Illu Illalu Pillalu Today Episode june 24th: నిన్నటి ఎపిసోడ్ లో.. ధీరజ్ వాళ్ళ నాన్న అన్న మాటలు విని బాధపడుతూ ఉంటాడు. వీడు ఇలా బాధపడడానికి కారణం నేనే వీడి బాధను ఎలాగైనా పోగొట్టాలని ప్రేమ అనుకుంటుంది.. మీ నాన్నన్న మాటలకి బాధపడుతున్నావా అని ప్రేమ అడుగుతుంది. మా నాన్న అనడం కొత్త కాదు పడటం నాకు కొత్త కాదు బాధ ఏమీ లేదు అని అంటాడు. అయితే ప్రేమ మాత్రం నీకు ఒక కథ చెప్తాను వింటావా అని అడుగుతుంది. ఈ టైంలో కథల దేవుడా అనేసి ధీరజ్ అనుకుంటాడు. కానీ ప్రేమ మాత్రం మా నానమ్మ చెప్పిన కథ వినరా అని బెదిరిస్తుంది. దేవుడు గురించి రాయి శిల్పంగా మారడం గురించి గొప్ప నీతి కథను ధీరజ్ చెప్తుంది. అటు నర్మదా ఎక్కడ ఉందో అని సాగర్ వెతుకుతూ ఉంటాడు. నర్మదా ఒకచోట కూర్చొని చేతిలో వాచి పట్టుకుని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. సాగరు ఏమైంది మా నాన్న ఏమైనా మళ్లీ నిన్ను అన్నాడా అని అడుగుతాడు. నర్మదా వాళ్ళ నాన్న గురించి చెప్పి ఎమోషనల్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. నర్మదను సాగర్ తీసుకుని వెళ్లి వాళ్ళ పుట్టింటి దగ్గర డ్రాప్ చేస్తాడు. మీ నాన్న పుట్టినరోజు అన్నావు కదా నువ్వు వెళ్లి మీ నాన్నకు వాచి గిఫ్ట్ గా ఇవ్వు నీ మీద నాకు కోపం మొత్తం పోతుంది అంతా మంచే జరుగుతుందని సాగర్ అంటాడు. కానీ నర్మద మాత్రం భయపడుతూ ఉంటుంది. భయపడవద్దు ఏమి కాదు నువ్వు వెళ్లి మీ నాన్నతో మాట్లాడి వచ్చేసేయ్ అని అంటాడు.. సాగర్ ఎంత ధైర్యం చెప్తున్నా సరే నర్మద మాత్రం లో లోపల టెన్షన్ పడుతూనే ఉంటుంది. నువ్వు రావా అని అడిగితే.. ఈరోజు మీ నాన్న బర్తడే నువ్వు వెళ్లి కనిపిస్తే ఆయన కోపం మొత్తం పోతుంది అని అంటాడు.
భర్త ఇచ్చిన ధైర్యంతో నర్మదా ఎంతో సంతోషంగా తన పుట్టింట్లో అడుగుపెడుతుంది. అయితే ఇంట్లోకి వెళ్ళగానే అమ్మ నాన్న అని పిలుస్తుంది. నర్మద మాట విని వాళ్ళ అమ్మ ఇంట్లోంచి పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ వాళ్ళ నాన్న మాత్రం ఆగు అని అంటాడు. మళ్లీ ఎందుకు వచ్చింది నా కూతురు లేచిపోయిందని చెప్పుకోవట్లేదు చచ్చిపోయిందని నీళ్లు వదిలేసాను అని అంటాడు. నేనేం తప్పు చేశాను నాన్న నాకు ఇష్టమైనవాన్నీ పెళ్లి చేసుకున్నాను.. ఈరోజు మీ పుట్టిన రోజు కదండీ అందుకే మీ కూతురు వచ్చింది అని నర్మద వాళ్ళమ్మ ఎంత చెప్తున్నా సరే వాళ్ళ నాన్న వినడు.
నీకు గుర్తుందా నాన్న నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న తర్వాత మీ 50 వ బర్త్ డే ని నేను చాలా గ్రాండ్ గా చేస్తాను అని అన్నాను. కానీ పరిస్థితులు బాగో లేకపోవడం వల్ల మీ దగ్గరకొచ్చి విషెస్ చెప్పి ఈ చిన్న గిఫ్ట్ ఇవ్వాలని వచ్చాను అని అంటుంది. నర్మద మాటలు విన్న ఆయన మొదట కూల్ అయినా కూడా ఆ గిఫ్ట్ చేతికి తీసుకోగానే నర్మదా సంతోషపడుతుంది. కానీ లేచిపోయి నా ఇంటి పరువు తీసావు అని వాళ్ళ నాన్న ఆ వాచ్ ని విసిరి కొట్టేస్తాడు.. మీ కూతురు లేచిపోయిందని అడుగుతుంటే నలుగురిలో మోహన్ చెల్లక నేను బాధపడుతుంటే నువ్వు ఇప్పుడు వాచి తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చి దగ్గరవుదామని అనుకుంటున్నావా అని షాక్ ఇస్తాడు.. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న నువ్వు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నావో ఆలోచించవా..?
నా అల్లుడు ఏం చేస్తున్నాడు అంటే నలుగురికి నేనేమని చెప్పాలి. రైస్ మిల్లులో పనిచేస్తున్నాడని చెప్పనా?.. అది వాళ్ళ సొంత రైస్ మిల్ ఏ కదా నాన్న అని నర్మదా అన్నా కూడా.. సొంత రైస్ మిల్లు కాదు రామరాజు కష్టార్జితం అని అంటాడు. నా కూతురు గవర్నమెంట్ జాబ్ చేస్తుంది నా అల్లుడు మాత్రం రైస్ మిల్లులో కూలీగా పనిచేస్తున్నాడని చెప్పుకోవాలంటే నాకు అవమానంగా ఉంది. ఎప్పుడూ నా ఇంటికి రావద్దు అని నర్మదను పంపిస్తాడు. నర్మదా తండ్రి అన్నమాట తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. సాగరు బండి ఆపి పెళ్లికి ముందే నేను రైస్ మిల్ లో పనిచేస్తున్న సంగతి నీకు తెలుసు కదా నర్మదా అని అంటాడు. మా నాన్న ప్రతి మాటకి నా దగ్గర సమాధానం లేదు. లేచిపోయి పెళ్లి చేసుకున్నాను అన్న కోపం ఆయనకు తగ్గిపోయింది.
Also Read : అవనిని రెచ్చగొట్టిన పార్వతి.. ఆరాధ్య ప్లాన్ సక్సెస్.. భానుమతిని బురిడీ కొట్టించిన కమల్..
కానీ ఆయన బాధంతా అల్లుడు ఏం చేస్తున్నాడో చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉందని అంటున్నాడని నర్మదా అంటుంది.. నువ్వు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నానని నాతో అన్నావు కానీ దాని గురించి నువ్వు మాట్లాడట్లేదు అని నర్మదా సాగర్ నిలదీస్తుంది. అటు ప్రేమ ఎగ్జామ్ కోసం కాలేజ్ కు వెళ్తుంది. ధీరజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ధీరజ్ రాగానే ఫుడ్ డెలివరీ ఇచ్చి లేట్ అయింది అని చెప్పగానే ఫీల్ అవుతుంది. తనకి ఇద్దరు కలిసి ఎగ్జామ్ హాల్ లోకి ఎంటర్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఎగ్జామ్ హాల్లో ప్రేమ ధీరజ్ కి చూపిస్తూ దొరికిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..