E-Paper
Advertisement

Aadi Sai Kumar: ఆది సాయికుమార్ హీరో అవ్వాలనుకోలేదా.. ఆ కారణంతోనే ఇండస్ట్రీలోకి వచ్చారా?

Aadi Sai Kumar: ఆది సాయికుమార్ హీరో అవ్వాలనుకోలేదా.. ఆ కారణంతోనే ఇండస్ట్రీలోకి వచ్చారా?
Advertisement

Aadi Sai Kumar: ఆది సాయికుమార్ ప్రముఖ సీనియర్ నటుడు సాయికుమార్ (Sai Kumar )నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ప్రేమ కావాలి సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ఆది(Aadi) మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అనంతరం వరుస సినిమాలలో అవకాశాలను అందుకుంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈయన మాత్రం సరైన విధంగా సక్సెస్ అందుకోలేకపోయారు.. అయితే ఇండస్ట్రీకి కాస్త విరామం ఇచ్చిన ఆది త్వరలోనే శంభాల(Shambhala) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

క్రికెటర్ అవ్వాలని అనుకున్నా..

ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఆది సాయికుమార్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. నిజానికి తాను హీరో అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు అంటూ ఆది తెలియజేశారు. తనకు క్రికెట్ అంటే బాగా ఇష్టమని అందుకే క్రికెటర్ (cricketer)అవ్వాలని అనుకున్నాను. కానీ అనుకోకుండా తాను ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు.

దాయి దాయి దామ్మ పాటకు డాన్స్..

Advertisement

ఓసారి వేసవి సెలవులలో రాఘవ లారెన్స్ మాస్టర్ దగ్గర తాను డాన్స్ నేర్చుకున్నానని తెలిపారు. ఆ సమయంలో చిరంజీవి ఇంద్ర సినిమాలో దాయి దాయి దామ్మ అనే పాటకు డాన్స్ నేర్చుకున్నానని తెలిపారు. ఈ విషయం నాన్నకు చెప్పడంతో నాన్నగారు డాన్స్ వేయమని చెప్పారు. మొత్తం పాటకు డాన్స్ వేయడంతో చాలా మెచ్చుకున్నారు. అయితే అదే సమయంలో కళ అనే ఒక ఈవెంట్ నిర్వహించారని ఆ ఈవెంట్ కు చిరంజీవి గారు ముఖ్యఅతిథిగా వచ్చారని ఆది తెలిపారు. ఆ కార్యక్రమంలో తాను చిరంజీవి గారి ముందు కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అంటూ చిరంజీవి గారి పాటకు డాన్స్ వేశాను.

చిరంజీవి గారు ప్రశంసలు..

Advertisement

ఈ డాన్స్ అద్భుతంగా ఉన్న నేపథ్యంలో అందరూ కూడా తనని మెచ్చుకున్నారని చిరంజీవి గారు కూడా నా డాన్స్ మెచ్చుకున్నారని ఆది సాయికుమార్ తెలిపారు. ఆ క్షణం నాన్నను పిలిచి తనకు ఇండస్ట్రీలోకి రావాలనే ఆసక్తి ఉంటే ఎలాంటి ఆలస్యం చేయకుండా హీరోగా పరిచయం చేయి అంటూ చిరంజీవి గారు సలహా ఇచ్చారు. ఆ ఒక్క కారణంతోనే తాను క్రికెట్ పక్కనపెట్టి హీరో అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చాను అంటూ ఈ సందర్భంగా ఆది సాయికుమార్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అలా ఆరోజు పక్కన పెట్టిన బ్యాట్ ఇటీవల సిసిఎల్ కోసం చేత పట్టుకున్నాను అంటూ ఆది సాయికుమార్ తెలియజేశారు. తనుకు చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం కానీ ఆ క్షణం చిరంజీవి గారి ప్రశంసలు నన్ను ఇండస్ట్రీ వైపు నడిపించాయి అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Also Read: Keerthy Jaidhanush: గుడ్ గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న బుల్లితెర నటి కీర్తి జై ధనుష్..ఫోటో వైరల్!

Related News

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

Big Stories

Advertisement
×