Aamir Sonam: ‘3 ఇడియట్స్ ‘..ఆల్ ఈజ్ వెల్ అంటూ 2009 డిసెంబర్‌లో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పక్కర్లేదు.రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పటి దాకా ఉన్న బాక్సాఫీస్ రికార్డులని బద్దలు కొట్టింది. ఆమిర్ ఖాన్, శర్మన్ జోషి, మాధవన్ ప్రధాన పాత్రలు పోషించగా కరీనా కపూర్ హీరోయిన్ గా కనిపించింది.విధు వినోద్ చోప్రా ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం విశేషం.
ఇక ఈ సినిమాకి చేతన్ భగత్ రాసిన ‘ఫైవ్ పాయింట్ సమ్ వన్’ నవల ఆధారంగా తెరకెక్కిందని మేకర్స్ స్వయంగా అనౌన్స్ చేశారు కూడా. అయితే ఇప్పటి వరకు కూడా ఈ సినిమాలో అమీర్ చేసిన’ఫున్షుక్ వాంగ్డూ’ క్యారెక్టర్ ని లడఖ్‌కు చెందిన విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ జీవితం ఆధారంగానే తీర్చి దిద్దారనే టాక్ ఉంది.అయితే ఇపుడు ఇదే విషయంపై అమీర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జరిగిన కార్యక్రమంలో అమీర్ మాట్లాడుతూ అసలు ఆ సినిమా తీస్తున్న సమయంలో అసలు నాకు గానీ, డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీకి గానీ సోనమ్ వాంగ్‌చుక్ ఎవరో అస్సలు తెలియదని, ఆ క్యారెక్టర్‌కు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని ఆమిర్ ఖాన్ తేల్చి చెప్పారు. సినిమాలో చతుర్ క్యారెక్టర్ చేసిన ఓమి వైద్య ఏదో వీడియోలో చెప్పిన మాటలు తప్పు అని కొట్టిపారేశారు.
నెటిజన్లకు పెద్ద షాక్ ఇచ్చిన పాత వీడియో
అయితే అమీర్ ఇలా మాట్లాడాడో లేడో సోషల్ మీడియాలో ఒక పాత వీడియో బయటకు వచ్చి నెటిజన్లకు పెద్ద షాక్ ఇచ్చింది.ఇక ఆ వీడియోలో సోనమ్ వాంగ్‌చుక్ స్వయంగా మాట్లాడుతూ, 2008లోనే ముంబైలో జరిగిన ఒక ప్రోగ్రామ్‌లో తాను ఆమిర్ ఖాన్‌ను కలిశానని చెప్పారు. ఆ టైమ్‌లో సియాచిన్ బార్డర్ గొడవల మీద ఒక సినిమా తీయాలని తాను ఆమిర్‌కు ఒక ఐడియా కూడా ఇచ్చినట్లు క్లారిటీ ఇచ్చారు. రెండు దేశాలు మంచు కొండ కోసం రోజుకు కోట్లు ఖర్చు పెట్టడం కంటే, ఆ డబ్బును ప్రజల చదువుల కోసం వాడేలా ఒక స్టోరీ లైన్ చెప్తే ఆమిర్ చాలా ఇంట్రెస్ట్‌గా విన్నారని ఆ వీడియోలో గుర్తుచేసుకున్నారు సోనమ్ వాంగ్‌చుక్ .
ఇక ఆ తర్వాత తాను చదువు కోసం ఫ్రాన్స్ వెళ్లానని, కట్ చేస్తే 2009 డిసెంబర్‌లో ‘3 ఇడియట్స్’ రిలీజ్ అయ్యాక లడఖ్‌లోని తన స్కూల్, తన లైఫ్ బేస్ చేసుకుని ఒక సూపర్ సినిమా వచ్చిందంటూ అందరూ ఫోన్లు చేస్తుంటే షాక్ అయ్యానని చెప్పుకొచ్చాడు సోనమ్ వాంగ్‌చుక్ .
అసలు విషయం బయటపెట్టిన వాంగ్‌చుక్
దీనిపై లడఖ్‌లోని తన స్కూల్ వాళ్లను అడిగితే, 2008 ఆగస్టులో ఒక సినిమా టీమ్ అక్కడికి వచ్చిందని తెలిసింది. కానీ వాళ్లు ప్లాస్టిక్ సామాన్లు ఎక్కువగా తెస్తుండటంతో ఎన్విరాన్‌మెంట్ పాడవుతుందని తమ స్కూల్లో షూటింగ్‌కు ఒప్పుకోలేదని, దాంతో పక్కనే ఉన్న మరో స్కూల్లో ఆ సీన్లు షూట్ చేశారని అసలు విషయం బయటపెట్టారు వాంగ్‌చుక్.
ఈ పాత వీడియో బయటకు రావడంతో నెటిజన్లు ఆమిర్ ఖాన్‌ను ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. సినిమా 2009లో వస్తే, అంతకంటే ముందే 2008లో వాంగ్‌చుక్‌ను కలవడమే కాకుండా, ఆయన స్కూల్ దగ్గరే షూటింగ్ చేసుకుని, ఇప్పుడు అసలు ఆయనెవరో తెలియదని ఆమిర్ ఖాన్ చెప్పడం ఏంటని నిలదీస్తున్నారు నెటిజన్లు.
అయితే విద్యార్థుల కోసం సోనమ్ చేస్తున్న పని మంచిదే కాని దాన్ని, ఇలా ఆ పాత్రకి ముడిపెట్టాల్సిన అవసరం లేదని తేల్చేశాడు. ఇక తాజాగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ కి అమీర్ మాజీ భార్య కిరణ్ రావు మద్దతు పలకిన సంగతి తెల్సిందే.ఏది ఏమైనా వీడియో ఇప్పుడిలా బయటికి వచ్చాకా అమీర్ దానిపై ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి !
#india Aamir Khan Denies Sonam Wangchuk Link to '3 Idiots' Amid Activist's Fast #cjp_पार्टी
In a recent London Indian Film Festival conversation, Aamir Khan dismissed claims that Ladakhi engineer and activist Sonam Wangchuk inspired his iconic Rancho character in the 2009…
— Thepagetoday (@thepagetody) July 17, 2026