E-Paper
Advertisement

Haunted Spots: పగలు సేఫ్, రాత్రి డేంజర్.. కేరళంలో 5 మిస్టరీ ప్లేసెస్!

Haunted Spots: పగలు సేఫ్, రాత్రి డేంజర్.. కేరళంలో 5 మిస్టరీ ప్లేసెస్!
Advertisement

Haunted Spots in Keralam: కేరళం అందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం. పచ్చని కొండలు, అడవులు, జలపాతాలు అలా చూస్తూ బతికేయెచ్చు అనిపిస్తుంది. అయితే, ఈ రాష్ట్రంలో కొన్ని ప్రదేశాలు పగలు అందంగా ఉన్నా, రాత్రి సమయంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలు గుర్తింపు తెచ్చుకున్నాయి. అలాంటి ఐదు ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

⦿ సుమతి వలవు పాలక్కాడ్

హాంటెడ్ స్పాట్స్ లో మొట్టమొదటి సుమతి వలవు పాలక్కాడ్. ఇది పాలక్కాడ్ జిల్లాలో ఉన్న ఒక హెయిర్‌పిన్ రోడ్. స్థానిక కథల ప్రకారం, సుమతి అనే మహిళ ఇక్కడ మరణించిందని, ఆమె ఆత్మ ఇప్పటికీ తిరుగుతుందని భావిస్తారు. ముఖ్యంగా రాత్రి సమయంలో వెళ్లే వారికి వింత అనుభవాలు ఎదురయ్యాయని చెప్తారు. అందుకే,  రాత్రి పూట ఇక్కడికి వెళ్లపోవడం మంచిదంటారు.

⦿ చైన్ ట్రీ, వయనాడ్

Advertisement

వయనాడ్‌ లోని లక్కిడి దగ్గర ఉన్న ఈ చెట్టు గొలుసులతో కట్టబడి ఉంటుంది. ఒక ఆదివాసి యువకుడి బ్రిటిషర్లు మోసం చేసి చంపేశారని, అప్పటి నుంచి అతడి ఆత్మ ఇక్కడే ఉందని నమ్ముతారు. అతడి ఆత్మను శాంతింపజేయడానికి గొలుసులతో బంధించారని స్థానికులు చెప్తారు.  రాత్రి సమయంలో కొంతమంది ఇక్కడికి వెళ్లడానికి భయపడతారు. పగలు మాత్రం ఇది చాలా అందమైన ప్రదేశంగా కనిపిస్తుంది.

⦿ ఎలాంథూర్ నరబలి హౌస్

ఇదో క్రైమ్ జరిగిన ప్రదేశం. 2022లో జరిగిన నరబలి ఘటన దేశాన్ని కుదిపేసింది. డబ్బు, సంపద కోసం కొంతమంది మాంత్రిక విశ్వాసాలను నమ్మి ఇద్దరు మహిళలను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అప్పటి నుంచి ఈ ఇంటి చుట్టూ భయానక వాతావరణం ఉందని స్థానికులు చెప్తారు.  కొంతమంది ఈ ప్రదేశం దగ్గరికి వెళ్లడానికే భయపడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ ఇల్లు చుట్టూ వెళ్లకూడదని స్థానికులు చెబుతుంటారు.

⦿ కరియవట్టం క్యాంపస్ రోడ్డు

Advertisement

ఇది కేరళం విశ్వవిద్యాలయం దగ్గర ఉన్న ప్రశాంతమైన రోడ్. పగలు చాలా అందంగా ఉంటుంది. కానీ రాత్రి సమయంలో ఇక్కడి నుంచి వెళ్లేందుకు భయపడుతారు. ఈ రోడ్డులో తన ప్రియుడి హత్య తర్వాత.. హైమావతి అనే యువతి అక్కడే ఆత్మహత్య చేసుకుందట. ఇప్పటికీ ఆమె ఆత్మ అక్కడ తిరుగుతుందని భావిస్తారు. అందుకే, రాత్రిపూట అక్కడికి ఎవరూ వెళ్లరు.

⦿ బోనకాడ్ బంగ్లా

ఇది అడవుల మధ్య ఉన్న పాత బంగ్లా. బ్రిటిష్ కాలంలో నిర్మించబడిన ఈ భవనం ఇప్పుడు శిథిలం అయ్యింది. చుట్టూ నిశ్శబ్దం ఎక్కువగా ఉండటం వల్ల ఇది భయానకంగా అనిపిస్తుంది. ఒకప్పుడు ఇక్కడ చిన్నారి హత్య జరిగిందని, అప్పటి నుంచి ఇక్కడ ఆ పాప ఆత్మ తిరుగుతుందని భావిస్తారు. మొత్తంగా, ఈ ప్రదేశాలు పగలు చాలా అందంగా, చూడదగ్గవిగా ఉంటాయి. కానీ, రాత్రి సమయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం అని స్థానికులు చెప్తారు. అసలు వాస్తవం ఏంటనేది ఎవరూ తేల్చకపోవడంతో ఇప్పటికీ ఈ ప్రదేశాలు మిస్టరీగానే కొనసాగుతున్నాయి.

Read Also: ప్రకృతి అందాల నడుమ 180 డిగ్రీ వ్యూ.. విస్టాడోమ్ ట్రైన్ జర్నీ ఒక్కసారైనా చేయాలి బ్రో!

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×