E-Paper
Advertisement

Women’s Day 2026 Wishes: కొత్తగా, స్టైలిష్‌గా.. మనసుకి హత్తుకునేలా ఉమెన్స్ డే విషెస్ చెప్పేయండి!

Women’s Day 2026 Wishes: కొత్తగా, స్టైలిష్‌గా.. మనసుకి హత్తుకునేలా ఉమెన్స్ డే విషెస్  చెప్పేయండి!
Advertisement

Women’s Day 2026 Wishes: ప్రతి మగవాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందని అంటారు. కానీ నిజానికి ప్రతి విజయవంతమైన సమాజం వెనక ఒక స్త్రీ కూడా శక్తి ఉంటుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన జీవితాల్లోని అమ్మ, అక్క, చెల్లి, భార్య ,స్నేహితురాళ్లకు మన గౌరవాన్ని చాటుకోవడానికి పదాల కంటే మించిన ఆయుధం లేదు. వారి త్యాగాలను, పట్టుదలను అభినందిస్తూ పంపే ఒక చిన్న మెసేజ్ వారిలో ఎంతో స్ఫూర్తిని నింపుతుంది. ఇందుకోసం కోట్స్ ,హృదయానికి హత్తుకునే విషెస్ మీకోసం..

మహిళా దినోత్సవం 2026.. శుభాకాంక్షలు:
ప్రతి సంబంధానికి తగినట్లుగా మనం పంపే మెసేజ్ ఉండాలి.

Advertisement

1. అమ్మ కోసం:
“నడక నేర్పిన తొలి గురువు, ప్రేమ పంచిన దేవత.. మా అమ్మకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.”

“నీ త్యాగం వెలకట్టలేనిది. నీ ఓర్పు అనంతమైనది. హ్యాపీ విమెన్స్ డే అమ్మ!”

Advertisement

“నా ప్రపంచానికి వెలుగునిచ్చిన మొదటి దేవతవు నీవే అమ్మ. నీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!”

“అలసట తెలియని నీ చేతులకు, స్వార్థం లేని నీ మనసుకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. హ్యాపీ విమెన్స్ డే అమ్మ!”

“నువ్వు లేనిదే నాకు అస్తిత్వమే లేదు అమ్మ. ఈ మహిళా దినోత్సవం నీలాంటి గొప్ప వ్యక్తికి అంకితం.”

“ఎన్ని జన్మలెత్తినా నీకు రుణపడి ఉంటాను. నా సూపర్ ఉమెన్ నువ్వే ! హ్యాపీ విమెన్స్ డే అమ్మ.”

2. భార్య/స్నేహితురాలు కోసం:
“నా జీవితాన్ని అందంగా తీర్చిదిద్దిన శిల్పివి నీవు. నా ప్రతి అడుగులో తోడుగా నిలిచిన నీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.”

“నీవు నా బలం, నా గర్వం. ఈ ప్రత్యేకమైన రోజున నీకు నా హృదయపూర్వక వందనాలు.”

“నా ఇల్లు స్వర్గంలా ఉందంటే దానికి కారణం నీవే. నా జీవిత భాగస్వామికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.”

“నా కష్టాల్లో తోడుగా, సుఖాల్లో నీడగా నిలిచిన నా ప్రియమైన భార్యకు హ్యాపీ విమెన్స్ డే.”

“ఒక ఇంటిని చక్కదిద్దడం అంటే సామాన్యమైన విషయం కాదు, నువ్వు దాన్ని ఎంతో సునాయాసంగా చేస్తున్నావు. థాంక్యూ డియర్, హ్యాపీ విమెన్స్ డే

“నీ రాకతో నా జీవితం పరిపూర్ణమైంది. నీ శక్తి, నీ ఓర్పు నాకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తాయి. హ్యాపీ విమెన్స్ డే!”

“నువ్వు కేవలం నా భార్యవే కాదు, నా బలం కూడా. నీలాంటి వ్యక్తి నా పక్కన ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుడిని.” హ్యాపీ విమెన్స్ డే

3.చెల్లెలు, లేదా అక్క కోసం..
“నా చిన్ననాటి అల్లరిలో తోడుగా, ఇప్పుడు నా ఎదుగుదలలో స్ఫూర్తిగా నిలిచిన నా అక్కకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.”

“నువ్వు ఎక్కడికి వెళ్లినా నీ లక్ష్యాలను సాధించాలని కోరుకుంటున్నాను. హ్యాపీ విమెన్స్ డే అక్కా!”

“నా బెస్ట్ ఫ్రెండ్, నా గైడ్.. నా సోదరి! నీలో ఉన్న ధైర్యం నీకు ఎప్పుడూ విజయాన్ని ఇవ్వాలి.” హ్యాపీ విమెన్స్ డే

“నీ కలలన్నీ నిజమవ్వాలని, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆశిస్తూ.. హ్యాపీ విమెన్స్ డే.”

స్నేహితురాలు/తోటి మహిళా ఉద్యోగుల కోసం..
“నీలో ఉన్న ఆత్మవిశ్వాసం చూస్తుంటే.. ముచ్చటేస్తుంది. ఇలాగే నిరంతరం ఎదుగుతూ ఉండాలి. హ్యాపీ విమెన్స్ డే ఫ్రెండ్!”

“సవాళ్లను ఎదుర్కోవడంలో నీకు నువ్వే సాటి. గొప్ప స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.”

“ఒక మహిళగా నువ్వు సాధిస్తున్న విజయాలు మా అందరికీ గర్వకారణం. హ్యాపీ విమెన్స్ డే!”

“ఏ రంగంలోనైనా పురుషులకు తీసిపోమని నిరూపిస్తున్న నీకు నా అభినందనలు. హ్యాపీ విమెన్స్ డే !”

“సమాజంలో నువ్వు క్రియేట్ చేస్తున్న పాజిటివ్ ఇంపాక్ట్ నిజంగా అద్భుతం. కీప్ ఇట్ అప్!”హ్యాపీ విమెన్స్ డే

“నువ్వు కేవలం ఒక మహిళవు మాత్రమే కాదు. ఒక గొప్ప శక్తివి. నీ ధైర్యానికి నా సెల్యూట్. హ్యాపీ విమెన్స్ డే!”

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×