E-Paper
Advertisement

మీ ఇంట్లో ఇలాంటి ఫొటోలున్నాయా? వెంటనే తొలగించండి.. ఇంట్లో కలహాలు, దరిద్రం వీటి వల్లే

మీ ఇంట్లో ఇలాంటి ఫొటోలున్నాయా? వెంటనే తొలగించండి.. ఇంట్లో కలహాలు, దరిద్రం వీటి వల్లే
Advertisement

ఇంట్లో అందం, డెకరేషన్ కోసం చాలామంది గోడలకు అందమైన ఫొటోలు, పెయింటింగ్‌లు పెడుతుంటారు. వాస్తు ప్రకారం.. ఇంట్లో ఉంచే ఈ పటాలు కుటుంబ సభ్యుల మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. కొన్ని ఫొటోలు, పెయింటింగ్‌లు సంతోషాన్నిస్తే, మరికొన్ని ఒత్తిడిని తెస్తాయి. మంచి ఫొటోలు.. ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతాయి. కాబట్టి, ప్రతి గదికి తగిన పటాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.

ఇంట్లో ఈ పటాలు పెట్టుకోకూడదు?

వాస్తు నిపుణులు కొన్ని రకాల ఫొటోలు ఇంట్లో పెట్టుకుంటే కలహాలు, అశాంతి, నిరాశ ప్రవేశిస్తాయి. ఆ జాబితా ఇదే

  • యుద్ధ దృశ్యాలు
  • వేట చిత్రాలు
  • ఏడుస్తున్న ముఖాలు
  • క్రూర జంతువుల దాడులు
  • మునిగిపోతున్న నౌకలు
  • ఎండిన చెట్లు
  • బాధాకరమైన కళాఖండాలు
Advertisement

యుద్ధ చిత్రాలు ఇంట్లో వాదనలు పెంచుతాయి. అడవిలో వేట సాగే పెయింటింగ్‌లు, దూకుడు భావనను పెంచుతాయి. ఒంటరితనం, బాధ చూపించే ఫొటోలు మనశ్శాంతిని దెబ్బతీస్తాయి.

క్రూర జంతువుల పటాలు దూరం పెట్టండి

సింహం, పులి, తోడేలు వంటి క్రూరజంతువుల పెయింటింగ్స్, ఫొటోస్ ఉంటే వాస్తు ప్రకారం అశుభం. అవి ఇంట్లో ఒత్తిడి, కలహాలను సూచిస్తాయి. ముఖ్యంగా పడకగదిలో ఇలాంటి ఫొటోలు, అస్సలు పెట్టుకోకూడదు. ఏనుగు, బాతు వంటి సౌమ్య జంతువుల పెయింటింగ్స్ మంచివి. అవి స్థిరత్వాన్ని, శాంతిని ఇస్తాయి.

చిరిగిన, పగిలిన పటాలు తీసేయండి

Advertisement

చిరిగిన ఫ్రేమ్లు, పగిలిన అద్దాలు, దెబ్బతిన్న పటాలు వాస్తులో అశుభకరమైనవి. ఇవి ఇంట్లో దరిద్రం రాబోతున్నట్లు సూచికలు. చిరిగిన పోస్టర్లు, మసకబారిన పటాలు వెంటనే తొలగించండి. పగిలిన అద్దాలు ప్రతిబింబాన్ని వక్రీకరిస్తాయి, ఇది శక్తి సమతుల్యతను చెడగొడుతుంది.

పాజిటివ్ ఎనర్జీనిచ్చే పటాలు పెట్టండి

ప్రకృతి దృశ్యాల పటాలు ప్రశాంతతను ఇస్తాయి. అందుకే ఈ కింద తెలిపిన పటాలు మీ ఇంటికి మంచి శక్తినిస్తాయి.

  • సూర్యోదయ చిత్రాలు
  • ప్రవహించే నీటి దృశ్యాలు
  • పచ్చని ప్రకృతి దృశ్యాలు
  • వికసించిన పువ్వులు
  • సంతోషకరమైన కుటుంబ ఫొటోలు
  • ఆధ్యాత్మిక చిత్రాలు

ఏ దిశలో పెయింటింగ్స్ పెట్టాలి?

అందమైన ఫ్యామిలీ ఫొటోలు.. నైరుతి (సౌత్-వెస్ట్) దిశలో పెట్టడం మంచిది. ఆధ్యాత్మిక చిత్రాలు తూర్పు లేదా ఈశాన్యంలో పెట్టుకోవాలి. పడకగదిలో ఆందోళన కలిగించే ఎటువంటి పటాలు పెట్టుకోవద్దు. పడకగదిలో ప్రశాంతంగా, ఓదార్పుగా ఉండే కళాత్మక చిత్రాలు మాత్రమే ఉంచుకోండి.

పూర్వీకుల ఫొటోలను జాగ్రత్తగా ఉంచండి

మీ పూర్వీకుల ఫొటోలను గౌరవంగా ఉంచుకోవడం మంచిదే, కానీ వాటిని వంటగదిలో గానీ, పడకగదిలో గానీ పెట్టకూడదు. వాటిని పూజా గదిలో లేదా నైరుతి దిశలో ఉన్న గోడపై ఉంచడం సరైనది. ఇలా చేయడం వల్ల మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యత కుదురుతుంది.

గోడలపై మరీ ఎక్కువ పెయింటింగ్స్ వద్దు

గోడలపై అతిగా పటాలు ఉంటే మానసిక ఒత్తిడి వస్తుంది. శుభ్రంగా, క్రమంగా ఉండే అలంకరణ శాంతిని ఇస్తుంది. అర్థపూర్వకమైన, తక్కువ పటాలతో ఇంటిని అలంకరించుకోవడం మంచిది.

Related News

ప్రతిరోజూ హెల్మెట్ ధరిస్తే జుట్టు డ్యామేజ్.. ఈ సులభమైన హెయిర్ కేర్ చిట్కాలు మీ కోసం

పాము, ముంగీస లాంటి స్వభావం వీరిది.. ఈ తేదీల్లో పుట్టినవారు పెళ్లి తరువాత గొడవపడుతూనే ఉంటారు

మద్యం లేదా సిగరెట్.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రమాదకరం.. ఏది ముందుగా మానేయాలి?

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

రోగాలు మాయం.. వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు

వర్షాకాలంలో జుట్టు రాలడం, చుండ్రు సమస్యలా ?

టమాటా సైజును బట్టి ఆరోగ్య ప్రయోజనాలుంటాయా? నిపుణులు ఏమంటున్నారంటే..!

Big Stories

Advertisement
×