E-Paper
Advertisement

Couple: పెళ్లి కోసం ప్లానింగ్ స్ట్రెస్ అవసరమా? ఎలోప్‌మెంట్ వైపు మొగ్గు చూపుతున్న యువ జంటలు

Couple: పెళ్లి కోసం ప్లానింగ్ స్ట్రెస్ అవసరమా? ఎలోప్‌మెంట్ వైపు మొగ్గు చూపుతున్న యువ జంటలు

Couple: పెళ్లి అం..టే ఎక్కువ ఖర్చు, బంధువుల సమక్షంలో ఘనంగా జరగాలి అనే సంప్రదాయ ఆలోచనలు నెమ్మదిగా మారుతున్నాయి. నేటి తరం జంటలు, ముఖ్యంగా వేగంగా మారుతున్న ఆధునిక సమాజంలో.. సంప్రదాయ పద్ధతిలో కాకుండా, కేవలం తమకు ఇష్టమైన లేదా అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో ‘ఎలోప్‌మెంట్’ లేదా రహస్య వివాహం చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. సాంప్రదాయ వివాహాల కంటే ఎలోప్‌మెంట్‌ను ఎంచుకోవడానికి గల ముఖ్య కారణాలను గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఖర్చు తగ్గించడం:
వివాహం అంటే అద్దె వేదిక, ఆహారం, ఆభరణాలు, బట్టలు, బహుమతులు, అతిథుల ఆతిథ్యం వంటి వాటితో లక్షల్లో.. కోట్లలో ఖర్చు అవుతుంది. ఖర్చులు నివారించడానికి జంటలు ఎలోప్‌మెంట్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దీని ముఖ్య ఉద్దేశం.. పెళ్లి ఖర్చులను తగ్గించి, ఆ డబ్బును తమ భవిష్యత్తు కోసం లేదా హనీమూన్ కోసం ఉపయోగించుకోవాలని భావిస్తారు.

2. ఒత్తిడి లేని వివాహం :
వివాహాన్ని ప్లాన్ చేయడం అనేది చాలా ఒత్తిడితో కూడుకున్న పని. వేదిక ఎంపిక దగ్గర నుంచి కేటరింగ్, అతిథుల లిస్ట్, బంధువుల అంచనాలు… ఇలా ఎన్నో విషయాలు వధూవరులపై మానసిక ఒత్తిడిని పెంచుతాయి. ఎలోప్‌మెంట్ ద్వారా ఈ ప్లానింగ్ ఒత్తిడి మొత్తం తగ్గుతుంది. జంటలు కేవలం తమ ప్రేమపై.. ఆ రోజు వారిద్దరి ఆనందంపై మాత్రమే దృష్టి పెట్టగలుగుతారు.

3. వ్యక్తిగత గోప్యత, సన్నిహితత్వం:
సంప్రదాయ పెళ్లిలో వందలాది మంది అతిథులు ఉంటారు. దీని వల్ల జంటలు ఒకరికొకరు ఎక్కువ సమయం గడపడానికి లేదా తమ క్షణాలను వ్యక్తిగతంగా ఆస్వాదించడానికి వీలుండదు.

అసలైన అనుబంధం: ఎలోప్‌మెంట్ అంటేనే అతి సన్నిహితంగా.. ప్రశాంతంగా, తమ హృదయపూర్వక ప్రమాణాలను తమకు ఇష్టమైన చోట, అత్యంత సన్నిహిత వ్యక్తుల సమక్షంలో మాత్రమే నిర్వహించుకోవడం. ఇది వేడుక కంటే.. బంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.

Also Read: బ్రేక్- అప్‌కు ఛాన్స్ ఇవ్వొద్దు.. ప్రతి జంట గుర్తుంచుకోవాల్సిన రిలేషన్‌షిప్ రూల్స్

4. వినూత్న ప్రదేశాలు:
సాంప్రదాయ వివాహాలు సాధారణంగా ఇంటి వద్ద లేదా స్థానిక హాల్‌లో జరుగుతాయి. కానీ ఎలోప్‌మెంట్‌ను ఎంచుకునే జంటలు తమకు ఇష్టమైన, ప్రత్యేకమైన ప్రదేశాలలో (ఉదాహరణకు: బీచ్‌లు, చారిత్రక కట్టడాల వద్ద) వివాహం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది పెళ్లిని ఒక రొటీన్ కార్యక్రమంగా కాకుండా.. జీవితంలో మరపురాని సంఘటనగా మారుస్తుంది.

5. కుటుంబ జోక్యం తగ్గించడం:
కొన్ని సందర్భాలలో.. కుటుంబ సభ్యుల మధ్య తలెత్తే అభిప్రాయ భేదాలు లేదా వివాహానికి సంబంధించిన విషయాలలో అనవసరమైన జోక్యాన్ని నివారించడానికి కూడా జంటలు ఎలోప్‌మెంట్‌ను రహస్యంగా ఎంచుకుంటారు.

ఎలోప్‌మెంట్ అనేది కేవలం ఖర్చు తగ్గించుకోవడం మాత్రమే కాదు.. బంధానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, తమ ప్రేమను తమ సొంత మార్గంలో.. ఎలాంటి ఒత్తిడి లేకుండా వ్యక్తం చేసుకోవడానికి ఆధునిక జంటలు ఎంచుకుంటున్న కొత్త విధానం.

Related News

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

Big Stories

×