E-Paper
Advertisement

Amla for Hair: జుట్టు పెరుగుదలకు ఉసిరిని ఇలా వాడండి, జుట్టు మెరుస్తూ పొడవుగా ఎదుగుతుంది

Amla for Hair: జుట్టు పెరుగుదలకు ఉసిరిని ఇలా వాడండి, జుట్టు మెరుస్తూ పొడవుగా ఎదుగుతుంది
Advertisement

ఆధునిక కాలంలో వెంట్రుకలు రాలిపోవడం, జుట్టు పలుచబడటం, వెంట్రుకలు తెల్లబడటం వంటి సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. కెమికల్ ఉత్పత్తులు ఎక్కువగా వాడటం, పౌష్టికాహారం లోపించడం, కాలుష్యం, టెన్షన్ వంటి కారణాల వల్ల ఈ సమస్యలు మరింత పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడే సహజమైన మార్గం ఉసిరి వాడటం. పురాతన ఆయుర్వేదం నుంచి ఇప్పటి ఆధునిక కాస్మోటిక్స్ వరకు ఉసిరి.. జుట్టుకు ఉత్తమ ఔషధంగా చెప్పుకుంటారు. ఉసిరిలో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం వంటి పుష్కలంగా ఉండే పోషకాలు జుట్టును మూలాల నుంచిబలపరుస్తాయి. ఇవి జుట్టు త్వరగా పెరగడానికి కూడా సహాయపడతాయి. కింద ఇచ్చిన పద్ధతులతో ఉసిరిని ఇంట్లోనే సులభంగా వాడుకొని జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు.

ఉసిరి రసంతో స్కాల్ప్ టోనిక్
జుట్టు పెరుగుదలకు ఉసిరి రసం చాలా మంచి మందు. తాజా ఉసిరి పండ్లను గుజ్జుగా చేసి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని వేళ్ల మధ్య తీసుకుని స్కాల్ప్‌పై బాగా రాయాలి. అరగంట పాటూ జుట్టు అలా వదిలేయాలి. స్కాల్ప్‌లో రక్తప్రసరణను పెంచి కొత్త జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. వారానికి రెండు సార్లు ఇది చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Advertisement

ఉసిరి పొడితో హెయిర్ ప్యాక్
ఉసిరి పొడి మార్కెట్లో సులభంగా దొరుకుతుంది. రెండు టేబుల్ స్పూన్ల పొడిలో ఒక చెంచా మెంతి పొడి, ఒక చెంచా పెరుగు, కొద్దిగా కొబ్బరి నూనె కలిపి పేస్ట్ తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను జుట్టు రూట్స్ నుంచి చివర్ల వరకు బాగా రాయాలి. 40 నిమిషాల పాటూ వదిలేసి శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ జుట్టుకు పోషణ ఇచ్చి జుట్టు రఫ్‌గా ఉండటాన్ని తగ్గిస్తుంది. రెగ్యులర్‌గా వాడితే జుట్టు మెత్తగా మారి త్వరగా పెరుగుతుంది.

ఉసిరి నూనె
ఇంట్లోనే ఉసిరి నూనె సులభంగా తయారు చేయవచ్చు. కట్ చేసిన ఉసిరి ముక్కలను కొబ్బరి నూనెలో మరిగించాలి. నూనె రంగు స్వల్పంగా మారినప్పుడు ఆపాలి. చల్లారిన తర్వాత వడగట్టి బాటిల్‌లో పోవాలి. ఈ నూనెను వారానికి 2–3 సార్లు రాత్రి పడుకునే ముందు స్కాల్ప్‌పై మసాజ్ చేయాలి. రాత్రంతా నానబెట్టడం వల్ల జుట్టు రూట్స్ దృఢంగా మారతాయి. హెయిర్ ఫాల్ తగ్గి కొత్త జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

Advertisement

ఉసిరి షాంపూ
పురాతన కాలం నుంచి వాడే ఉత్తమ హెయిర్ క్లీన్సర్ ఇది. ఉసిరి, శీకాయ, కుంకుడు కాయలను సమానంగా తీసుకుని నీటిలో మరిగించాలి. నీరు బాగా చిక్కబడిన తర్వాత వడగట్టి బాటిల్‌లో పోవాలి. దీనిని వారం లో రెండు సార్లు షాంపూలా వాడాలి. ఇందులో రసాయనాలు లేకపోవడం వల్ల జుట్టు సహజమైన నష్టాల నుంచి రక్షణ పొందుతుంది. అలాగే డ్యాండ్రఫ్, హెయిర్ ఫాల్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

ఉసిరి జ్యూస్ తాగడం
జుట్టు ఆరోగ్యం బయటి నుంచి మాత్రమే కాదు, అంతర్గత ఆరోగ్యంతో కూడా సంబంధం ఉంది. ప్రతిరోజూ ఒక గ్లాస్ ఉసిరి జ్యూస్ తాగితే శరీరానికి విటమిన్ C అధికంగా అందుతుంది. ఇది జుట్టు రూట్స్‌ను లోపల నుంచి బలపరుస్తుంది. జుట్టు రాలిపోవడం తగ్గుతుంది. జుట్టు మందంగా, మెరిసేలా మారుతుంది.

Related News

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

Big Stories

Advertisement
×