E-Paper
Advertisement

Prabhas: అరుదైన గౌరవం అందుకున్న ప్రభాస్.. తొలి భారతీయ హీరోగా రికార్డ్!

Prabhas: అరుదైన గౌరవం అందుకున్న ప్రభాస్.. తొలి భారతీయ హీరోగా రికార్డ్!

Prabhas:రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా చలామణి అవుతూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈయన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచినా.. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల ప్రముఖ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన చిత్రం ‘ది రాజా సాబ్’. ప్రభాస్ కెరియర్ లోనే తొలిసారి హారర్ కామెడీ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ అభిమానుల ఆకలి మాత్రం తీర్చలేకపోయింది. ఇందులో ఉండగా ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy vanga) దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం అందరి ఆశలు ఈ సినిమాపైనే.. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి రికార్డు అందుకుంటారో చూడాలి.

అరుదైన ఘనత సాధించిన ప్రభాస్..

ఇదిలా ఉండగా రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఒక అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.. ఇప్పటివరకు ఇండియా తరఫున ఏ హీరోకి సాధ్యం కానీ ఒక అరుదైన ఘనతను ఆయన అందుకున్నారు. విషయంలోకి వెళ్తే.. జపాన్ లోని ఒక ప్రముఖ మ్యాగజైన్ బ్యాక్ కవర్ పేజ్ పై కనిపించిన నటుడిగా చరిత్ర సృష్టించారు ప్రభాస్. అసలు విషయంలోకి వెళ్తే.. జపాన్ లో అత్యంత ప్రాచుర్యం పొందిన మహిళ మ్యాగజైన్ గా పేరు ఉన్న ‘ANAN’ బ్యాక్ కవర్ పై సోలో గా ఫీచర్ అయిన తొలి భారతీయ నటుడుగా సరికొత్త చరిత్ర లిఖించారు ప్రభాస్.

మొట్టమొదటి ఇండియన్ హీరోగా గుర్తింపు..

అయితే ప్రభాస్ కి జపాన్ లో ఇంత క్రేజ్ రావడానికి కారణం రాజమౌళి బాహుబలి అనే చెప్పాలి. ఈ సిరీస్ తో అపారమైన క్రేజ్ ను సంపాదించిన ప్రభాస్ కి అక్కడ ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉన్నారు. ఆ కారణంగానే ఈ మ్యాగజైన్ ఎడిటోరియల్ టీం ఆయనను ప్రత్యేకంగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక భారతీయ సినీ నటుడికి ఈ స్థాయి గుర్తింపు రావడంపై పలువురు సినీ విశ్లేషకులు ఇది అరుదైన ఘట్టం అంటూ చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులను కలిగి ఉన్న ప్రభాస్ కి ఇప్పుడు ఈ మ్యాగజైన్ కవర్ తో ఆయన స్టార్ స్టేటస్ గ్లోబల్ స్థాయికి పెరిగిపోయింది అని కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ ఫోటోషూట్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది చూసిన ఆయన అభిమానులు “ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్” అంటూ సంబరాలు చేస్తున్నారు.

ALSO READ:Vijay Thalapathy: విజయ్ మెడకు బిగుసుకుంటున్న ఉచ్చు.. రూ.1.5 కోట్ల జరిమానా?

ప్రభాస్ తదుపరి చిత్రాలు..

ఒక ప్రభాస్ తదుపరి చిత్రాల విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రభాస్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తరువాత సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి సీక్వెల్ తో పాటు సలార్ సీక్వెల్ లో కూడా నటించనున్నారు ప్రభాస్. ఇక తన సినిమాలతో గ్లోబల్ మార్కెట్లో సత్తా చాటిన ఈయన.. ఇప్పుడు ఈ అరుదైన ఘనతతో మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు.

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×