BigTV English

Aishwarya – Abhishek: విడాకులు నిజమే.. సీనియర్ హీరోయిన్ తో అభిషేక్ రెండో పెళ్లికి సిద్ధం?

Aishwarya – Abhishek: విడాకులు నిజమే.. సీనియర్ హీరోయిన్ తో అభిషేక్ రెండో పెళ్లికి సిద్ధం?

Aishwarya – Abhishek: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai), అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan)జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎంతో మందికి ఆదర్శం అని చెప్పాలి. అలాంటి అన్యోన్య దంపతులపై కొంతమంది తప్పుడు రూమర్స్ సృష్టిస్తూ ఈ జంటకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఈ విడాకుల రూమర్స్ దావాణంలా విస్తరించడానికి కారణం వీరు చేస్తున్న పనులే అని కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.


ఐశ్వర్య – అభిషేక్ విడాకుల వార్తలకు అక్కడే ఆజ్యం..

అసలు విషయంలోకి వెళ్తే అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ఘనంగా జరిగినప్పుడు.. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) మాజీ ప్రేయసి, ప్రముఖ సీనియర్ హీరోయిన్ రేఖ(Rekha) తో ఐశ్వర్యరాయ్ చనువుగా కనిపించింది. దీనికి తోడు అదే వేడుకకు అభిషేక్ బచ్చన్ తన తల్లిదండ్రులతో కలిసి రాగా.. ఐశ్వర్య మాత్రం వీరికి దూరంగానే కనిపించింది. అప్పుడే వీరిద్దరి మధ్య విడాకుల రూమర్లు గుప్పుమన్నాయి.


విడాకుల వార్తలకు అనుగుణంగా అభిషేక్ ప్రవర్తన..

దీనికి తోడు వెకేషన్ పూర్తిచేసుకుని ముంబై ఎయిర్పోర్టులో కనిపించిన ఐశ్వర్యారాయ్, కూతురు ఆరాధ్య (Aaradhya)ను రిసీవ్ చేసుకోవడానికి అభిషేక్ బచ్చన్ ఎయిర్ పోర్ట్ కి రాకపోవడం పలు అనుమానాలకు దారితీసింది. అంతేకాదు డివోర్స్ పోస్ట్ కి అభిషేక్ లైక్ చేయడంతో నిజంగానే అభిషేక్ విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారా అంటూ కూడా కొంతమంది కామెంట్లు చేశారు.

కేన్స్ ఫెస్టివల్ ద్వారా రూమర్స్ కి చెక్ పెట్టిన ఐశ్వర్య..

అయితే ఇలా రోజురోజుకీ విడాకుల వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో అన్నింటికీ చెక్ పెడుతూ ఇంటర్నేషనల్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఐశ్వర్యారాయ్ నుదిటిన పెద్ద సింధూరం ధరించి అందరిని ఆశ్చర్యపరిచింది. తాము విడాకులు తీసుకోలేదని స్పష్టం చేసింది. అంతేకాదు పలు ఫ్యామిలీ ఫంక్షన్లకి హాజరవుతూ భర్తతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ విడాకుల రూమర్లకి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది.

ఒంటరిగా ఉండాలనుకుంటున్న అభిషేక్..

అయితే అంతా బాగుంది.. ఇక వీరు విడాకులు తీసుకోవడం లేదు అని అభిమానులు ఊపిరి పీల్చుకునే లోపే అభిషేక్ బచ్చన్ చేసిన పోస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవల తన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిషేక్ బచ్చన్..” ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో మళ్లీ విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ రూమర్స్ ఇప్పుడు ఒక మెట్టు మరింత దిగజారాయని చెప్పవచ్చు.

ఐశ్వర్యతో విడాకులా.. అభిషేక్ నిజంగానే రెండో పెళ్లికి సిద్ధమా?

తాజాగా బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న విషయానికి వస్తే.. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ తో అభిషేక్ బచ్చన్ రెండో వివాహానికి సిద్ధమవుతున్నారని, ఇక ఐశ్వర్యతో విడాకులు ఖాయమని బాలీవుడ్ మీడియాలో వార్తలు కోడై కూస్తున్నాయి. దీంతో అటు సినీ ఇండస్ట్రీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఐశ్వర్యతో విడాకులు.. అభిషేక్ బచ్చన్ ఇంకో హీరోయిన్ తో పెళ్లి అంటూ వస్తున్న వార్తలు మాత్రం కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం ఇప్పటికైనా ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ స్పందించి ఈ రూమర్స్ కి చెక్ పెట్టాలని కోరుకుంటున్నారు.

Related News

Chiranjeevi Vs Balakrishna: మరోసారి బయటపడ్డ మెగా నందమూరి విభేదాలు.. అసలు గొడవ అక్కడేనా?

OG Title: OG.. టైటిల్ ని ఆ నిర్మాత గిఫ్ట్ ఇచ్చారు.. అసలు నిజం చెప్పేసిన దానయ్య

OG Film: పవన్ అభిమానులకు బిగ్ షాక్… హెచ్డీ ప్రింట్ లీక్!

Pawan Kalyan: ఓజీ చూడాలంటే ఇది తప్పనిసరి… పవన్ ఫ్యాన్స్ కి ప్రసాద్ మల్టీప్లెక్స్ కండిషన్

Chiranjeevi: అసెంబ్లీలో బాలయ్య వ్యంగ్య కామెంట్స్‌పై చిరంజీవి స్పందన.. కీలక ప్రకటనతో..

Shah Rukh Khan: కొడుకు చేసిన పనికి షారుక్‌కి భారీ మూల్యం.. రూ. 2 కోట్లు పరువు నష్టం దావా!

OG Success Meet : థమన్ బాం*చ*త్ అన్నాడు… సక్సెస్‌మీట్‌లో నిర్మాత కామెంట్

Sujeeth: రాజమౌళికి పోటీగా సుజీత్… అంతా పవన్ వల్లే

Big Stories

×