E-Paper
Advertisement

PM Modi Mann Ki Baat: ప్రధాని మన్‌కీ బాత్‌లో కీలక అంశాలు.. పవర్ సెక్టార్, అణుశక్తి గురించి ప్రస్తావన

PM Modi Mann Ki Baat: ప్రధాని మన్‌కీ బాత్‌లో కీలక అంశాలు.. పవర్ సెక్టార్, అణుశక్తి గురించి ప్రస్తావన
Advertisement

PM Modi Mann Ki Baat: ప్రధాని నరేంద్రమోడీ మన్ కీ బాత్‌ కార్యక్రమంలో పవర్ సెక్టార్ గురించి ప్రధానంగా ప్రస్తావించారు. న్యూక్లియర్ ప్రోగ్రామ్‌, ఎనర్జీ, ఆరోగ్య రంగాల గురించి ప్రధానంగా ప్రస్తావించారు. పవన్ శక్తి ఉత్పత్తిలో ప్రపంచంలో మనం నాలుగో స్థానంలో ఉన్నారు ప్రస్తావించారు. ఇంకా ఏయే విషయాల గురించి చెప్పారంటే..

ప్రధాని నరేంద్రమోదీ మన్‌కీ బాత్‌లో కీలక అంశాలు

Advertisement

కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం సాధించిన, సాధిస్తున్న ప్రగతి గురించి కీలక అంశాలు బయటపెడతారు. అందుకోసం ‘మన్ కీ బాత్’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈసారి 133వ ఎపిసోడ్‌లో ప్రతీ నెలకు ఒకసారి వివిధ అంశాలపై ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఈసారి పవర్ సెక్టార్ గురించి కీలక విషయాలు బయటపెట్టారు.

తన మనసులో ఆలోచనలను దేశ ప్రజలతో పంచుకున్నారు. పవన విద్యుత్ రంగంలో దేశం అసాధారణ పురోగతి సాధించిందని ప్రశంసించారు. పవన శక్తి ఉత్పత్తిలో భారత్‌ మరో మైలురాయి అధిగమించిందన్నారు. దేశం ముందుకు వెళ్లాలంటే సౌర-పవన విభాగాలు చాలా కీలకమన్నారు.

Advertisement

పవర్-అణుశక్తి రంగాల గురించి ప్రధానంగా ప్రస్తావన

దేశ వ్యాప్తంగా 56 గిగావాట్లకుపైగా విండ్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్నామని, గతేడాదితో పోలిస్తే ఇది 6 గిగావాట్లు అదనంగా ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. ఈ ఘనత అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించిందని వెల్లడించారు. విండ్ ఎనర్జీ ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉందన్నారు.

గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్ తోపాటు అనేక రాష్ట్రాల్లో విండ్, సోలార్ ఎనర్జీ అభివృద్ధి జరుగుతోందన్నారు. భారత్‌కి అత్యవసరమని, క్లీన్ ఎనర్జీ దిశగా అడుగులు పడాలన్నారు. విశాలమైన, బీడు భూములుగా ఉన్న ప్రాంతాలు భారీ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కేంద్రాలుగా మారుతున్నాయని అన్నారు.

ALSO READ: ఆఫీస్ టైమ్ కంటే ఎక్కువ సేపు పని చేయమంటున్నారా?.. కొత్త లేబర్ కోడ్ ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సుస్థిర అభివృద్ధికి ఒక నమూనాగా మారిందన్నారు. అటు అణుశక్తి పరిశోధనల్లో మరో ముందడుగు వేసిందన్నారు. తమిళనాడులోని కల్పకంలో ఉన్న 500 మెగావాట్ల ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఓ మూలస్తంభంగా అభివర్ణించారు. దీని విషయంలో అణు శాస్త్రవేత్తల విజయం దేశానికి గొప్ప పేరు తీసుకువచ్చిందన్నారు.

అణు రియాక్టర్‌ను పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించడం మరో విశేషమన్నారు. పౌర అణు కార్యక్రమాన్ని శాస్త్రవేత్తలు ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. దీనివల్ల అయ్యే ఇంధన ఖర్చు కంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చెయ్యవచ్చనని తెలిపారు. ఆ తరహా టెక్నాలజీ ప్రపంచంలో చాలా తక్కువ దేశాల్లో ఉందని, దాని ద్వారా కావాల్సిన ఇంధనాన్ని తానే ఉత్పత్తి చేసుకోగలదన్నారు.

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×