Spirit Movie : పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి స్పిరిట్.. యానిమల్ మూవీతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలోకి రాబోతుంది. న్యూయర్ సందర్బంగా ఈ చిత్రం నుంచి డార్లింగ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్ వచ్చేసింది. స్పిరిట్ నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ ఒక ఎత్తు.. ఇప్పుడు మాత్రం డార్లింగ్ లుక్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాలకే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. ఇక ఆలస్యం ఎందుకు ఈ మూవీ నుంచి న్యూయర్ స్పెషల్ గా రిలీజ్ అయిన పోస్టర్ లో డార్లింగ్ లుక్ ఎలా ఉందో ఓ లుక్ వేద్దాం పదండీ..
ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈయన నటించిన రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ మూవీస్ మూడు 2026 లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో రాబోతున్న స్పిరిట్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేస్తారు. గతంలో ఎన్నడు కనిపించని విధంగా ఆ పోస్టర్లో డార్లింగ్ కనిపిస్తున్నాడు.. ఆ పోస్టర్ లో ప్రభాస్ ఒంటినిండా గాయాలతో, నోటిలో సిగరెట్ తో మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు.. ఎదురుగా తృప్తి కనిపిస్తుంది.. షర్ట్ లేకుండా ప్రభాస్ కనిపించడం తో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మొత్తానికి ఆ పోస్టర్ లో డార్లింగ్ లుక్ మాత్రం మాములుగా లేదు.. ఆ పోస్టర్ ప్రస్తుతం జనాల నుంచి మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. కేవలం రిలీజ్ అయిన కొన్ని నిమిషాలకే ట్రెండ్ అవ్వడంతో ఏ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. పోస్టర్ని చూస్తుంటే ఈ సినిమాలో కూడా డార్లింగ్ రొమాంటిక్ సీన్లలో నటించబోతున్నాడు ఏమో అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడు తెలియాలంటే సినిమా వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే..
You loved what existed before.
Now fall in love with what you never knew existed….#SPIRIT FIRST POSTER 🔥#OneBadHabit #Prabhas@imvangasandeep @tripti_dimri23 pic.twitter.com/J1Svt3E8uY— Spirit (@InSpiritMode) December 31, 2025
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో ప్రభాస్ హీరోగా వస్తున్న స్పిరిట్ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసిన సందీప్ రెడ్డివంగ ఈ షెడ్యూల్ నుంచే ప్రభాస్ యొక్క మొదటి లుక్ ను రిలీజ్ చెయ్యాలని సందీప్ ఫిక్స్ అయ్యాడు. దాంతో తాజాగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. డార్లింగ్ ఊహించిన దానికన్నా బాగా ఉన్నాడని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మొత్తానికైతే ప్రభాస్ ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది.. డైరెక్టర్ సందీప్ ట్రాక్ రికార్డ్ కూడా బాగా ఉండటంతో సినిమా బ్లాక్ బాస్టర్ అని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్స్ తో ఉన్నారు.. మరి ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగ ఏ రికార్డులను బద్దలు కొడతాడో చూడాలి..