JD Chakravarthy:ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ (Vishnu Priya) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) యాంకర్ గా చేసిన ‘పోవే పోరా’ అనే కార్యక్రమంతో యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి.. ఆ తర్వాత తన అల్లరితో అందరినీ ఆకట్టుకుంది.. ఇకపోతే సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్న విష్ణు ప్రియ.. బిగ్ బాస్ లో కూడా సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ వలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె తాజాగా సబ్‌స్క్రిప్షన్ పేరిట ఇన్‌స్టాగ్రామ్ లో అందాలు ఆరబోస్తోంది. తన గ్లామర్ చూడాలి అంటే డబ్బులు కట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే అనే రేంజ్ లో షరతులు విధించింది. ఇప్పటికే భారీ సంఖ్యలో సబ్స్క్రైబర్లను పొందిన ఈమె నెలకు రూ.12 లక్షలకు పైగా ఆదాయాన్ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ విషయంలో కొంతమంది ఈమెపై కేసులు కూడా ఫైల్ చేయించిన విషయం తెలిసింది. దీనిపై ఆమె స్పందించింది కూడా… ఇది దేవుడు ఇచ్చిన శరీరం ఎక్స్పోజ్ చేయడంలో తప్పేముంది అనే రేంజ్ లో కామెంట్ చేసింది.
ఇలాంటి సమయంలో తాజాగా గాయపడ్డ సింహం సినిమాలో బ్రూటల్ ధర్మ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారు జె.డి చక్రవర్తి. ఈ మేరకు తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు పంచుకున్న ఆయన.. అందులో భాగంగానే విష్ణుప్రియా సబ్స్క్రిప్షన్ పై కూడా స్పందించారు. ఇంటర్వ్యూలో భాగంగా.. ఇంస్టాగ్రామ్ వేదికగా సబ్స్క్రిప్షన్ తీసుకోవడం గురించి విష్ణు ప్రియతో మాట్లాడొచ్చు కదా.. ఎందుకు ఇలాంటి పనులు.. అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు.. మీరేదైనా ఆమెకు సలహా ఇవ్వచ్చు కదా అని యాంకర్ అడిగారు..
దీనికి జేడీ మాట్లాడుతూ..” నేను ఆమె వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోను.. ఆమె నాకు మంచి స్నేహితురాలు, శిష్యురాలు. ఆమె ఫిలాసఫీ గురించి మాట్లాడడానికి మాత్రమే నాకు ఫోన్ చేస్తుంది. నేను కూడా ఓన్లీ ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పి ఫోన్ పెట్టేస్తాను గానీ ఆమె పర్సనల్ లైఫ్ గురించి ఇలాంటి విషయాల గురించి ఆమెతో నేను ఎప్పుడు మాట్లాడలేదు.. ఇక మేమిద్దరం కలిసి ఇప్పటికి మూడు సంవత్సరాలు అయింది. నేను ఆమెను మూడేళ్ల క్రితం చూసాను.. నేను అలాంటి విషయాల్లో జోక్యం చేసుకోను . ఆమె కాదు నేను ఎవరితోనూ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడను” అని చెప్పాడు. ప్రస్తుతం జేడీ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:నాపై విష ప్రయోగం.. అసలు విషయం చెప్పిన జే.డీ.చక్రవర్తి!
ఇదే ఇంటర్వ్యూలో భాగంగా విష్ణుప్రియతో రిలేషన్ గురించి మాట్లాడుతూ.. “జేడీ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తలు నేను కూడా విన్నాను. అది పూర్తిగా అవాస్తవం. ఇక విష్ణుప్రియ నా ప్రియ శిష్యురాలు.. నేను ఫోన్ చేస్తే గురువుగారు అంటూ మాట్లాడుతుంది. అలాంటి అమ్మాయితో నాకు ఎఫైర్ అని అంటే.. అంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. ఇక నేను ఆమెను పెళ్లి చేసుకోవడం అనేది రూమర్ మాత్రమే. నన్ను తన గురువులా భావిస్తోంది. గురు శిష్యుల సంబంధం పెళ్లికి దారితీస్తే ఆ పరిణామాలు వేరేలా ఉంటాయి” అంటూ తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు జేడీ.