Actor Kannan Pattambi Death: ఇండస్ట్రీలో ఇటీవల వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. 2025వ సంవత్సరంలో ఇండస్ట్రీ ఎంతోమంది ప్రముఖ సెలబ్రిటీలను కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా ఇలా ఇండస్ట్రీకి సంబంధించిన వారు మరణించడంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇటీవల మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తల్లికి మాతృవియోగం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం మర్చిపోకముందే మరొక మలయాళ నటుడు కన్నుమూశారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కన్నన్ పట్టాంబి (62)(Kannan Pattambi) నేడు కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఈయన నేడు తన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. కన్నన్ కేరళలోని కోజికోడ్ లో తుది శ్వాస విడిచారు. ఇలా కన్నన్ మరణ వార్తను ఆయన సోదరుడు ప్రముఖ దర్శకుడు మేజర్ రవి అధికారికంగా వెల్లడించడంతో ఈయన మరణ వార్తపై అభిమానులు, ఇతర సెలబ్రిటీలు స్పందిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. ఇక కన్నన్ చివరి చూపు కోసం పెద్ద ఎత్తున సెలెబ్రిటీలు తరలి వెళ్తున్నారు. అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈయన మరణ వార్త పై స్పందిస్తూ కామెంట్ల రూపంలో నివాళులర్పిస్తున్నారు.
కన్నన్ గత కొద్దిరోజులుగా కిడ్నీ సమస్య కారణంగా ఇబ్బంది పడుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఈయన కోజికోడ్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని ఆయన సోదరుడు అధికారకంగా వెల్లడించారు. ఇక కన్నన్ అంత్యక్రియలను నేడు సాయంత్రం 4 గంటలకు పట్టంబిలోని న్జనగంతిరిలోని ఆయన నివాసంలో అంత్యక్రియలు జరుగుతాయని రవి తెలియజేశారు. గత కొన్ని దశాబ్దాలుగా మలయాళం చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలను అందించిన కన్నన్ మరణ వార్త చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ప్రొడక్షన్ కంట్రోలర్..
కన్నన్ చిత్ర పరిశ్రమలో ప్రొడక్షన్ కంట్రోలర్ గా విస్తృతంగా సేవలను అందించారు. మోహన్లాల్ నటించిన సినిమాలకు పెద్ద ఎత్తున పనిచేశారు . మోహన్లాల్ సినీ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచిన పులిమురుగన్ (మన్యంపులి) ఓడియన్, కాందహార్, కురుక్షేత్ర వంటి సినిమాలలో కీలక పాత్రలు పోషించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక తన సోదరుడు మేజర్ రవి దర్శకత్వంలో వచ్చిన మిషన్ 90 డేస్ సినిమాలో కూడా నటించి ఈయన ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలను అందించిన కన్నన్ మరణ వార్త ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పాలి.