E-Paper
Advertisement

Action King Arjun: పవన్ కళ్యాణ్‌పై మరోసారి అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు

Action King Arjun: పవన్ కళ్యాణ్‌పై మరోసారి అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

Action King Arjun: యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా రూపొందిన చిత్రం ‘సీతా పయనం’ (Seetha Payanam). ఈ సినిమా ఓపెనింగ్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ సినిమా ప్రస్తావన వచ్చిన ప్రతిసారి, పవన్ కళ్యాణ్ గురించి అర్జున్ మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి ఆయన పవన్ కళ్యాణ్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై అర్జున్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీతో ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. ఈ సినిమాలో అర్జున్ (Action King Arjun) కూడా ఓ కీలక పాత్రలో నటించగా, యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా స్పెషల్ పాత్ర‌లో కనిపించనున్నారు. లవర్స్ డే స్పెషల్‌గా ఫిబ్రవరి 14న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా అర్జుణ్ మీడియాతో మాట్లాడుతూ.. సినిమా విషయాలతో పాటు, పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడారు. ముందుగా సినిమా విషయాలకు వస్తే..

యూనివర్సల్ కాన్సెప్ట్

‘సీతా పయనం’ అనేది యూనివర్సల్ కాన్సెప్ట్. ఏ భాషలో చేసినా, తీసినా, చూసినా అందరికీ రిలేటెడ్‌గా ఉంటుంది. ఇదొక ఫీల్ గుడ్ సబ్జెక్ట్. అన్ని భాషల్లో వర్కౌట్ అవుతుందనే నాలుగు భాషల్లో సినిమాని రిలీజ్ చేస్తున్నాము. నాకు సినిమా పరిశ్రమ ఎంతో ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ప్రేమిస్తుంటారు. నన్ను కూడా వారి సొంత మనిషిలా చూసుకుంటారు. అందుకే ఐశ్వర్యని ఇక్కడి నుంచే లాంచ్ చేయాలని ఫిక్సయ్యాను. నా ఫ్యామిలీ మెంబర్‌తో సినిమా చేస్తున్నా.. బడ్జెట్ మీద ఓ పట్టు ఉంటుంది. ఎక్కడ, ఎంత ఖర్చు పెట్టాలనే విషయాన్ని నా చేతుల్లోనే పెట్టుకోగలను. నాకు ఆ కంఫర్ట్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. ముందు ఈ కథను రెడీ చేసుకున్నాక విశ్వక్ సేన్‌ని హీరోగా అనుకున్నాం. అన్నీ మనం అనుకున్నట్టుగా జరగవు కదా. కథలో ఒక్క సీన్ కూడా మార్చలేదు. ఆ స్థానంలోకి నిరంజన్ వచ్చాడు. నాకు విశ్వక్ సేన్‌తో సమస్యలేమీ లేవు. అన్నీ పరిష్కరించుకున్నాం. జీవితం ఒక సర్కిల్ లాంటిది. ఇక్కడ కక్ష్య సాధింపులు వంటివి ఏమీ ఉండవు. అంతా బాగుంటే మేము కలిసి సినిమా చేయవచ్చు కూడా.

Advertisement

Also Read- Vishwambhara: ‘విశంభర’ ఫైనల్ అవుట్‌పుట్‌ చిరుకు నచ్చలేదా? నిర్మాతలు కూడా చేతులెత్తేశారా?

క్లీన్ యు సర్టిఫికెట్

ఇదొక మెచ్యూర్డ్ స్టోరీ. ఇందులో కేవలం ప్రేమ మాత్రమే కాదు, ఎన్నో రకాల ఎమోషన్స్, అంశాలున్నాయి. ఈ సినిమాని చూస్తే అవేంటో ప్రేక్షకులకు అర్థమవుతుంది. ఫ్యామిలీ, దేశాన్ని ప్రేమించడం కూడా ఓ దేశ భక్తి అవుతుందని ఇందులో చెప్పడం జరిగింది. మాస్ ఆడియెన్స్‌కి కావాల్సిన ఫైట్స్ కూడా ఇందులో ఉన్నాయి. అవేవీ కావాలని పెట్టినట్టుగా కాకుండా కథలో లీనమై వెళ్తుంటాయి. అనూప్ రూబెన్స్ పాటలు అద్భుతంగా వచ్చాయి. ఆర్ఆర్ కూడా చాలా బాగా వచ్చింది. సెన్సార్ వాళ్లు ఈ సినిమా చూసి చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అందుకే ఒక్క కట్ లేకుండా క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారు. నటుడిగా నేను అన్ని రకాల యాంగిల్స్‌లో నిరూపించుకోవాలని అనుకున్నాను. నా వద్ద ఆరేడు స్క్రిప్టులు రెడీగా ఉన్నాయి. నటన కంటే దర్శకత్వం వైపే ఎక్కువగా ఆలోచిస్తాను. అందులో ప్రేమ కథ, పాటలు వంటివి ఉండవు. నెక్ట్స్ నా నుంచి ఒక యాక్షన్ ఫిల్మ్ రాబోతోంది. పూర్తిగా యాక్షన్ ఓరియెంటెడ్‌గా, నా ఏజ్‌కు తగ్గ పాత్రలోనే కనిపిస్తాను’’ అని తెలిపారు.

Advertisement

Also Read- Daggubati Family: దగ్గుబాటి ఫ్యామిలీపై డెక్కన్ కిచెన్ కేసు.. తదుపరి విచారణ ఎప్పుడంటే!

‘ఖుషి’ నుంచి ఆయనంటే అందరికీ ఇష్టం

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ‘‘పవన్ కళ్యాణ్‌ను ఐదారు సార్లు మాత్రమే కలిశాను. కానీ ఈ సినిమా పూజా కార్యక్రమాలకు రావాలని అడిగినప్పుడు వెంటనే ఆయన ఒప్పుకున్నారు. ఐదు నిమిషాలు అని వెళ్తే మూడు గంటలు ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాను. ఆయన ఎంతో నిజాయితీ గల వ్యక్తి. ఇలాంటి రాజకీయ నాయకుడు ఉండటం చాలా గొప్ప విషయం. ‘ఖుషి’ నుంచి మా ఇంట్లోని అందరికీ ఆయనంటే ఇష్టం. ‘మీ కోసం మేం ఉన్నాం’ అని చెప్పేందుకు వచ్చాను అని పూజా కార్యక్రమాల్లో ఆయన అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు రాజకీయాలపై అంతగా అవగాహన లేదు. రాజకీయాలు నాకు పడవు. నేను ఇప్పుడు కూడా నటిస్తూ, దర్శకత్వం చేస్తూ హ్యాపీగానే ఉన్నాను. మంచి చేయాలనే ఉద్దేశం నాకెప్పుడూ ఉంటుంది. కానీ, రాజకీయాలు అనేది సపరేట్ దారి’’ అని అర్జున్ చెప్పుకొచ్చారు.

Also Read- Big Tv Kissik Talks : యాంకర్ రవిని తొక్కేయడానికి క్షుద్ర పూజలు..ఎవరా లేడీ యాంకర్?

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×