E-Paper
Advertisement

Hero Arjun: రియల్ హీరోలకు అర్జున్ ఘనంగా సన్మానం.. క్యాష్ కూడా!

Hero Arjun: రియల్ హీరోలకు అర్జున్ ఘనంగా సన్మానం.. క్యాష్ కూడా!
Advertisement

Hero Arjun: సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ హీరోలుగా ఎంతోమంది గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే సినిమాలలో హీరోగా అనిపించుకున్న వారి గురించి కాస్త పక్కన పెడితే నిజజీవితంలో ఎవరికి సాధ్యం కాని పనులు చేసి నిజమైన హీరోగా పేరు దక్కించుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి అటు ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా వారికి ఒక స్థానాన్ని కల్పిస్తూ సగౌరవంగా సన్మానిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యాక్షన్ కింగ్ హీరో అర్జున్ (Arjun) కూడా తాజాగా రియల్ హీరోలను గుర్తించి వారికి ఘనంగా సన్మానం చేయడమే కాకుండా క్యాష్ ప్రైస్ కూడా ఇచ్చారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ముగ్గురు రియల్ హీరోలకు సన్మానం..

అసలు విషయంలోకి వెళ్తే.. యాక్షన్ కింగ్ అర్జున్ తాజాగా తన దర్శకత్వంలో ‘సీతాపయనం’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా ఈయన కూతురు ఐశ్వర్య అర్జున్ (Aishwarya Arjun).తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించగా.. ఇందులో ముగ్గురు సామాజిక కార్యకర్తలను సన్మానించి తన ఉదారతను చాటుకున్నారు అర్జున్. పద్మశ్రీ డాక్టర్ ప్రకాష్ ఆమ్టే, ప్రకృతి ప్రేమికుడు దుశ్చర్ల సత్యనారాయణ, సాహస మూర్తి ట్యాంక్ బండ్ శివ లను శాలువాలతో సత్కరించి, ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. సమాజం కోసం వీరు చేస్తున్న నిస్వార్థ సేవలను అర్జున్ ఈ సందర్భంగా కొనియాడారు . మొత్తానికైతే ఈ ముగ్గురు రియల్ హీరోలకు రీల్ హీరో అర్జున్ ఘనంగా సన్మానించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సీతా పయనం.. అర్జున్ కీలక నిర్ణయం..

Advertisement

ఈ సీతాపయనం సినిమాతో తన కూతుర్ని తెలుగు తెరకు పరిచయం చేయడమే కాకుండా ఆమెకంటూ ఒక స్థానాన్ని కల్పించాలని ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే స్వయంగా దర్శకత్వం వహిస్తూ సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఆడియన్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు . ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా విడుదలవుతోంది. ఒక కూతుర్ని హీరోయిన్గా తన తండ్రి తన దర్శకత్వంలోనే ఇండస్ట్రీకి పరిచయం చేయడం ఒక ఎత్తైతే .. ఆయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో హీరోగా నటించి ఊహించని పాపులారిటీ సంపాదించుకోవడం మరో ఎత్తు. ఇన్ని అంశాలు ఉండడంతోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

తెలుగు తెరకు పరిచయం కాబోతున్న ఐశ్వర్య అర్జున్, నిరంజన్..

ఇకపోతే ఈ సినిమాలో అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. హీరోగా నిరంజన్ నటిస్తున్నారు. ఈయన కూడా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. ఇక కూతురు కోసం రంగంలోకి దిగిన అర్జున్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను సొంతం చేసుకుంటారో చూడాలి. ఏది ఏమైనా ఒకవైపు సినిమాలు చేస్తూ మరొకవైపు దర్శకుడిగా సినిమాలు చిత్రీకరిస్తూ ఊహించని పాపులారిటీని సొంతం చేసుకున్నారు అర్జున్.

Advertisement

also read: The RajaSaab: ఏంటీ.. హీరోనే అనుకుంటే హీరోయిన్ కూడా డూపేనా.. ఫోటో వైరల్!

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×