E-Paper
Advertisement

Daggubati Family: దగ్గుబాటి ఫ్యామిలీపై డెక్కన్ కిచెన్ కేసు.. తదుపరి విచారణ ఎప్పుడంటే!

Daggubati Family: దగ్గుబాటి ఫ్యామిలీపై డెక్కన్ కిచెన్ కేసు.. తదుపరి విచారణ ఎప్పుడంటే!
Advertisement

Daggubati Family: దగ్గుబాటి ఫ్యామిలీని డెక్కన్ కిచెన్ కేసు ఎంతగా వెంటాడుతుందో తెలియంది కాదు. అక్కడ జరుగుతుంది ఒకటైతే, సోషల్ మీడియాలో వైరల్ అయ్యేది మరో అంశం అన్నట్లుగా మారిపోయింది. దీంతో విసిగిపోయిన దగ్గుబాటి ఫ్యామిలీ సీరియస్‌గా రియాక్ట్ అవుతూ ఇటీవల ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. కోర్టు విచారణను కూడా బ్రేకింగ్ న్యూస్‌లో వేస్తున్నారంటూ ఈ ప్రకటనలో దగ్గుబాటి ఫ్యామిలీ బాధను వ్యక్తం చేసింది. సమస్య ఏంటి? అసలు ఆ సమస్య చట్ట పరిధిలో ఉన్నప్పుడు ఎలా పడితే అలా వార్తలు ప్రచారం చేయవచ్చా? అనేది లేకుండా.. కాస్త పేరున్న ఫ్యామిలీ కావడంతో.. ఏ చిన్న విషయం వచ్చినా, దానికి ఇంకో రెండు జోడించి.. భారీ స్థాయిలో దానిని ప్రచారం చేయడంపై దగ్గుబాటి ఫ్యామిలీ (Daggubati Family) సీరియస్ అవుతూ.. ఇకపై ఇలానే చేస్తే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరింది.

Also Read- Markandeya Title Glimpse: అప్పుడు మొదలవుతుంది ఆయన ఆట.. గ్లింప్స్‌కి గూస్‌బంప్స్!

తదుపరి విచారణ ఎప్పుడంటే?

Advertisement

ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు (Nampally Court)లో విచారణ జరుగుతుంది. ఈ కేసులో తాజా అప్డేట్ ఏంటంటే.. తదుపరి విచారణను ఫిబ్రవరి 25కు నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. ఈ కేసు నిమిత్తం వ్యక్తిగత హాజరుకు మినహాయింపును కూడా దగ్గుబాటి ఫ్యామిలీకి కోర్టు ఇచ్చింది. ఇక రీసెంట్‌గా దగ్గుబాటి ఫ్యామిలీ విడుదల చేసిన ప్రకటన విషయానికి వస్తే.. ‘‘డెక్కన్ కిచెన్ కేసు‌లో ప్రతి కోర్టు విచారణను బ్రేకింగ్ న్యూస్ పేరిట ఆధార రహిత కథనాలతో మీడియా తప్పుగా ప్రచారం చేయడం బాధాకరం. నాంపల్లి కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న విషయం నిజమే. అయితే దగ్గుబాటి కుటుంబానికి వ్యతిరేకంగా కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నాన్ బెయిలబుల్ వారెంట్ విషయంలో కూడా కోర్టు ఎలాంటి హెచ్చరిక చేయలేదు. మా తరపున అడ్వకేట్ హాజరవుతున్నందున వ్యక్తిగత హాజరు నుంచి కోర్టు ఇప్పటికే మాకు మినహాయింపును ఇచ్చింది.

Also Read- The Paradise film: నాని ది ప్యారడైజ్ రిలీజ్ వెనుక పెద్ద స్కెచ్ ఉందే.. పక్కాగా ప్లాన్ చేసిన డైరెక్టర్!

న్యాయ పరమైన చర్యలు తీసుకుంటాం

Advertisement

నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని మా అపోజిషన్ పార్టీ వాళ్ళు కోర్టును ప్రాదేయపడినా అవసరం లేదని కోర్టు తిరస్కరించింది. దీనికి బదులు ప్రతి విచారణలో పూర్తి నిరాధార, అవాస్తవ వార్తలను మీడియా ప్రచారం చేస్తుంది. ఇలాంటి వార్తలు ప్రచారం చేసే ముందు అధికారిక కోర్టు రికార్డులతో రూడీ చేసుకోవాలని మీడియా సంస్థలను కోరుతున్నాము. ఇప్పటికే ప్రసారం చేసిన, ప్రచురించిన తప్పుడు, పరువు నష్టం కలిగించే కథనాలను వెంటనే తొలగించాల్సిందిగా అన్ని న్యూస్ ఛానళ్లను, సోషల్ మీడియాను, న్యూస్ పోర్టల్స్‌ను కోరుతున్నాము. అలా చేయలేదంటే మేము తగిన న్యాయ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిసున్నాము’’ అని దగ్గబాటి ఫ్యామిలీ ఈ ప్రకటనలో పేర్కొంది.

Also Read- Star Heroine: ఎనిమిదేళ్ల నుంచి వాట్సాప్‌ వాడడం మానేసిన హీరోయిన్.. ఎందుకో తెలిస్తే షాక్..!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×