Actress Aamani: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటి ఆమని (Aamani)ఒకరు. ఈమె ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో తెలుగు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ భాషలలో కూడా సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆమని పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సినిమాలు వెబ్ సిరీస్ లతో పాటు బుల్లితెర సీరియల్స్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా వెండితెర బుల్లితెర అంటూ వరుస సినిమాలలో నటిస్తున్న ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఆమని చిరంజీవి(Chiranjeevi) సినిమా గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చిరంజీవి తనకు ఎంతో ఇష్టమైన హీరో అని తెలిపారు. ఆయన పక్కన సినిమాలో చేయడం కోసం ఎన్నో రోజుల నుంచి తాను ఎదురు చూస్తున్నప్పటికీ ఆ కోరిక నెరవేరలేదని ఆమని తెలియజేశారు. అయితే ఒకసారి తనకు చిరంజీవి సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ తానే రిజెక్ట్ చేశానని ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చిరంజీవితో నటించడం కోసం ఎదురుచూసిన ఆమని చిరంజీవి సినిమానే రిజెక్ట్ చేశారా? ఈమె రిజెక్ట్ చేసిన సినిమా ఏంటి? ఎందుకు రిజెక్ట్ చేశారనే విషయానికి వస్తే..
చిరంజీవి త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం స్టాలిన్(Stalin). ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో సీనియర్ నటి కుష్బూ (Kushboo) కూడా నటించిన సంగతి తెలిసిందే . ఈ సినిమాలో కుష్బూ చిరంజీవికి అక్క పాత్రలో నటించారు. అయితే కుష్బూ కంటే ముందుగా ఈ పాత్రలో చేసే అవకాశం ఆమనికి వచ్చిందని, ఈమె రిజెక్ట్ చేయడంతోనే కుష్బూ బాగమయ్యారని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవికి సోదరిగా నటించడం ఇష్టం లేనటువంటి ఆమని రిజెక్ట్ చేసినట్టు తెలిపారు.
తమ్ముడు అని పిలవటం ఇష్టం లేదు..
చిరంజీవి గారు తనకి ఎంతో ఇష్టమైన హీరో ఆయన పక్కన హీరోయిన్గా చేయాలని ఎదురు చూస్తున్న తనకు చిరంజీవి పక్కన సోదరిగా చేయటం, తనని తమ్ముడు అని పిలవటం ఇష్టం లేకనే రిజెక్ట్ చేశానని తెలియజేశారు. చిరంజీవి పక్కన సినిమాలలో నటించే అవకాశం రాకపోయినా పర్లేదు కానీ ఆయనకు అక్కగా మాత్రం నటించనని ఈమె తెలిపారు. ఆమని చిరంజీవికి అక్కగా నటించడం ఇష్టంలేకే ఈ సినిమా రిజెక్ట్ చేశారని తెలియడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అభిమాన హీరోల సినిమాలలో చిన్న పాత్ర వచ్చిన చేయడానికి కొంతమంది సిద్ధంగా ఉంటారు కానీ ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో ఇలా కూడా రిజెక్ట్ చేస్తారా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
Also Read: పవన్ నుంచి భరణం తీసుకోవడం పై రేణు దేశాయ్ కౌంటర్.. భ్రమనుంచి బయట పడాలంటూ!