E-Paper
Advertisement

12 స్టేషన్లు.. 320 కి.మీ స్పీడ్.. బుల్లెట్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారు!

12 స్టేషన్లు.. 320 కి.మీ స్పీడ్.. బుల్లెట్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారు!
Advertisement

India’s First Bullet Train: దేశ ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తొలి బుల్లెట్ రైలు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్‌ లో తొలి దశ సర్వీసులు అందించేందుకు సిద్ధం అవుతోంది. 2027 ఆగస్టు 15న ఈ రైలును ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

భారతీయ రైల్వేలో కీలక మైలురాయి

ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు భారత రైల్వే చరిత్రలో ఒక కీలక మైలురాయి కానుంది. జపాన్‌లో విజయవంతంగా నడుస్తున్న షింకన్సెన్ హైస్పీడ్ రైలు సాంకేతికతను భారత్‌ లో తొలిసారిగా ఉపయోగించనున్నారు. వేగం, భద్రత, టైమ్ మెయింటెనెన్స్ లో ఈ వ్యవస్థ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది.

508 కిలో మీటర్ల మేర బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణం

Advertisement

ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు మొత్తం 508 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ మహారాష్ట్ర, గుజరాత్, దాద్రా నగర్ హవేలీ ప్రాంతాల మీదుగా వెళ్తుంది. ఈ మార్గంలో మొత్తం 12 స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుంచి ప్రారంభమయ్యే ఈ మార్గం థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్ మీదుగా చివరకు సబర్మతి వరకు చేరుతుంది.  ప్రాజెక్టు పూర్తిగా ఒకేసారి అందుబాటులోకి రాకపోయినా, తొలి దశలో కారిడార్‌ లోని ఒక భాగంలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత మిగిలిన పనులు పూర్తయ్యే కొద్దీ మొత్తం మార్గంలో బుల్లెట్ రైలు సేవలను విస్తరిస్తారు.

గరిష్టంగా 320 కి.మీ వేగంతో ప్రాయణం

ఈ హైస్పీడ్ రైలు గంటకు గరిష్టంగా 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. సాధారణంగా ఆపరేషన్ సమయంలో 300 నుంచి 320 కిలోమీటర్ల వేగంతో నడిచే అవకాశం ఉంది. ప్రస్తుతం ముంబై నుంచి అహ్మదాబాద్‌కు ఎక్స్‌ ప్రెస్ రైళ్లలో ప్రయాణించాలంటే దాదాపు ఆరు గంటలు పడుతోంది. అయితే, బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే అదే ప్రయాణాన్ని సుమారు రెండు గంటల్లో పూర్తి అవుతుంది. ప్రయాణికుల సమయం చాలా ఆదా అవుతుంది.

Advertisement

ఇక ఈ ప్రాజెక్టులో జపాన్ ప్రభుత్వం ఆర్థిక సహాయంతో పాటు సాంకేతిక సహకారాన్ని కూడా అందిస్తోంది. భూకంపాలను తట్టుకునే ప్రత్యేక నిర్మాణ పద్ధతులు, అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థ, ఆటోమేటిక్ భద్రతా సాంకేతికత లాంటి అత్యాధునిక  అంశాలను ఇందులో ఉపయోగిస్తున్నారు. దీంతో ప్రయాణం మరింత సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు పూర్తయితే ముంబై, అహ్మదాబాద్ మధ్య ప్రయాణం మాత్రమే కాకుండా రెండు నగరాల మధ్య వ్యాపారం, పరిశ్రమలు, పర్యాటకం, పెట్టుబడులు కూడా మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. భవిష్యత్తులో దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు కూడా ఈ హైస్పీడ్ రైలు కారిడార్లను విస్తరించే అవకాశాలు ఉన్నాయి.

Read Also: టికెట్ ఉంటే స్టేషన్‌ లో ఎంతసేపు ఉండొచ్చు? చాలామందికి తెలియని రైల్వే రూల్!

Related News

కాచిగూడ స్టేషన్‌ కు మెగా మేకోవర్.. రూపు మారుతుంది.. కానీ, వారసత్వం చెక్కుచెదరదు!

టికెట్ ఉంటే స్టేషన్‌ లో ఎంతసేపు ఉండొచ్చు? చాలామందికి తెలియని రైల్వే రూల్!

స్పీడందుకుంటున్నాయ్ లగ్జరీ ప్రయాణాలు.. విజయవాడ ప్రయాణికులకు వందే భారత్ స్లీపర్ ధమాకా!

వీధులను ముంచెత్తిన బీరు వరద.. ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసిన ఘటన గురించి మీకు తెలుసా?

పక్షులతో యుద్ధం చేసి ఓడిపోయిన దేశం.. ఈ ఆసక్తికర చరిత్ర మీకు తెలుసా?

విమానాలతో పోటీపడి దూసుకెళ్తున్న రైళ్లు.. వీటి స్పీడ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

గోవా కంటే బెటర్.. పర్యాటకులను ఆకట్టుకుంటున్న 5 కొత్త టూరిస్ట్ డెస్టినేషన్స్

Big Stories

Advertisement
×