E-Paper
Advertisement

GunaSekhar: క్షమాపణలు చెప్పిన ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్.. ఏమైందంటే?

GunaSekhar: క్షమాపణలు చెప్పిన ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్.. ఏమైందంటే?
Advertisement

GunaSekhar:చూడాలని ఉంది, అర్జున్ , ఒక్కడు, మృగరాజు, వరుడు, నిప్పు, రుద్రమదేవి, శాకుంతలం ఇలా కంటెంట్ బేస్డ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ (Guna Sekhar).అలాంటి ఈయన తాజాగా సామాజిక అంశాల మేళవింపుతో యుఫోరియా అనే సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాదులో ఈ చిత్ర విడుదలను పురస్కరించుకొని ఒక ముందస్తు వేడుకను నిర్వహించగా.. అందులో అందరికీ క్షమాపణలు చెప్పడం వైరల్ గా మారింది. ఇంత సీనియర్ డైరెక్టర్ అందరికీ క్షమాపణలు చెప్పడం ఏంటి అని అందరూ నోరెళ్ళబెట్టారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

సమాజానికి అద్దం పట్టేలా యుఫోరియా..

ఒకప్పుడు చారిత్రాత్మక, సామాజిక , యాక్షన్ జానర్లలో సినిమాలు చేస్తూ.. తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న గుణశేఖర్ చాలా రోజుల తర్వాత సరికొత్త కాన్సెప్ట్ యుఫోరియా(Euphoria ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యువతరం మాదకద్రవ్యాలకు అలవాటు పడితే ఎలాంటి నష్టాలు చూడాల్సి వస్తుంది అనే విషయాన్ని నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడం జరిగింది. భూమిక, సారా అర్జున్ , విగ్నేష్ గవిరెడ్డి, గౌతమ్ మేనన్, రోహిత్, ఆదర్శ బాలకృష్ణ , నాజర్, రవి ప్రకాష్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తూ వచ్చిన ఈ చిత్రానికి నీలిమ గుణ, యుక్తముఖి, రాగిణి గుణ.. గుణ టీం వర్క్స్ బ్యానర్ పై నిర్మించారు. కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సారా ఆత్మ అయితే భూమిక వెన్నెముక..

Advertisement

ఇక ఈ సినిమా ముందస్తు వేడుకను నిర్వహించగా.. అందులో గుణశేఖర్ మాట్లాడుతూ..” 1992లో లాఠీ అనే సినిమాతో నేను చిత్ర పరిశ్రమ లోకి అడుగు పెట్టాను ఇన్నేళ్ల నా కెరియర్లో యుఫోరియా 14వ సినిమా కావడం విశేషం. ఇప్పుడు కూడా నేను తొలి సినిమా చేస్తున్న అనుభూతిలోనే ఉన్నాను. ఒక మంచి కథను మరింత కొత్తగా చెప్పే ప్రయత్నం ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇప్పటికే సినిమా చూసిన వాళ్లంతా ఇలాంటి కథను కొత్త వాళ్లతో ఇంత భారీ బడ్జెట్ తో తీయడం అంతా సులభం కాదు. ప్రస్తుత పరిస్థితులను అద్దం పట్టేలా ఈ సినిమా ఉంది అన్నారు. ఈ కథకు సారా అర్జున్ ఒక ఆత్మ.. ఈమె ఒప్పుకుంటేనే సినిమా చేయాలనుకున్నాను. ఇక భూమిక వెన్నెముక.. ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ పాత్రలో ఒదిగిపోయారు.

ALSO READ:Prabhas: అరుదైన గౌరవం అందుకున్న ప్రభాస్.. తొలి భారతీయ హీరోగా రికార్డ్!

ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన గుణశేఖర్..

Advertisement

ముందుగా ప్రతి ఒక్కరు నన్ను క్షమించాలి.. ఎందుకంటే నేను ఈ చిత్రానికి తెలుగు పేరు పెట్టలేదు. ఇక ప్రవీణ్ విజువల్స్ కాలభైరవ సంగీతంతో పాటు ఇతర సాంకేతిక బృందమంతా అత్యుత్తమ పనితీరును కనబరిచింది” అంటూ గుణశేఖర్ చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ఈ యుఫోరియా చిత్రానికి తెలుగు టైటిల్ పెట్టకపోవడంతో ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు గుణశేఖర్. ఇక ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. మరి ఏ సినిమా రిజల్ట్ తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×