E-Paper
Advertisement

పవన్ నుంచి భరణం తీసుకోవడం పై రేణు దేశాయ్ కౌంటర్.. భ్రమనుంచి బయట పడాలంటూ!

పవన్ నుంచి భరణం తీసుకోవడం పై రేణు దేశాయ్ కౌంటర్.. భ్రమనుంచి బయట పడాలంటూ!
Advertisement

Renu Desai: రేణు దేశాయ్ పరిచయం అవసరం లేని పేరు. బద్రి సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఈ సినిమా సమయంలోనే ఈమె నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో ప్రేమలో పడటం అనంతరం పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులుగా మారిన సంగతి తెలిసిందే. ఇలా రేణు దేశాయ్ (Renu Desai) పవన్ కళ్యాణ్ తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా పవన్ నుంచి విడాకులు తీసుకున్న రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లల బాధ్యతలను ఆమె చూసుకుంటూ ప్రస్తుతం బిజీగా గడుపుతున్నారు.

డబ్బు కోసం ఎవరి మీద ఆధారపడను..

ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రేణు దేశాయ్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉండటమే కాకుండా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె పవన్ కళ్యాణ్ నుంచి భరణం తీసుకోవడం పట్ల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ విషయం గురించి రేణు దేశాయ్ పరోక్షంగా మాట్లాడుతూ.. నేను ఓ వ్యక్తి నుంచి డబ్బు (భరణం) తీసుకున్నానని భావిస్తున్నారు. అది పూర్తిగా ఆ వాస్తవమని తాను ఎవరి దగ్గర నుంచి ఎలాంటి డబ్బు తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు.

రియల్ ఎస్టేట్ పెట్టుబడులు..

Advertisement

నేను డబ్బు కోసం ఎవరి మీద ఆధారపడను. తాను రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై డబ్బు పెట్టి బాగా సంపాదించుకుంటున్నానని రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. నా డబ్బు నేనే సంపాదించుకుంటున్నాను అలాగే నేనే నా టాక్స్ లను కట్టుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా రేణు దేశాయ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నుంచి భరణం తీసుకోవడం పై క్లారిటీ ఇచ్చారు. అయితే గతంలో కూడా ఎన్నో సందర్భాలలో ఈమె పవన్ నుంచి ఎలాంటి భరణం తీసుకోలేదని చెప్పినప్పటికీ కొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ వందల కోట్ల రూపాయలు ఆమెకు భరణం కింద ఇచ్చారంటూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేణు దేశాయ్ స్పందిస్తూ క్లారిటీ ఇవ్వడమే కాకుండా ఆ భ్రమ నుంచి బయట పడాలని కోరారు.

హీరోగా అకీరా..

Advertisement

ఇక పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ అకిరా, ఆద్య బాధ్యతలను చూసుకుంటూ వారిని ఉన్నత చదువులు చదివిస్తున్నారు. ఈ పిల్లలిద్దరూ చాలా పెద్దవాళ్లు కావడంతో త్వరలోనే వీరిద్దరూ వారికి ఇష్టమైన రంగాలలో స్థిరపడబోతున్నారని తెలుస్తోంది అయితే అఖీరా ఇండస్ట్రీలోకి హీరోగా వస్తారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఈ విషయంపై పవన్ కళ్యాణ్ లేదా రేణు దేశాయ్ ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. అయితే వారికి ఏ రంగంలో స్థిరపడాలని ఉందో అందుకు తాము ప్రోత్సహిస్తామని తెలియజేశారు.

Also Read: డైరెక్టర్లకు కొత్త రూల్ పెట్టిన పుష్ప రాజ్…ఇది సాధ్యమయ్యేపనేనా బన్నీ?

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×