BigTV English

Allu Arjun – Will Smith : అల్లు అర్జున్‌కు విలన్‌గా హాలీవుడ్ స్టార్ హీరో.. ఇక భీకర యుద్దమే!

Allu Arjun – Will Smith : అల్లు అర్జున్‌కు విలన్‌గా హాలీవుడ్ స్టార్ హీరో.. ఇక భీకర యుద్దమే!

Allu Arjun – Will Smith: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), పుష్ప (Pushpa) సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే పుష్ప, పుష్ప 2 సినిమాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee ) దర్శకత్వంలో తన 22వ సినిమాని ప్రకటించారు అల్లు అర్జున్. అంతేకాదు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోని రిలీజ్ చేస్తూ సినిమాను అధికారికంగా ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో పలు సినిమాలకు పనిచేసిన విఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయి. దీనికి తోడు కోలీవుడ్ బడా నిర్మాత సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ (Kalanidhi maran) ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


హాలీవుడ్ రేంజ్ లో అల్లు అర్జున్ మూవీ..

ఇకపోతే హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ఏకంగా హాలీవుడ్ స్టార్ హీరోని డైరెక్టర్ అట్లీ రంగంలోకి దింపినట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమాలో కీలకపాత్రల కోసం డైరెక్టర్ అట్లీ హాలీవుడ్ నటీనటులను సంప్రదిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఇద్దరు హాలీవుడ్ హీరోల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. థోర్, ఎక్ట్సాషన్ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న హాలీవుడ్ హీరో క్రిస్ హెమ్స్వర్త్ తో పాటూ హాలీవుడ్ టాప్ హీరో విల్ స్మిత్ (Will Smith) ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించబోతున్నట్లు సమాచారం.


విలన్ గా హాలీవుడ్ స్టార్ దిగ్గజం..

ఇకపోతే అల్లు అర్జున్ – అట్లీ సినిమాను లార్జర్ దాన్ లైఫ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో విలన్ ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. తొలిసారి అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ సినిమాలో హీరోగానే కాకుండా విలన్ గా కూడా కనిపించబోతున్నారని, మరొకవైపు హాలీవుడ్ హీరోలతో కూడా అల్లు అర్జున్ తలపడే సీన్లు ఉంటాయని.. ఇప్పుడు హాలీవుడ్ టాప్ హీరో విల్ స్మిత్ అల్లు అర్జున్ కి విలన్ గా నటించబోతున్నట్లు సమాచారం. మొత్తానికైతే ఇప్పుడు సినిమాకు సంబంధించిన న్యూస్ వదులుతూ భారీ అంచనాలు పెంచేశారు చిత్ర బృందం.

అల్లు అర్జున్ – అట్లీ సినిమా నటీనటులు..

అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాకి AA 22xA6 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో దీపిక పదుకొనే(Deepika Padukone) హీరోయిన్గా నటిస్తోంది. అలాగే మృణాల్ ఠాగూర్ కూడా కీలకపాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి స్పైడర్ మాన్, అవెంజర్స్, మార్వెల్స్, వండర్ విమెన్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన టాప్ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పనిచేస్తున్నట్లు సమాచారం.

Related News

Kishkindhapuri Collection : హీరో బెల్లం మూవీ బిగ్ ఫెయిల్యూర్… ఫస్ట్ డే దారుమైన కలెక్షన్లు..

Manchu Manoj :అన్నదమ్ములు కలిసిపోయారు… మంచు వారి ఇంటి పొంగిపోతున్న ప్రేమలు!

Mirai Day 1 Collections : ‘మిరాయ్’ కలెక్షన్లు.. మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే ?

Prabhas in Mirai : అది డార్లింగ్ వాయిస్ కాదు.. ఎంత మోసం చేశారయ్యా ?

Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ పై రష్మిక క్లారిటీ!

Raja Saab : ప్రభాస్ ‘ రాజాసాబ్ ‘ కు అక్కడ పోటీ తప్పట్లేదే..?

Tamannaah: అలాంటి వాడే భర్తగా రావాలంటున్న మిల్కీ బ్యూటీ.. అందుకే లవ్ ఫెయిల్యూరా?

Tollywood Villain: నిర్మాతగా మారబోతున్న టాలీవుడ్ విలన్.. ఈ ట్విస్ట్ ఏంటి సార్..?

Big Stories

×