E-Paper
Advertisement

Dhurandhar Controversy: 1100 కోట్లు కొట్టారు సరే.. మా వాటా ఎక్కడ? అంటుంది ఎవరో తెలుసా ?వీడియో వైరల్

Dhurandhar Controversy: 1100 కోట్లు కొట్టారు సరే.. మా  వాటా ఎక్కడ? అంటుంది ఎవరో తెలుసా ?వీడియో వైరల్
Advertisement

Dhurandhar Controversy:‘ధురంధర్: ది రివెంజ్’..ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ స్పై థ్రిల్లర్  బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి స్ప్రుష్టిస్తున్న సంగతి తెల్సిందే. అయితే, ఈ సినిమాలో చూపించిన ‘ఆపరేషన్ ధురంధర్’ కంటే పెద్ద ట్విస్ట్ ఒకటి రివీల్ అయ్యింది. అవును ధురంధర్: ది రివెంజ్’లో రణ్ వీర్ సింగ్ కరాచీలోని ల్యారీ గల్లీల్లో దూరి ఉగ్రవాదులని మట్టు బెడితే ఇప్పుడు అదే ల్యారీ ప్రజలు సోషల్ మీడియా సాక్షిగా ధురంధర్ యూనిట్ కి పెద్ద షాకే ఇచ్చారు.

 ల్యారీ ప్రజలు మాట్లాడుతూ మీ సినిమాలో మా ల్యారీ సిటీని ఉగ్రవాదులకి అడ్డాగా, యాక్షన్ సీక్వెన్స్ లకి బ్యాక్‌డ్రాప్‌గా వాడుకుని వేల కోట్లు సంపాదించారు కదా..ఇపుడు వచ్చిన ఆ వేల కోట్ల కలెక్షన్స్ లో మాకూ వాటా ఉండాలి” అంటూ డిమాండ్ చేయడం విశేషం.ఇపుడు దీనికి సంబంధించిన వీడియోలే ఎక్స్ (X), ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

 ముఖ్యంగా ల్యారీ పేరును మీ సినిమాలో బ్రాండ్‌లా వాడుకున్నారని, అందువల్లే సినిమా సూపర్ హిట్ అయిందని సో .. సినిమా సాధించిన కలెక్షన్స్ లో ఓ 500 కోట్లు ల్యారీ డెవలప్ చేయడానికి, ఇక్కడ రోడ్లకి , ప్రజా సంక్షేమానికి ఇవ్వాలని కోరడం విడ్డూరం.అంటే  సినిమాలో రణ్‌వీర్ సింగ్ గన్ పట్టుకుని ల్యారీలో వీరవిహారం చేస్తే మన జనం ఈలలు వేస్తే రియల్ లైఫ్ ల్యారీ వాసులు ఇలా ‘క్యాలిక్యులేటర్’ పట్టుకుని వాటాలు తేల్చే పనిలో పడ్డారన్న మాట.ఏది ఏమైనా వారి తీరు చూస్తుంటే “మా గల్లీలను ఇంత డీటైల్డ్ గా చూపించినందుకు థాంక్స్ చెప్పక్కర్లేదు..కాని మీరు డబ్బులు సంపాదించిన వాటిలో  కొన్ని కోట్లు ట్రాన్స్ ఫర్ చేస్తే చాలు” అన్నట్టుగా ఉంది .

also read:Summer Tips: దీని ముందు ఏ రిఫ్రిజిరేటర్ అయినా వేస్టే..

Advertisement

 దీంతో ల్యారీ ప్రజలు అలా డిమాండ్ పెట్టారో లేదో సెటైర్స్ చెడుగుడు ఆడేస్తున్నారు మీమర్స్.ఒకవెళ “రేపు పొద్దున ఏలియన్ సినిమాలు తీస్తే.. మార్స్ గ్రహం నుంచి కూడా టాక్స్ అడుగుతారేమో!” అంటూ కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు. చూడాలి మరి సినిమాలో ఉగ్రవాదులని ఎదుర్కున్న రణ్‌వీర్ , వాటా కావాలనే డిమాండ్‌ను ఎలా ఎదుర్కొంటాడో ..సాలిడ్ ఎంటర్ టైనర్ ఇచ్చిన మేకర్స్ వచ్చిన వసూళ్ల నుంచి ఏమైనా ప్రసాదంపంచుతారో !

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×