E-Paper
Advertisement

Actor Brahmaji: పొగిడితే కూడా సమస్యేనా.. మాజీ మంత్రి డ్యాన్స్ పై నటుడు బ్రహ్మాజీ కౌంటర్!

Actor Brahmaji: పొగిడితే కూడా సమస్యేనా.. మాజీ మంత్రి డ్యాన్స్ పై నటుడు బ్రహ్మాజీ కౌంటర్!
Advertisement

Brahmaji Counter to Ambati Rambabu:నటుడు బ్రహ్మాజీ మంచి నటుడు కాదు.. మంచి కమెడియన్ కూడా. వెండితెరపైనే కాదు రియల్ లైఫ్ లో ఆయన సెన్సాఫ్ హ్యమర్ ఎక్కువే. ఎన్నో ఈవెంట్స్, సినిమాల్లో ఆయన తనదైన కమెడీ పంచ్ లు, సెటైరికల్ కామెంట్స్ తో నవ్విస్తుంటారు. ముఖ్యంగా యాంకర్ సుమతో చేసే కామెడీ నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. అయితే బ్రహ్మాజీ తనలోనే సెన్సాఫ్ హ్యుమర్ మరోసారి బయటకు తీశాడు. అయితే ఈసారి ఏ నటుడిపైనో, యాంకర్ పైనో కాదు ఏకంగా ప్రముఖ రాజకీయ నాయకుడిపై వదిలారు.

పవన్ కళ్యాణ్ పై విమర్శలు..

Advertisement

మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఓ ట్వీట్ చేశారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు గురించి వ్యాఖ్యానిస్తూ పవన్ కళ్యాణ్ పై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘విశాఖపట్నంలో ఆర్భాటంగా జరిగిన CII సమ్మిట్ లో మన చిన్న కమ్మ కళ్యాణ్ గారు కనిపించలేదేంటబ్బా!’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయితే ఆయన పోస్ట్ కూటమి పార్టీ నేతలు, టీడీపీ, జనసేన నేతలు భగ్గమంటున్నారు. పవన్ కళ్యాణ్ అనేంత మీకు లేదని, కూటమీ ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడుటు తీసుకురావడం.. వైసీపీ కి మింగుడపడటక ఇలా విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సార్ మీ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం..

పవన్ కళ్యాణ్ సదస్సుకు ఎందుకు రాలేదని అడుగుతున్న మీరు.. వైఎస్ జగన్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో కూడా చెప్పాలి’ అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంబటి ట్వీట్ పై పలువు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. బ్రహ్మాజీ మాత్రం తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చాడు. ఆయన ట్వీట్ కి అసలు సంబంధం లేకుండ కామెంట్ చేసి సెటైర్లు విసిరాడు. ‘సర్ మీ డ్యాన్సింగ్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం. మరోసారి మీ డ్యాన్స్ చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాఅంటూ కామెంట్ చేశాడు. అయితే దీనిపై వైసీపీ నేతల నుంచి బ్రహ్మాజీకి వైసీపీ నేతల నుంచి విమర్శలు వస్తుంటే.. ఫ్యాన్స్ మాత్రం బ్రహ్మాన్న నీ కామెడీకి అడ్డు అదుపు లేదన్న అంటూ కామెంట్ చేస్తున్నారు. తన ట్వీట్ కి వరుసగా విమర్శలు, నెగిటివ్ రిప్లై వస్తుండటంతో బ్రహ్మాజీ మరో ట్వీట్ చేశాడు. 

Advertisement

ఈ రోజుల్లో పొగడడం కూడా తప్పే

‘ఈ రోజుల్లో కొందరిలో టాలెంట్ ని అభినందించడం కూడా సమస్య గా మారుతుంది’ అంటూ సింగిల్ ట్వీట్ వదిలాడు. దీనిపై నెటిజన్స్ నుంచి రకరకాల స్పందనలు వస్తున్నాయి. ‘ఏ టాలెంట్ గురించి మాట్లాడుతున్నావ్ అన్న.. మన తెలుగు రాష్ట్రాల్లో టాలెంట్ కి చాలా అర్థాలు ఉన్నాయి.. అందులో ఏది’ అంటూ ఫన్నీగా రిప్లై ఇస్తున్నారు. కాగా బ్రహ్మాజీ రాజకీయాలపై స్పందించడం మొదటిసారి కాదు. గతంలో ఎన్నో సంఘటనలలో వైసీపీ నేథపై సెటైరికల్ గా కామెంట్స్ చేశాడు. ఏకంగా మాజీ సీఏం జగన్ కే గతంలో కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశాడు. అప్పట్లో ఇది సినీ,రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తాజాగా అంబటి రాంబాబు కు కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేయడంలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×