E-Paper
Advertisement

Mosquitoes: ఈ బ్లడ్ గ్రూప్ అంటే దోమలకు ఎందుకంత ఇష్టం? ఎందుకంత స్పెషల్?

Mosquitoes: ఈ బ్లడ్ గ్రూప్ అంటే దోమలకు ఎందుకంత ఇష్టం? ఎందుకంత స్పెషల్?
Advertisement

Mosquitoes: మీకు ఎప్పుడైనా అనిపించిందా.. ఫ్రెండ్స్‌తో గానీ కుటుంబ సభ్యులతో గానీ బయట వరండాలో కూర్చున్నప్పుడు దోమలు అందిరినీ వదిలేసి మిమ్మల్ని మాత్రమే టార్గెట్ చేసి కుడుతున్నట్లు? అయితే అది మీ బ్యాడ్ లక్ కాదు, మీ శరీరంలోని బయాలజీ మహిమ. నిజానికి దోమలు రక్తాన్ని తాగేటప్పుడు వాటికి ఏ టైప్ బ్లడ్ గ్రూప్ కావాలో ఎంచుకుంటుంది. ముఖ్యంగా ‘O’ బ్లడ్ గ్రూప్ వారైతే, మిగతా వారితో పోలిస్తే దోమలకు ఒక స్పెషల్ మెనూ లాంటి వారన్నమాట.

గ్రూపును బట్టి దోమల వేట:

మనది ఏ టైప్ బ్లడ్ గ్రూప్ అనేది మన చర్మం ద్వారా కొన్ని రసాయన సంకేతాల రూపంలో బయటకు విడుదలవుతుంది. పరిశోధనల ప్రకారం.. టైప్-A లేదా టైప్-B రక్తం ఉన్నవారి కంటే.. టైప్-O రక్తం ఉన్నవారిని దోమలు రెండు రెట్లు ఎక్కువగా ఇష్టపడతాయి. వారి రక్తంలోని చక్కెర స్థాయిలు, కొన్ని రకాల ప్రొటీన్లు దోమలను అయస్కాంతంలా ఆకర్షిస్తాయి. అందుకే పక్కన వేరే బ్లడ్ గ్రూప్ వారు ఉన్నా, దోమలు మాత్రం O గ్రూప్ వైపే క్యూ కడతాయి.

Advertisement

Also Read: వెన్ను నొప్పి బాధిస్తోందా? మందులు వాడకుండానే ఇలా సులభంగా తగ్గించుకోండి!

మన శ్వాసే వాటికి సంకేతం:

కేవలం రక్తం మాత్రమే కాదు.. మనం వదిలే శ్వాస ద్వారా కూడా దోమలు మన దగ్గరకు చేరుకుంటాయి. మనం శ్వాస బయటకు వదిలినప్పుడు వెలువడే కార్బన్ డయాక్సైడ్ దోమలకు ఒక లొకేషన్ మ్యాప్‌లా పనిచేస్తుంది. ఎవరైతే ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తారో, వారిని దోమలు చాలా దూరం నుంచే పసిగట్టి వెంబడిస్తాయి. అందుకే వ్యాయామం చేసినప్పుడు లేదా వేగంగా నడిచినప్పుడు మనల్ని దోమలు ఎక్కువగా చుట్టుముడుతుంటాయి.

చెమటను ఇష్టపడే ఆడ దోమలు:

Advertisement

దోమలకు వేడి అంటే చాలా ఇష్టం. మన శరీర ఉష్ణోగ్రత పెరిగినా లేదా మన శరీరానికి ఎక్కువగా చెమట పట్టినా ఆ వాసన ఆడ దోమలకు ఇట్టే తెలిసిపోతుంది. శారీరక శ్రమ చేసినప్పుడు మన చర్మం ద్వారా వెలువడే లాక్టిక్ యాసిడ్, అమ్మోనియా వంటి రసాయనాలు దోమలకు మంచి ఆకర్షణీయమైన వస్తువులుగా మారుతాయి. అందుకే రాత్రిపూట శరీరాన్ని చల్లగా, పొడిగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

దోమల నుండి తప్పించుకోవడమెలా?

మీది గనుక ‘O’ బ్లడ్ గ్రూప్ అయితే.. ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం తప్పదు. వీలైనంత వరకు లేత రంగు దుస్తులు ధరించాలి. ఎందుకంటే.. ముదురు రంగులు దోమలకు త్వరగా కనిపిస్తాయి. సాయంత్రం వేళల్లో బయట తిరిగేటప్పుడు చర్మం ఎక్కువగా బయటకు కనిపించకుండా దుస్తులు వేసుకోవడం ద్వారా ఈ దోమల బారి నుంచి రక్షణ పొందవచ్చు.

Also Read: కొబ్బరిపాలతో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? తగ్గుతుందా? ఈ షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోండి!

Related News

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

Big Stories

Advertisement
×