E-Paper
Advertisement

గోళ్లు-కనుబొమ్మలు-కాలివేళ్లు.. ఇవే ఓ వ్యక్తి సంపద రహస్యం, కాకపోతే

గోళ్లు-కనుబొమ్మలు-కాలివేళ్లు.. ఇవే ఓ వ్యక్తి సంపద రహస్యం, కాకపోతే
Advertisement

Person Secret Wealth: వ్యక్తి శరీర భాగాలు, ఆకారం స్వభావం, వ్యక్తిత్వం ఇవన్నీ జీవితంతో ముడిపడి ఉంటాయి. దీనివల్ల ఆ వ్యక్తి జీవితం ఏంటో కొందరు ఠక్కున చెప్పేస్తారు. పూర్వం అలాగే చెప్పేవారు.. అక్షరాలా నిజమయ్యేవి. మనిషి శరీరంలోని కొన్ని భాగాల వల్ల సదరు వ్యక్తి జీవితం గురించి ఇంకా ఈజీగా చెప్పేయవచ్చు. వాటిలో ముఖ్యమైనవి కాలివేళ్లు, చేతివేళ్లు, చెవులు, గోళ్లు, కనుబొమ్మలు. ఓ వ్యక్తి సంపదను ఈజీగా అంచనా వేయవచ్చని అంటుంటారు. ఆ వ్యక్తికి మనీ ఏ స్థాయిలో సంపాదిస్తారో గుర్తు పట్టేయవచ్చు.

సాముద్రిక శాస్త్రం ద్వారా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. వ్యక్తి శరీర నిర్మాణం, భాగాల ఆకారం, స్వభావం వంటివి జీవితంతో ముడిపడి ఉంటాయి. కాలివేళ్లు, చేతివేళ్లు, చెవులు, గోళ్లు, కనుబొమ్మలు, శరీర రోమాలు సదరు వ్యక్తి వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తాయి. ఇలాంటి నమ్మకాలు సాంప్రదాయ సాముద్రిక శాస్త్రంపై ఆధారపడి ఉంటాయి.

Advertisement

కాలివేలు- సాముద్రిక శాస్త్రం ప్రకారం.. కాలివేలు వ్యక్తి పలుకుబడి, ఆధ్యాత్మిక మొగ్గుకు సంకేతంగా చెబుతారు. కాలివేలు పెద్దగా, పొడవుగా ఉండే వారి స్వభావానికి చిహ్నంగా భావిస్తారు. కాలి బొటనవేలు పొడవుగా ఉంటే పలుకుబడి వ్యక్తిగా ఉంటారని కొందరు భావన. కాలి బొటనవేలు పొట్టిగా ఉంటే ఆర్థిక స్థితి, స్వార్థపూరిత ప్రవృత్తులకు సంకేతంగా చెబుతుంటారు.

చేతి వేళ్లు- చేతివేళ్లు వ్యక్తి ఆలోచనలు, ఆసక్తిని వెల్లడిస్తాయని నమ్ముతారు. పొడవాటి, సన్నని వేళ్లు ఉన్నవారని కళాత్మకంగా, సృజనాత్మకంగా ఉంటారని అంటుంటారు. లావుగా, బిరుసుగా ఉండే చేతి వేళ్లు వారు జీవితంలో ఎక్కువ కష్టాలు ఉంటాయని చెబుతారు. వంకర వేళ్లు ఆర్థిక విజయం, ఆరోగ్య సవాళ్లకు సంకేతంగా సూచిస్తారు. ముడిపడిన వేళ్లు అత్యంత స్వార్థపూరిత స్వభావంగా చెబుతారు.

Advertisement

పొడవాటి చేతి గోళ్లు- ఒక వ్యక్తి అదృష్టాన్ని సూచిస్తాయి. వంకర గోళ్లు జీవితంలో మరిన్ని కష్టాలు తెచ్చిపెడతాయన్నది పెద్దల నమ్మకం. గోళ్ల కింద కనిపించే పెద్ద నెలవంక మంచి ఆరోగ్యానికి చిహ్నంగా చెబుతారు. అది లేకపోతే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుందని నమ్మకం. సాంప్రదాయ నమ్మకాల ప్రకారం.. గోళ్లపై అకస్మాత్తుగా ఏర్పడే తెల్లటి మచ్చలు ఆరోగ్యానికి సంకేతంగా చెబుతారు.

ALSO READ: లీవ్ కోసం బాస్‌కి 50 వింత సాకులు చెప్పిన డెవలపర్.. చివరికి ఏమైందో తెలిస్తే షాక్ అవుతారు!

పెద్ద చెవులు ఉన్నవారిని దీర్ఘాయువుకు చిహ్నంగా సూచన చేస్తుంటారు. ఏనుగులాంటి మనిషిగా చెబుతుంటారు. చిన్న చెవులు సాపేక్షంగా తక్కువ ఆయుర్దాయం, వారి జీవితం కష్టాలతో ముడిపడి పెడతారు. ఇక చెవులపై వెంట్రుకలు విజయం, పోరాటం, దీర్ఘాయువుకు సంకేతంగా పరిగణించబడతాయి. పొడవాటి చెవులు ఉన్నవారు ప్రభావశీలురు, సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు, ఆధ్యాత్మికంగా ఉంటారని భావిస్తారు.

కళ్ళపై దట్టంగా ఉండే కనుబొమ్మలు- ఇవి వ్యక్తి సరళ స్వభావాన్ని సూచిస్తాయి. రెండు కనుబొమ్మలు మధ్యలో కలిస్తే ఆ వ్యక్తి చాలా కోపిష్టిగా చెబుతారు. అలాగే డబ్బున్నవాడిగా పరిగణిస్తారు. వారు ఎక్కడికి వెళ్లినా డబ్బుకు కొదవ ఉండదని అంటుంటారు. కనుబొమ్మలు పలుచగా ఉండే ఆ వ్యక్తి మానసిక ఒత్తిడికి సంకేతంగా భావిస్తారు. కిందికి వాలి ఉండే కనుబొమ్మలు నిర్లిప్తత భావనతో ముడిపడి ఉంటాయన్నది భావన.

Related News

వంట గిన్నెలు, తవాలపై జిడ్డు మొండిగా ఉందా? సింపుల్‌గా క్లీన్ చేసే చిట్కా ఇదిగో

ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతోందా? మెయిన్ డోర్ దగ్గర ఈ 7 పొరపాట్లు మానేయండి

వినాయక చవితి తిథి వివరాలు, తొలి పూజ విశిష్టత!

జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నారా? కండరాలు నిజంగా పెరుగుతున్నట్లు సూచించే 5 సంకేతాలివే

కష్టకాలంలో ఎవరు తోడుగా నిలబడతారు, ఎవరు దూరంగా ఉంటారు.. ఇలా గుర్తించండి

లగ్జరీ లైఫ్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ జీవిస్తారు

మీ పిల్లలు రాత్రి 10 వరకు మేల్కొంటున్నారా? త్వరగా నిద్రపోయేందుకు ఈ టిప్స్ పాటించండి

పాలు తాగడం ఇష్టం లేదా? కాల్షియం కోసం ఈ 8 ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి

Big Stories

Advertisement
×