E-Paper
Advertisement

Hair Wash: వారానికి ఎన్ని సార్లు తలస్నానం చేయాలి ? నిజం తెలుసుకోండి

Hair Wash: వారానికి ఎన్ని సార్లు తలస్నానం చేయాలి ? నిజం తెలుసుకోండి
Advertisement

Hair Wash: జుట్టు సంరక్షణలో తలస్నానం కూడా ఒక ముఖ్యమైన దశ. కొంతమంది రోజూ తలస్నానం చేస్తే.. మరికొందరు వారానికి ఒకసారి మాత్రమే చేస్తారు. కానీ నిజానికి వారంలో ఎన్ని సార్లు తలస్ననం చేయాలి ? అనే ఈ ప్రశ్న చాలా మంది మనస్సులలో తలెత్తుతుంది. అయితే.. సమాధానం అంత సులభం కాదు. ఇది జుట్టు రకం, లైఫ్ స్టైల్, పర్యావరణం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రోజూ తలస్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
శుభ్రంగా, తాజాగా ఉండే జుట్టు – రోజూ తలస్నానం చేయడం వల్ల జుట్టు నుంచి మురికి, దుమ్ము, చెమట కణాలు తొలగిపోయి, జుట్టు శుభ్రంగా, తాజాగా ఉంటుంది. ఇది ముఖ్యంగా ఎక్కువగా చెమట పట్టేవారికి లేదా కాలుష్య ప్రాంతాలలో నివసించే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

Advertisement

తలపై చర్మం పరిశుభ్రత: ప్రతి రోజూ షాంపూ చేయడం వల్ల తలపై పేరుకుపోయిన నూనె, మృత చర్మ కణాలు తొలగిపోతాయి. ఇది తలపై చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాకుండా చుండ్రు సమస్యను తగ్గిస్తుంది.

స్టైలింగ్ : ప్రతి రోజూ షాంపూ చేయడం వల్ల ఉస్టైలింగ్ సులభతరం అవుతుంది.

Advertisement

తరచూ షాంపూ చేయడం వల్ల కలిగే నష్టాలు:
జుట్టు పొడిబారడం: ప్రతి రోజూ షాంపూతో తలస్నానం చేయడం వల్ల జుట్టులోని సహజ నూనెలు తొలగిపోతాయి. ఇది జుట్టు పొడిబారడానికి, పెళుసుదనానికి దారితీస్తుంది. ముఖ్యంగా పొడి జుట్టు ఉన్నవారికి ఇది సమస్యాత్మకంగా ఉంటుంది.

జుట్టు రాలడం: ప్రతి రోజూ షాంపూతో తలస్నానం చేయడం వల్ల జుట్టులోని సహజ తేమ తగ్గిపోతుంది. దీని వల్ల జుట్టు బలహీనంగా మారి విరిగిపోయే అవకాశం ఉంది.

చర్మ సమస్యలు: కొంత మందికి రోజూ షాంపూ చేయడం వల్ల తలపై చికాకు లేదా దురద వస్తుంది. ముఖ్యంగా షాంపూలో అధిక మొత్తంలో రసాయనాలు ఉంటే.

హాని ఏంటి ?

జుట్టు కుదుళ్లు మూసుకుపోవడం ప్రారంభిస్తాయి.

ఆక్సిజన్, పోషకాలు జుట్టు మూలాలకు చేరవు.

జుట్టు నిర్జీవంగా కనిపించడం ప్రారంభిస్తుంది.

దురద, చుండ్రు సమస్యలు పెరుగుతాయి.

 నిపుణులు ఏమంటున్నారు ?
మురికిగా ఉన్న తల చర్మం ఫంగస్‌కు అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీని వల్ల తీవ్రమైన దురద, తెల్లటి పొరలుగా ఉండే చుండ్రు, తల చర్మంపై చికాకు వంటి సమస్యలు తలెత్తవచ్చు.

జుట్టు రాలడం వేగవంతం పెరిగే అవకాశం ఉంటుంది.

వేగంగా జుట్టు రాలడం జరుగుతుంది.

తలస్నానం తరచుగా చేస్తే.. జుట్టు రాలుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ నిజం దీనికి విరుద్ధంగా ఉంటుంది.

తలపై చర్మం శుభ్రంగా లేనప్పుడు.. మురికి పేరుకుపోతుంది. జుట్టు మూలాలను బలహీనపరుస్తుంది. ఫలితంగా..

జుట్టు అకాలంగా రాలడం ప్రారంభమవుతుంది

జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి.

క్రమంగా జుట్టు రాలే సమస్య పెరుగుతుంది.

తలపై చర్మ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×