E-Paper
Advertisement

6-6-6 Walking Trend: వైరల్ అవుతున్న 6-6-6 వాకింగ్ ట్రెండ్.. ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

6-6-6 Walking Trend: వైరల్ అవుతున్న 6-6-6 వాకింగ్ ట్రెండ్.. ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Advertisement

6-6-6 Walking Trend: నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో వ్యాయామం కోసం గంటల తరబడి సమయం కేటాయించడం అందరికీ సాధ్యం కావడం లేదు. అందుకే.. ఆరోగ్యంగా ఉండటానికి నిపుణులు సరికొత్త పద్ధతులను సూచిస్తున్నారు. అలాంటి వాటిలో ఒకటే ఈ ‘6-6-6 వాకింగ్ ట్రెండ్’. సింపుల్‌గా.. ఎటువంటి జిమ్ పరికరాలు లేకుండా మన ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఇది క చక్కని మార్గం. అసలు ఈ 6-6-6 సూత్రం ఏంటి ? ఇది మన శరీరానికి నిజంగానే ఉపయోగపడుతుందా? అనే ఆసక్తికరమైన విషయాలను గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం.

6-6-6 వాకింగ్ ట్రెండ్:
ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజుకు 10 వేల అడుగులు నడవాలని మనం వింటూనే ఉంటాం. అయితే ఆ టార్గెట్‌ను చేరుకోవడం చాలామందికి భారంగా అనిపిస్తుంది. అటువంటి వారి కోసం పుట్టుకొచ్చినదే ఈ ‘6-6-6 వాకింగ్ రూల్’. ఇది కేవలం శారీరక వ్యాయామమే కాదు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలికి పునాది.

Advertisement

అసలు 6-6-6 అంటే ఏంటి?

ఈ ట్రెండ్‌లో మూడు కీలకమైన ‘6’లు ఉన్నాయి.

Advertisement

ఉదయం 6 గంటలకు: మొదటి ఆరు గంటలు అంటే ఉదయం 6 గంటలకు మీ నడకను ప్రారంభించడం. ఉదయాన్నే నడవడం వల్ల స్వచ్ఛమైన గాలి లభిస్తుంది.

సాయంత్రం 6 గంటలకు: రెండో ఆరు గంటలు అంటే సాయంత్రం 6 గంటలకు మరోసారి నడకకు సిద్ధమవ్వడం. రోజంతా పని ఒత్తిడి తర్వాత ఇది మనస్సును రిలాక్స్ చేస్తుంది.

60 నిమిషాల వాకింగ్: ప్రతి సెషన్‌లో అంటే ఉదయం 60 నిమిషాలు, సాయంత్రం 60 నిమిషాలు నడవాలి.

కొందరు దీనిని మరోలా కూడా నిర్వచిస్తారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో, ప్రతి సెషన్‌లో 60 నిమిషాల పాటు నడవడం.

ఈ ట్రెండ్ ఎందుకు ఫేమస్ అవుతోంది?
చాలామందికి ఉదయం ఒక్కసారే గంటన్నర లేదా రెండు గంటలు నడవడం కష్టమవుతుంది. కానీ ఈ పద్ధతిలో వ్యాయామాన్ని రెండు భాగాలుగా విభజించడం వల్ల అలసట తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా.. ఉదయం-సాయంత్రం నడవడం వల్ల శరీర మెటబాలిజం రోజంతా చురుగ్గా ఉంటుంది.

ఇది నిజంగానే సహాయపడుతుందా?

అవును.. ఈ పద్ధతి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

గుండె ఆరోగ్యం: క్రమం తప్పకుండా రోజుకు రెండుసార్లు నడవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.

బరువు తగ్గడం: ఉదయం, సాయంత్రం కలిపి 120 నిమిషాల నడక వల్ల క్యాలరీలు అధికంగా ఖర్చవుతాయి. ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఒక అద్భుతమైన అవకాశం.

మానసిక ప్రశాంతత: ఉదయం నడక మన రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తే, సాయంత్రం నడక నిద్రలేమి సమస్యను దూరం చేసి ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలు: భోజనానికి ముందు లేదా తర్వాత చేసే ఈ నడక వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా మంచిది.

రోగనిరోధక శక్తి: శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోవడానికి.. వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి క్రమం తప్పని నడక తోడ్పడుతుంది.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు:

ఈ ట్రెండ్‌ను మొదలుపెట్టే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఒకేసారి గంట పాటు నడవలేకపోతే, మొదటి వారం 20 నిమిషాలతో మొదలుపెట్టి నెమ్మదిగా సమయాన్ని పెంచాలి. సరైన వాకింగ్ షూస్ వాడటం, నడిచేటప్పుడు బాడీ పోశ్చర్ సరిగ్గా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. 6-6-6 వాకింగ్ ట్రెండ్ అనేది కేవలం ఒక సోషల్ మీడియా ట్రెండ్ మాత్రమే కాదు. ఇది ఒక ఆరోగ్యకరమైన అలవాటు. జిమ్ సెంటర్లకు వెళ్లడానికి సమయం లేని వారికి, సహజంగా ఫిట్‌గా ఉండాలనుకునే వారికి ఇది ఒక వరమని చెప్పవచ్చు.

Related News

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

Big Stories

Advertisement
×