E-Paper
Advertisement

ఎన్నికల్లో సత్తా చాటిన విజయ్.. జననాయగన్ పై పెరిగిన అంచనాలు..

ఎన్నికల్లో సత్తా చాటిన విజయ్.. జననాయగన్ పై పెరిగిన అంచనాలు..
Advertisement

Jananayagan: నేడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఎవరు విజయం సాధిస్తారనే ఆతృత ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఎన్నికలలో ప్రముఖ సినీ నటుడు విజయ్(Vijay) టీవీకే పార్టీ(TVK Party) తరఫున పోటీ చేయటం విశేషం. ఇలా పార్టీ పెట్టిన రెండు సంవత్సరాలకు ఈయన ఎన్నికలలో పోటీ చేయటంతో ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది అయితే నేడు విడుదలైన ఫలితాలలో ఊహించని విధంగా అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించారు. ఈ విధంగా ఎన్నికల ఫలితాలలో విజయ్ భారీ మెజారిటీని సొంతం చేసుకోవడంతో ముఖ్య మంత్రిగా బాధ్యతలను అందుకోబోతున్నారు.

జననాయగన్ పై పెరిగిన అంచనాలు..

ఈ విధంగా విజయ్ ఎన్నికలలో విజయం సాధించిన నేపథ్యంలో ఈయన ఇకపై సినిమాలలో నటించరని స్పష్టమవుతుంది. అయితే విజయ్ నటించిన చివరి సినిమా ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదనే సంగతి అందరికీ తెలిసిందే. విజయ్ చివరిగా హెచ్ వినోద్ దర్శకత్వంలో జననాయగన్ (Jananayagan) అనే సినిమాలో నటించారు అయితే ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమా చుట్టూ రాజకీయ కుట్రలు జరగడంతో విడుదల వాయిదా పడింది. ఇప్పటికీ ఈ సినిమా విడుదలకు లైన్ క్లియర్ కానీ నేపథ్యంలో అభిమానులు ఎంతో నిరుత్సాహపడ్డారు.

డీల్ రద్దు చేసుకున్న అమెజాన్ ప్రైమ్..

Advertisement

ఇక ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతున్న నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ 120 కోట్ల రూపాయల డీల్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక నేడు తమిళనాడులో ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యి విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్న నేపథ్యంలో జననాయగన్ సినిమాపై కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో విడుదల అయితే కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా విజయ్ చివరి సినిమా కావడంతో భారీగా కలెక్షన్లను కూడా రాబడుతుందని అభిమానులు భావిస్తున్నారు.

టైటిల్ కార్డ్స్ లో సీఎం విజయ్..

Advertisement

నిజానికి ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి ఉంటే పెద్దగా బజ్ ఉండేది కాదేమో కానీ ఇప్పుడు మాత్రం సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి అదే విధంగా ఈ సినిమా టైటిల్ కార్డ్స్ లో హీరో విజయ్ పేరు థళపతి కాకుండా సీఎం విజయ్ అంటూ టైటిల్ కార్డ్స్ లో ఉండబోతుందని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా విడుదల విషయంలో ఎన్నో అడ్డంకులు ఎదురైనప్పటికీ చివరికి చాలా మంచి జరుగుతుందని అభిమానులు సంతోషపడుతున్నారు. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఏకంగా 120 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు కానీ ఈ సినిమా ఆలస్యం కావడంతో డీల్ రద్దు చేసుకున్నారు. దీంతో జీ 5 50 కోట్ల రూపాయలకు ఈ సినిమా డిజిటల్ హక్కులను కైవసం చేసుకున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ సినిమా ఆలస్యమైనప్పటికీ ఇప్పుడు మాత్రం విడుదల అయితే భారీ కలెక్షన్లను రాబడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: త్రిష బర్త్ డే స్పెషల్… విశ్వంభర నుంచి ఫస్ట్ లుక్ రివీల్..భలే సింక్ చేశారే?

Related News

గణనాథుడి ఆశీస్సులు అందరికి ఉండాలి.. పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్వీట్..

రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్న ‘ఉపేంద్ర’ మూవీ!

ఈ స్పీడ్ ఏంటి రవితేజా.. ఇరుముడి తర్వాత జోరు పెంచాడుగా !

67 ఏళ్లకే ప్రెగ్నెన్సీ అంటూ ట్రోలింగ్.. నీనా గుప్తా దిమ్మతిరిగే కౌంటర్!

నా భార్య నన్ను నమ్మింది… సైమా అవార్డుతో మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

సెప్టెంబర్ 18న వచ్చేస్తున్న’పిఠాపురంలో అలా మొదలైంది’!

బేబీబంప్ తో రష్మిక మందన్న…రణబాలి నుంచి స్పెషల్ వీడియో!

తారక్ నెక్ట్స్ సినిమాలు ఇవేనా.. ఒక్కొక్కటి మామూలు కాంబో కాదుగా !

Big Stories

Advertisement
×