రోజుల క్రితమే విడుదలైంది. ట్రైలర్ విపరీతంగా చాలామందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా సిద్దు జొన్నలగడ్డ అన్నయ్య చైతు జొన్నలగడ్డ చేసిన వెంకన్న అనే పాత్ర మంగపతి గుర్తు చేసింది. సినిమా కథ కూడా చాలా రియలాస్టిక్ అనిపించింది.
ప్రముఖ దర్శకుడు వేణు ఈ సినిమాను నిర్మించారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన నీది నాది ఒకే కథ, విరాటపర్వం సినిమాలు మంచి పేరు సాధించాయి. విరాటపర్వం మాత్రం కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ ప్రశంసలు మాత్రం బాగా వచ్చాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అతను ప్రత్యేకమైన దర్శకుడుగా పేరు సాధించుకున్నాడు. ఇప్పుడు నిర్మాతగా కూడా కొంత ప్రత్యేకతను సాధించుకున్నాడు అని అందరికీ అనిపిస్తుంది. సినిమా రిజల్ట్ తో అది రుజువయ్య అవకాశం ఉంది.