E-Paper
Advertisement

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!
Advertisement

Best Electric SUVs for Monsoon: భారత్ లో వర్షాకాలం మొదలైతే చాలా ప్రాంతాల్లో రోడ్లు నీటితో నిండిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ కారు సేఫేనా? అనే డౌట్ చాలామందికి ఉంటుంది. కానీ, లేటెస్ట్ EVలు మంచి భద్రతా ప్రమాణాలతో తయారవుతున్నాయి. ముఖ్యంగా మంచి గ్రౌండ్ క్లియరెన్స్, వాటర్‌ ప్రూఫ్ బ్యాటరీ ఉన్న మోడళ్లను తీసుకుంటే వర్షాకాలంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించే అవకాశం టుంది.

IP67 బ్యాటరీ రేటింగ్ అంటే ఏంటి?

EV కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా చూడాల్సింది IP67 బ్యాటరీ రేటింగ్. ఈ రేటింగ్ ఉన్న బ్యాటరీ ప్యాక్, మోటార్ పూర్తిగా సీల్ చేయబడి ఉంటాయి. సాధారణంగా ఇవి ఒక మీటర్ లోతు వరకు సుమారు 30 నిమిషాల పాటు నీటిని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. దీంతో నీటి వల్ల బ్యాటరీ, మోటా కు నష్టం జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ముఖ్యం. కనీసం 170 మిల్లీమీటర్లకు పైగా గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటే, కారు అడుగుభాగం రోడ్డు, గుంతలకు తగిలే ప్రమాదం ఉండదు. ఇంతకీ వర్షాకాలంలో బెస్ట్ ఈవీలు ఏవంటే..

1.టాటా నెక్సాన్ EV

Advertisement

వర్షాకాలానికి అనుకూలంగా ఉండే EVలలో టాటా నెక్సాన్ EV ఒకటి. దీనికి 205 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. బ్యాటరీ, మోటార్ రెండూ IP67 సర్టిఫికేషన్‌తో వస్తాయి. నీటితో నిండిన రోడ్లపై కూడా ఈ SUV చక్కగా వెళ్తుంది.

2.టాటా పంచ్ EV

చిన్న సైజులో, బలమైన SUV కావాలనుకునే వారికి టాటా పంచ్ EV మంచి ఆప్షన్. 190 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్  పాటు IP67 రేటెడ్ బ్యాటరీ ఇందులో ఉంటుంది. ఎత్తైన సీటింగ్ పొజిషన్ కారణంగా భారీ వర్షాల్లో కూడా రోడ్డును స్పష్టంగా చూడవచ్చు.

3.మహీంద్రా XUV400

Advertisement

బలమైన నిర్మాణంతో గుర్తింపు పొందిన మహీంద్రా XUV400 కూడా వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తుంది. 182 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ తో పాటు IP67 రేటెడ్ బ్యాటరీ ప్యాక్ ఇందులో ఉంది. వెడల్పుగా ఉన్న బాడీ కారణంగా  తడి రోడ్లపై కూడా మంచి స్టేబులిటీని కలిగి ఉంటుంది.

4.MG ZS EV

ప్రీమియం ఎలక్ట్రిక్ SUV కోరుకునే వారికి MG ZS EV మంచి ఆప్షన్. 177 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్, IP67 సర్టిఫైడ్ బ్యాటరీ, అధునాతన భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఈ మోడల్ అనుకూలంగా ఉంటుంది.

వర్షాకాలంలో EV నడిపేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

*రోడ్డు మీద నీళ్లు ఎక్కువగా ఉంటే ఆ రూట్ లో వెళ్లకపోవడం మంచిది.

*ఎకో, నార్మల్ డ్రైవింగ్ మోడ్‌ లో నెమ్మదిగా ప్రయాణించాలి.

*నీటిలో ఒక్కసారిగా వేగం పెంచడం, మధ్యలో ఆపడం మంచిది కాదు.

*టైర్లలో సరైన ట్రెడ్ ఉండేలా చూసుకోవాలి. దీంతో కారు జారే ప్రమాదం తగ్గుతుంది.

*బ్యాటరీ, వరద నష్టాలకు కవరేజ్ ఇచ్చే ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది.

Read Also: మాన్సూన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 డెస్టినేషన్స్ మిస్ అవొద్దు!

Related News

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

సింపుల్ ఫ్లిప్ అప్ కాదు.. ఈ హెల్మెట్ 180 డిగ్రీలు తిరుగుతుంది!

Big Stories

Advertisement
×