Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి సీక్రెట్ నెంబర్‌ను ట్రాప్ చేయమని చెప్తాడు అమర్. దీంతో మనోహరి ఫోన్ ఆన్ చేయగానే… రామ్ ఆ నెంబర్‌ను ట్రాప్ చేసి అమర్‌కు చెప్తాడు. దీంతో రాథోడ్ కంగారుగా సార్ మనం ఉన్న ఏరియాలోనే వాళ్లు ఉన్నారు. మన టీంతో వాళ్లను వెతుకుదాం అంటాడు. దీంతో అమర్.. వాళ్లు రోడ్ల మీద ఉంటారన్న గ్యారంటీ లేదు రాథోడ్.. మనల్ని అబ్జర్వ్ చేయడానికి ఈ చుట్టు పక్కల ఇళ్లు రెంట్‌కు తీసుకుని కూడా ఉండవచ్చు అని చెప్తాడు. రాథోడ్ అవును సార్ మరి ఇప్పుడు ఆవిడ ఎవరు ఎక్కడ ఉన్నారో ఎలా తెలుస్తుంది సార్ అని అడగ్గానే.. కచ్చితంగా తెలుసుకోవచ్చు రాథోడ్. మరొక్కసారి అవసరం కోసం ఫోన్ ఆన్ చేయగానే కచ్చితమైన లోకేషన్ తెలుసుకోవచ్చు అని చెప్తాడు అమర్. రామ్ ఇవాళ మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. కచ్చితంగా ఆ లేడీ మళ్లీ ఫోన్ ఆన్ చేస్తుంది. నువ్వు అలర్ట్ గా ఉండు అని చెప్తాడు.
మరోవైపు చిత్రను మనోహరి తిడుతుంది. ఇది ఇల్లు అనుకున్నావా..? చేపల మార్కెట్ అనుకున్నావా..? అలా అరుస్తున్నావు.. అంటుంది. దీంతో చిత్ర ఏంటి మను నా విజయాన్ని నీతో పంచుకుందామని వస్తే ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటుంది చిత్ర. అబ్బో పంచుకునేంతగా ఏం సాధించావు అంటుంది మనోహరి. అప్పుడే మర్చిపోయావా..? భాగీ ఇప్పుడు నాకు అరుంధతి నగలు ఇస్తుంది కదా..? అని చెప్తుంది. దీంతో మనోహరి కోపంగా ఒసేయ్ తింగరి దానా..? అది నీకు పర్మినెంట్‌గా ఇవ్వడం లేదు. ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకుంటుంది. మళ్లీ వాటిని తీసుకుని కప్‌బోర్డులో పెట్టేస్తుంది దానికి ఎందుకు అంత సంబరపడుతున్నావు అంటుంది మనోహరి. భాగీ తీసుకోవడానికైనా నేను ఇవ్వడానికైనా నగలు ఉండాలి కదా మను అంటుంది చిత్ర.
దీంతో మనోహరి కంగారుగా ఏంటి ఏం మాట్లాడుతున్నావు నగలు ఉండవా..? మరి ఏమైపోతాయి అని అడుగుతుంది. దీంతో నగల దొంగతనం విషయం మనుకు చెబితే వాటా అడుగుతుంది అని మనసులో అనుకుని భాగీ అడక్కముందే నేనే వెళ్లి కప్‌బోర్డులో పెట్టేస్తాను అందుకే అలా అన్నాను అంటూ మాట మారుస్తుంది చిత్ర. ఇంతలో నగలు తీసుకొచ్చి హాల్లో పెట్టిన మిస్సమ్మ చిత్రను పిలుస్తుంది కిటికీలోంచి అంతా చూస్తున్న ఆరు పాపం గుప్త గారు భాగీ వీళ్లందరూ తనతో ఆడేసుకుంటున్నారు. నాకు కానీ శక్తులు రావాలి వీళ్ల పని పట్టేదాన్ని అంటుంది. అటుల చేసేదవే అనే నీ శక్తులు హరించుకుపోయాయి అంటాడు గుప్త. ఇంతలో మనోహరి, చిత్ర బయటకు వస్తారు. వాళ్లకు నగలు ఇస్తుంది మిస్సమ్మ. ఇంతలో అమర్ వచ్చి నగలు చూసి ఎమోషనల్‌గా రూంలోకి వెళ్లిపోతాడు.
వడ్డాణం ఉందా..? చోకర్ లాంగ్ చైన్ బుట్టకమ్మలు అన్ని ఉన్నాయి కదా..? ఏమైనా మిస్ చేశావా..? అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ లేదు ఏం మిస్ చేయలేదు అని చెప్తుంది. దీంతో చిత్ర థాంక్స్ నగలు ఇచ్చేస్తున్నందుకు అని చెప్తుంది. హలో ఇస్తున్నందుకు అని చెప్పాలి. ఎందుకంటే రిసెప్షన్ అవ్వగానే తిరిగి తీసుకుంటా కాబట్టి.. చైన్‌లో లింక్ మిస్ అయింది. నెక్లెస్ కింద పడిపోయింది అని కథలు చెప్పాలని చూస్తే నువ్వు నాలో ఇంకో భాగీని చూస్తావు. అది నీకు అసలు మంచిది కాదు. కావాలంటే మనును అడుగు చెప్తుంది అంటుంది. దీంతో మనోహరి కోపంగా ఏయ్ అంటుంది. వెంటనే మిస్సమ్మ ఆ ఏంటి..? ఇవి ఆరు అక్క నగలు ఆయన జ్ఞాపకాలు వీటికి ఏమైనా జరిగితే ఇద్దరిని వదలను.. నా గురించి చిత్రకు తెలియకపోవచ్చు మను కొంచెం నువ్వు చెప్పు నాతో ఆడినట్టు ఆరు అక్క నగలతో ఆడితే రప్పాడిస్తానని అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది మిస్సమ్మ.
తర్వాత కిచెన్‌లో ఉన్న మిస్సమ్మ దగ్గరకు వెళ్లి తదేకంగా చూస్తుంటాడు అమర్. మిస్సమ్మను అమర్‌ను గమనించదు. అమరే భాగీ అని పిలుస్తాడు. తిరిగి చూసిన మిస్సమ్మ.. ఏమైందండి అలా ఉన్నారు. ఎప్పుడు లేనిది మీరు కిచెన్‌లోకి వచ్చారు అని అడుగతుంది. దీంతో అమర్ నీకు ఇష్టం ఉందో లేదో కనుక్కోకుండా నగలు ఇవ్వమన్నందుకు సారీ అంటాడు అమర్. దీంతో మిస్సమ్మ నాకు కావాల్సింది నగలు, డబ్బు కాదండి నా కష్టసుఖాల్లో మీరు నాకు తోడుగా ఉండటం బాధలో ఓదార్పు, కష్టంలో తోడు. రోజులో మీతో మనసు విప్పి మాట్లాడే పది నిమిషాలు మా ఆడవాళ్లకు ఇవేనండి ఆస్థులు అంటూ ఎమోషనల్ అవుతుంది మిస్సమ్మ.. దీంతో మిస్సమ్మను హగ్ చేసుకుని ఓదారుస్తాడు అమర్. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?