E-Paper
Advertisement

విజయ్ కు నాని అభినందనలు..పవన్ పేరు తీయకుండా పోస్ట్ వేసిన నాని..

విజయ్ కు నాని అభినందనలు..పవన్ పేరు తీయకుండా పోస్ట్ వేసిన నాని..
Advertisement

Actor Nani: నాచురల్ స్టార్ నాని తాజాగా నటుడు విజయ్ ఎన్నికలలో విజయం సాధించినందుకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హీరో విజయ్(Vijay) తమిళ చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి విజయాలను సొంతం చేసుకొని అనంతరం రాజకీయాలలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈయన రాజకీయాలలోకి వస్తూ టీవీకే పార్టీ(TVK Party)ని స్థాపించారు. ఇలా పార్టీ పెట్టిన రెండు సంవత్సరాలకి ఈయన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విధంగా విజయ్ సింగిల్ గా పోటీ చేసి భారీ మెజారిటీని సొంతం చేసుకోవడంతో ఈయనకు రాజకీయ నాయకుల నుంచి మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల నుంచి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

అవమానించి పట్టాభిషేకం చేశారు..

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హీరో విజయ్ కు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తూ సెలబ్రిటీలు పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేచురల్ స్టార్ నాని(Nani) తన అధికారిక ఎక్స్ కాదా ద్వారా స్పందిస్తూ..”విజయ్ సర్ అభినందనలు.. మొదట అవమానించారు కానీ ఇప్పుడు పట్టం కట్టారు. ఇది మొదట మా ఇంట్లో (ఆంధ్రప్రదేశ్ ) జరిగింది. ఇప్పుడు మా పొరుగు ఇంట్లో (తమిళనాడులో) జరుగుతుంది. ఒక అండర్ డాగ్ గెలవడం అనేది ఎప్పుడు అబ్సల్యూట్ సినిమాలా ఉంటుంది లేదా అబ్సల్యూట్ పాలిటిక్స్ అని చెప్పాలి ఏమో అంటూ తనదైన శైలిలో నాని పోస్ట్ చేశారు.

అవమానాలు పడ్డ పవన్ కళ్యాణ్..

Advertisement

ప్రస్తుతం నాని చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నాని ఈ పోస్ట్ వెనుక చాలా అర్థం దాగి ఉందని చెప్పాలి. ఎక్కడ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పేరును ప్రస్తావించకుండా మా ఆంధ్రప్రదేశ్లో కూడా మొదట్లో పవన్ కళ్యాణ్ గారిని ఇలాగే అవమానించారు కానీ తర్వాత డిప్యూటీ సీఎం చేశారు ఇప్పుడు తమిళనాడులో కూడా అదే జరిగిందని ఉద్దేశంతో నాని చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఈ పోస్ట్ పై విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఇక నాని చేసిన ఈ ట్వీట్ ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు అటు విజయ్ అభిమానులు కూడా తెగ వైరల్ చేస్తున్నారు. విజయ్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న రామ్ పోతినేని, సాయి ధరమ్ తేజ్, రవితేజ, నాని వంటి ఎంతోమంది సెలబ్రిటీలు ఈయన విజయం పై స్పందిస్తూ అభినందనలను తెలియజేస్తున్నారు. ఊహించని విధంగా తమిళనాడులో విజయ్ విజయం సాధించడంతో సినీ రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరి కొద్ది సేపట్లో విజయ్ సీఎం అనే విషయాన్ని అధికారకంగా ప్రకటించబోతున్నారు.

Also Read: ఎన్నికల్లో సత్తా చాటిన విజయ్.. జననాయగన్ పై పెరిగిన అంచనాలు..

Related News

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

Big Stories

Advertisement
×