Allu Arjun : ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల గురించి సోషల్ మీడియాలో గాసిప్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.. అందులో నిజం ఉందా లేదా అన్నది పక్కన పెడితే స్టార్ హీరోల గురించి ఎన్నో రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇక ముఖ్యంగా ఒక పాడ్‌కాస్ట్ వేదికగా హీరో అల్లు అర్జున్ పర్సనల్ లైఫ్, సెట్స్ లో మెయింటైన్ చేసే ప్రోటోకాల్స్ మీద వచ్చిన కొన్ని ఆరోపణలు నెట్టింట పెద్ద దుమారమే రేపుతున్నాయి. అల్లు అర్జున్ ఒకసారి కలవాలంటే 42 రకాల రూల్స్ ఉంటాయని, కనీసం కళ్లలోకి కూడా చూడకూడదని నార్త్ మీడియా సేల్స్ ప్రొఫెషనల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.. ఈ వార్తలు ఫ్యాన్స్ ను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. తాజాగా బన్నీ పై వస్తున్న రూమర్స్ పై పుష్ప నటుడు స్పందించారు.. అల్లు అర్జున్ మనస్తత్వం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.. ఆయన చెప్పిన నిజాలు ఏవో ఒకసారి చూసేద్దాం..
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ని కలవడానికి 42 రూల్స్ ఫాలో అవ్వాలని బాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తలపై తాజాగా పుష్ప నటుడు రాజశేఖర్ స్పందించారు.. పాన్ ఇండియా స్టార్ గురించి ఏ ఆధారం లేకుండా ఇలాంటి బేస్‌లెస్ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. పుష్ప 1, పుష్ప 2 సినిమాల కోసం గత నాలుగేళ్లుగా బన్నీతో చాలా క్లోజ్ గా వర్క్ చేసిన అనుభవం తనకు ఉందని, మనిషి ఎలా ఉంటారో అన్నది ఆయన గురించి తనకు బాగా తెలుసని రాజశేఖర్ క్లారిటీ ఇచ్చారు.. ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్న వారిపై ఇలాంటి రూమర్స్ రావడం కామనే… అందుకే వాటిని జనాలు ఎక్కువగా పట్టించుకోరు అని ఆయన అన్నారు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బన్నీ అభిమానులు ఆ వీడియో పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read : ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్న టాలీవుడ్ హీరోలు..రవితేజ ప్లాన్ మాములుగా లేదు..
బన్నీ లాంటి మంచి వ్యక్తితో పనిచేయాలని ఇండస్ట్రీలోని నటీనటులు ఎంతోమంది అనుకుంటారు. ఆయన సెట్స్ లో అందరితో సమానంగా కలిసి పోతాడు. అంత పెద్ద స్టార్ హీరో అయ్యి ఉండి కూడా సెట్స్ లో ఉండే ప్రొడక్షన్స్ స్నాక్స్ నే తింటూ అందరితో సమానంగా ఉంటాడు అని రాజశేఖర్ అన్నారు.. బన్నీపై వచ్చిన ఆరోపణలు కేవలం పబ్లిసిటీ కోసమే చేసినట్లు కనిపిస్తున్నాయని రాజశేఖర్ అభిప్రాయపడ్డారు.. తమ గొప్ప కోసం మాత్రమే ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ మీద ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. బన్నీ ఎదుగుదలను చూసి ఎవరో ఓర్వలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన తేల్చి చెప్పేశారు.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవడంతో సోషల్ మీడియాలో బన్నీ పై వస్తున్న ఆరోపణలకు చెక్ పడింది.. అల్లు అర్జున్తో నటించిన ఒక నటుడు ఇలా క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు ఈ రూమర్స్ కి తెరపడినట్లు తెలుస్తుంది.. మరి దీనిపై బన్నీ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..