Leftover Roti Dosa| ఇంట్లో రాత్రి భోజనం కోసం చేసిన రోటీలు మిగిలిపోతే చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆ మిగిలిన రొట్టెలను ఉపయోగించి ఉదయం రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకోవచ్చు. ఈ రోటీ దోశ చేసేందుకు చాలా సులభం పైగా వ్యర్థాన్ని మిగిల్చే తెలివైన రెసిపీ. ఆహార వృథాను తగ్గించే ఈ రెసిపీ చాలా ఆరోగ్యకరం, పైగా తింటే కడుపు నిండుగా ఉంటుంది. ఈ వంట ఉదయం సమయం లేనప్పుడు ఈ రోటీ దోశ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ రెసిపీ జీరో వేస్ట్ కుకింగ్‌కు ఓ మంచి ఉదాహరణ. మిగిలిన రొట్టెలను మంచి క్రియేటివిటీతో ఉపయోగించాలి. ఈ దోశ క్రిస్పీగా, రుచికరంగా ఉండడంతో పాటు పోషకాలతో నిండి ఉంటుంది. తయారు చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా సాయంత్రం స్నాక్‌గా ఆనందంగా తినవచ్చు.
ముందుగా రొట్టెలను చిన్న చిన్న ముక్కలుగా విరగ్గొట్టండి. ఒక గిన్నెలో శనగపిండి, స్పైసెస్, పెరుగు, కొంత నీళ్లు కలిపి మెత్తని పిండి తయారు చేయండి. తరిగిన కూరగాయలు, కొత్తిమీర వేసి బాగా కలపండి. ఇప్పుడు రోటీ ముక్కలను ఈ పిండిలో వేసి కొన్ని నిమిషాలు నానబెట్టండి.
ఒక నాన్-స్టిక్ పాన్ ని తీసుకోండి.. మీడియం ఫ్లేమ్ మీద వేడి చేయండి. కొంచెం నూనె లేదా నెయ్యి వేయండి. ఒక స్పూన్ పిండిని పాన్‌పై పోసి గుండ్రంగా స్ప్రెడ్ చేయండి. కింది భాగం బంగారు రంగులోకి వచ్చి క్రిస్పీ అయ్యేవరకు కాసేపు ఉండనివ్వండి. తరువాత మరొక వైపు తిప్పి ఇలాగే కాల్చండి. ఆ తరువాత తీస్తే దోశె రెడీ. మిగిలిన పిండితో కూడా ఇలాగే దోశెలు వేయండి.
దోశను వేడిగా సర్వ్ చేయండి. గ్రీన్ చట్నీ, పల్లీ (వేరు శెనగ) చెట్నీ లేదా టమాటో కెచప్‌తో జత చేయవచ్చు. కొందరు పెరుగుతో కూడా ఆనందంగా తింటారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా సాయంత్రం స్నాక్‌గా బాగుంటుంది.
Also Read: మీ పిల్లాడు గుంపులో తప్పిపోయినా సురక్షితంగా తిరిగి వస్తాడు.. తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు పాటించాలి
ఈ రెసిపీ ఫైబర్, పోషకాలతో నిండి ఉంటుంది. రొటీ, శనగపిండి కలిపి ఈ దోశె చేయడంతో ఇది ఒక ఆరోగ్యకరమైన భోజనం. ఇందులో కూరగాయలు కూడా జోడించడంతో మరింత రుచి వస్తుంది. ఇది కడుపుకు తేలికగా ఉంటుంది కానీ నిండుగా ఉంచుతుంది.
రొటీలను మరీ సన్నగా పొడి చేయకండి. కొంచెం ముక్కలుగా ఉంచండి. మీ రుచికి తగ్గట్టు మసాలా వేయండి. మీడియం ఫ్లేమ్‌లో వండితే సరైన క్రిస్పీనెస్ వస్తుంది. క్యాప్సికం లేదా క్యారెట్ వేసి వేరియేషన్ రోటీ దోశెలో చేయవచ్చు.