E-Paper
Advertisement

Rowdy Janardhana: పెళ్లి తర్వాత జోరు పెంచిన విజయ్ దేవరకొండ .. రౌడీ జనార్ధన పై భారీ హైప్!

Rowdy Janardhana: పెళ్లి తర్వాత జోరు పెంచిన విజయ్ దేవరకొండ .. రౌడీ జనార్ధన పై భారీ హైప్!
Advertisement

Rowdy Janardhana:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో కెరియర్ మొదలు పెట్టిన ఈయన.. పెళ్లి సందడి సినిమాతో పూర్తిస్థాయి హీరోగా అవతరించారు. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ.. గీతాగోవిందం లాంటి క్లాసిక్ చిత్రంతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. అంతేకాదు అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా సెన్సేషన్ క్రియేట్ చేశారు విజయ్ దేవరకొండ.

హైప్ క్రియేట్ చేస్తున్న కొత్త వార్త..

అలాంటి ఈయన తన ప్రేయసి , ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika mandanna) తో ఈ ఏడాది ఫిబ్రవరి 26 2026న డెస్టినేషన్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ జోరు పెంచారు. అందులో భాగంగానే తాజాగా ఆయన నటిస్తున్న రణబాలి చిత్రంతో పాటు రౌడీ జనార్దన సినిమా షూటింగ్లను వేగవంతం చేశారు. ఇక అందులో భాగంగానే రౌడీ జనార్ధన మూవీకి సంబంధించిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

స్లమ్స్ లో రౌడీ జనార్ధన..

Advertisement

ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఒక రూరల్ మాస్ డ్రామాకు విజయ్ దేవరకొండ కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి రౌడీ జనార్ధన అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో గ్రాండ్ స్కేల్ లో ఉండబోయే యాక్షన్ సీక్వెన్స్ ను విజయ్ టీం డిజైన్ చేస్తోందట. ముంబై స్లమ్స్ ఏరియాలో రాబోయే హై ఆక్టేన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలవనున్నట్లు సమాచారం. ఇంటెన్స్ రియలిస్టిక్ ఆక్షన్ ఎక్స్పీరియన్స్ ను అందించేలా ఈ ఎపిసోడ్ ఉండనుంది అని ఇన్సైడ్ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు విజయ్ దేవరకొండ ట్రాన్స్ఫర్మేషన్ కూడా సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.

ALSO READ:Niharika Konidela: అకీరా ఎంట్రీపై నిహారిక క్లారిటీ.. రూమర్స్ కి చెక్.. షాక్ లో ఫ్యాన్స్!

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో..

Advertisement

ఇకపోతే రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రియల్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో విజయ్ తన విశ్వరూపం చూపించనున్నాడు అనే కామెంట్లు వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం.. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే.. దాదాపు 8 సంవత్సరాలుగా ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్నతో ప్రేమాయణం కొనసాగించిన ఈయన.. ఈ ఏడాది వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు. ఇకపోతే తన భార్య రష్మిక మందన్నతో కలసి ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సినిమా చేస్తున్నారు. అదే రణబాలి. ఈ సినిమాతో హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తోంది ఈ జంట. ఇప్పటికే గీత గోవిందం , డియర్ కామ్రేడ్ వంటి సినిమాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. మరి ఈ రణబాలి సినిమా ఈ జంటకు హ్యాట్రిక్ సక్సెస్ అందించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×