E-Paper
Advertisement

Prabhas Fauji: ఆ 20 నిమిషాలే కీలకం.. ప్రభాస్ తో హను మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

Prabhas Fauji: ఆ 20 నిమిషాలే కీలకం.. ప్రభాస్ తో హను మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
Advertisement

Prabhas Fauji:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస పెట్టి భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నారు. వరుస లైనప్స్ తో బిజీగా మారిన ఈయన.. ఈ ఏడాది ప్రముఖ డైరెక్టర్ మారుతీ (Maruthi) దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రభాస్ కెరియర్ లోనే తొలిసారి హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఫలితంగా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రభాస్ – హను రాఘవపూడి (Hanu raghavapudi)దర్శకత్వంలో వస్తున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్ అభిమానులలో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో 20 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి కీలకంగా మారనుంది అని సమాచారం.

తాజా షెడ్యూల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్..

వివరాలలోకి వెళితే.. ‘సీతారామం’ సినిమాతో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా.. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ ఫౌజీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 70% చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని విజువల్ వండర్ గా తీర్చిదిద్దనున్నారు. ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించారు.

ఆ 20 నిమిషాలే కీలకం..

Advertisement

ఈ యాక్షన్ ఎపిసోడ్ సుమారుగా 20 నిమిషాల పాటు సాగుతుందని.. ప్రేక్షకులకు గూస్ బంప్స్ మూమెంట్స్ ఇస్తుందని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.. ముఖ్యంగా ఈ పోరాట ఘట్టం యాక్షన్ మాత్రమే కాకుండా కథలో అత్యంత కీలకమైన మలుపుగా ఉండబోతుందని.. ప్రభాస్ చేత హను మాస్టర్ ప్లాన్ చేస్తున్నారనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పైగా ఈ యాక్షన్ సీక్వెన్స్ లో ప్రభాస్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు హను రాఘవపూడి స్టైల్ ఎమోషన్స్ పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. ఏది ఏమైనా ఊహించని అప్డేట్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తుందని చెప్పవచ్చు. మరి ఆ 20 నిమిషాలే కీలకమని చెప్పడంతో అసలు ఈ యాక్షన్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ అభిమానులలో పెరిగిపోయింది.

రెబల్ స్టార్ సరసన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్..

ఇకపోతే రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈయనకు జోడిగా మరో పాన్ ఇండియా హీరోయిన్ ని రంగంలోకి దింపుతారని అందరూ అనుకోగా.. వినూత్నంగా ప్రయత్నించే హను రాఘవపూడి ఏకంగా సోషల్ మీడియా ఇన్ఫ్లు యెన్సర్ ఇమాన్విను రంగంలోకి దించేశారు. ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైన ఇమాన్వి నటిగా తనను తాను ఎలా ప్రూవ్ చేసుకుంటుందో చూడాలి. ఇప్పటికే ప్రముఖ డాన్సర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఇమాన్వి నటిగా తొలి అడుగులు వేస్తోంది. మరి తన నటన నైపుణ్యంతో ప్రేక్షకులను మెప్పించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

ALSO READ:BAFTA -2026: బాఫ్టా వేదికపై సందడి చేసిన అలియా..ఈ క్షణాలు మర్చిపోలేనివి అంటూ!

ప్రభాస్ తదుపరి చిత్రాలు..

ఇక ప్రభాస్ తదుపరి చిత్రాల విషయానికొస్తే.. మరొకవైపు సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తున్నారు. ఇందులో త్రిప్తి డిమ్రి హీరోయిన్గా నటిస్తోంది. మరొకవైపు కల్కి సీక్వెల్ తో పాటు సలార్ సీక్వెల్ లో కూడా ప్రభాస్ నటించాల్సి ఉంది.

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×