Fridge Organization: ప్రస్తుతం దాదాపు అందరి ఇళ్లల్లో ఫ్రిడ్జ్ వాడుతున్నారు. అయితే సమయం ఉన్నప్పుడు ఫ్రిజ్ లో వస్తువులు, కూరగాయలు పద్దతిగా సర్దుకున్నా.. కొన్ని సార్లు మార్కెట్ నుంచి తెచ్చిన వస్తువులను అందులో ఎలా పడితే అలా పడేస్తుంటాం. దీని వల్ల అవి త్వరగా పాడైపోవడమే కాకుండా, కరెంట్ ఖర్చు పెరిగి, అవసరమైనవి వెతుక్కునేటప్పుడు సమయం వృథా అవుతుంది. ఫ్రిడ్జ్‌ను పద్ధతిగా సర్దుకోవడం అనేది కేవలం లుక్ కోసం మాత్రమే కాదు. అది ఫుడ్ సేఫ్టీ, మన ఆరోగ్యం కోసం కూడా చాలా ముఖ్యం. సరైన పద్ధతుల్లో ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు,చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్రిజ్ ఆర్గనైజ్ చేయడానికి బెస్ట్ చిట్కాలు:
1.పైన,మధ్య సెల్ఫ్స్ :
ఫ్రిడ్జ్ పై భాగంలో ఉష్ణోగ్రత ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి, వండాల్సిన అవసరం లేని ఆహార పదార్థాలను ఇక్కడ ఉంచాలి. ఉదాహరణకు.. వండిన కూరలు, డ్రింక్స్, తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారాలను ఇక్కడ పెట్టాలి. పాలకు సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు.
ఫ్రిడ్జ్‌లో కింది భాగం అత్యంత చల్లగా ఉంటుంది. కాబట్టి, మాంసం, చేపలు వంటి త్వరగా పాడయ్యే పదార్థాలను ఇక్కడ ఉంచాలి. అయితే.. వీటిని విడిగా కంటైనర్లలో ఉంచడం వల్ల వాటి నుంచి వచ్చే నీరు ఇతర పదార్థాలపై పడకుండా ఉంటుంది.
3. స్టోరేజ్:
చాలా ఫ్రిడ్జ్‌లలో కింద ఉండే స్టోరేజ్ ప్లేస్ తేమను నియంత్రించేలా రూపొందించబడతాయి. ఆకుకూరలు, క్యారెట్లు వంటి తేమ అవసరమయ్యే కూరగాయలను , పండ్లను దీనిలో ఉంచాలి. పండ్లు ,కూరగాయలను కలిపి ఉంచకూడదు. ఎందుకంటే పండ్ల నుంచి విడుదలయ్యే ఇథిలీన్ వాయువు కూరగాయలను త్వరగా కుళ్లిపోయేలా చేస్తుంది.
4. డోర్ షెల్వ్‌లు:
ఫ్రిడ్జ్ డోర్ అనేది అత్యంత వెచ్చని ప్రాంతం. ఎందుకంటే.. ఫ్రిడ్జ్ తీసినప్పుడల్లా బయటి గాలి ఇక్కడే తగులుతుంది. కాబట్టి.. ఇక్కడ పాలు లేదా గుడ్లు ఉంచకూడదు. బదులుగా కెచప్, జామ్, వాటర్ బాటిల్స్, సోడా వంటి నిల్వ ఉండే పదార్థాలను ఇక్కడ సర్దాలి.
Also Read: వంటింటి చిట్కాలతో ఇన్స్టంట్ గ్లో.. కేవలం 15 నిమిషాల్లోనే మెరిసే చర్మం!
5. డబ్బాల వాడకం :
వస్తువులను నేరుగా కవర్లలో కాకుండా, పారదర్శకంగా ఉండే.. ప్లాస్టిక్ లేదా గాజు డబ్బాల్లో ఉంచడం వల్ల లోపల ఏముందో సులభంగా తెలుస్తుంది. దీని వల్ల అనవసరంగా ఫ్రిడ్జ్ డోర్ ఎక్కువ సేపు తెరిచి ఉంచాల్సిన అవసరం ఉండదు.
6.’ఫస్ట్ ఇన్, ఫస్ట్ అవుట్’ :
ముందుగా కొన్న వస్తువులను ముందు వరుసలో.. కొత్తగా తెచ్చిన వాటిని వెనక వరుసలో ఉంచండి. దీని వల్ల పాత వస్తువుల ఎక్స్‌పైరీ డేట్ దాటిపోకుండా వాడుకోవచ్చు. ఆహారం వృథా కాకుండా ఉండటానికి ఇది అద్భుతమైన మార్గం.
ఫ్రిడ్జ్‌ను వారానికి ఒకసారి శుభ్రం చేయడం వల్ల దుర్వాసన రాకుండా ఉంటుంది. పైన చెప్పిన విధంగా చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా మీ ఫ్రిడ్జ్ కేవలం నిల్వ చేసే యంత్రంలా కాకుండా.. మీ ఆరోగ్యాన్ని కాపాడే ఒక వ్యవస్థలా మారుతుంది.