E-Paper
Advertisement

Chiranjeevi: అన్వీరా, శివ రామ్ పేర్లపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్.. గర్వంగా ఉందంటూ!

Chiranjeevi: అన్వీరా, శివ రామ్ పేర్లపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్.. గర్వంగా ఉందంటూ!
Advertisement

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఎంతో సంతోషంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఎప్పటినుంచో వారసుడు కావాలని ఆయన కోరిక నెరవేరడంతో మెగా ఇంట్లో పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చిరంజీవికి ఐదుగురు మనవరాలు ఉండడంతో ఒక మనవడు ఉంటే బాగుంటుందని ఈయన తన మనసులో కోరికను బయటపెట్టారు. అయితే రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఇటీవల కవల పిల్లలకు జన్మనివ్వగా ఈ కవల పిల్లలలో ఒక అమ్మాయి అబ్బాయి జన్మించడంతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇక చరణ్ కు కొడుకు పుట్టడంతో మెగా అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ కవల పిల్లలకు సాంప్రదాయబద్ధంగా నామకరణ మహోత్సవ వేడుకను నిర్వహించారు.

శివ రామ్, అన్వీరా దేవి కొణిదెల..

ఈ చిన్నారులకు శివ రామ్ కొణిదెల, అన్వీరా దేవి కొణిదెల అని నామకరణం చేసినట్టు చిరంజీవి అధికారకంగా తెలియచేశారు. ఇక ఈ పేర్ల వెనుక ఉన్న అర్థాలను, ఈ పేర్లు పెట్టడానికి గల కారణాలను కూడా మెగా కుటుంబ సభ్యులు తెలియచేసిన సంగతి తెలిసిందే. ఈ చిన్నారులకు ఇలాంటి పేర్లు పెట్టడంతో ఎంతోమంది ఈ పేర్లపై ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం తమ చిన్నారులకు ఈ పేర్లు పెట్టడం గురించి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఈ నేపథ్యంలోనే రాంచరణ్ ఉపాసన దంపతులతో కలిసి చిరంజీవి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.

చరణ్ ఉపాసనపై చిరు అభినందనలు..

Advertisement

తమ పిల్లలకు పెట్టిన పేర్లు విషయంలో ఎంతోమంది అభిమానులు స్నేహితులు బంధువులు ఫోన్లు చేసి మరీ పేర్లు బాగున్నాయి అంటూ ప్రశంసిస్తున్నారని చిరంజీవి తెలిపారు. ఈ విషయంలో చరణ్ ఉపాసనలను అభినందించాల్సిందేనని చిరు తెలిపారు. ఆధ్యాత్మిక ప్రతిబింబించేలా భగవంతుడి ఆశీర్వాదం ఉండేలా ఎంతో పవిత్రమైన పేర్లను ఎంపిక చేశారు. పిల్లలకు ఇలాంటి పేర్లు పెట్టడం నాకు ఎంతో గర్వంగా ఉందని నా మనసు సంతోషంతో నిండి పోయిందని చిరంజీవి తెలిపారు.

Advertisement

భక్తి సంస్కృతి మేళవించిన ఈ పేర్లు రాబోయే తరాలకు దిశా నిర్దేశం చేసేలా ఉన్నాయని తెలిపారు. చరణ్ తన కూతురికి తన నాయనమ్మ అంజనాదేవి పేరు కలిసి వచ్చేలాగా అన్వీరా దేవి అని పేరు పెట్టడం నా మనసును తాకింది. అంటూ చిరంజీవి చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్ట్ పై ఉపాసన స్పందిస్తూ లవ్ యు మామయ్య అంటూ కామెంట్లు చేశారు . ఇలా కూతురికి తన నాయనమ్మ పేరు కలిసి వచ్చేలాగా పెట్టడమే కాకుండా తన కొడుకుకు తన తండ్రి చిరంజీవి పేరును కలిసి వచ్చేలాగా పెట్టడం విశేషం. చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్ అనే సంగతి మనకు తెలిసిందే. తన తండ్రిలో నుంచి శివ అనే పేరుతో పాటు తన పేరులో రామ్ అనే పేరును జోడిస్తూ తన కొడుకుకు శివరామ్ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇలా చరణ్ తన ముగ్గురు పిల్లలకు ఎంతో చక్కగా దేవుడికి సంబంధించిన పేర్లు పెట్టడంతో చరణ్ ఉపాసన దంపతులపై కూడా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: Supritha: సురేఖ వాణి రెండో పెళ్లి పై సుప్రీత కామెంట్స్… తప్పుగా అర్థం చేసుకున్నారా?

Related News

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

Big Stories

Advertisement
×