E-Paper
Advertisement

బాలకృష్ణతో జాగ్రత్తగా ఉండాలి..తేడా వస్తే దబిడి దిబిడే అంటున్న హీరో!

బాలకృష్ణతో జాగ్రత్తగా ఉండాలి..తేడా వస్తే దబిడి దిబిడే అంటున్న హీరో!
Advertisement

Actor Suman: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు సుమన్(Suman) ఒకరు. ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు అలాగే పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే త్వరలోనే ఈయన నటించిన జయహో రామానుజ (Jayaho Ramanuja)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ రామానుజచార్యుల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఢిల్లీ సుల్తాన్ పాత్రలో సుమన్..

ఈ నేతత్యంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు సుమన్ ఢిల్లీ సుల్తాన్ పాత్రలో నటించారు. సుమన్ ఇదివరకు ఎన్నో పౌరాణిక జానపద పాత్రలలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మాత్రం ఢిల్లీ సుల్తాన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమన్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోల గురించి వారితో ఆయనకున్న సాన్నిహిత్యం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఆ హీరోల నుంచే క్రమశిక్షణ నేర్చుకున్నాను..

Advertisement

ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ తనకు సినిమా ఇండస్ట్రీలో అందరి హీరోలతో చాలా మంచి సాన్నిహిత్యం ఉందని తెలిపారు. అప్పట్లో కృష్ణంరాజు , కృష్ణ,శోభన్ బాబులతో కలిసి తాను కొన్ని సినిమాలలో చేశాను. ఇలా సీనియర్ హీరోల సినిమాలలో నటించి తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని, ముఖ్యంగా క్రమశిక్షణ టైం కి షూటింగుకు రావడం వంటి అలవాట్లను వీరి నుంచే నేర్చుకున్నానని తెలిపారు.. ఇక తర్వాత హీరోల గురించి మాట్లాడుతూ నాగార్జున, బాలకృష్ణ వంటి వాళ్లది నాతో సమాన వయసే కాబట్టి వీళ్ళతో కూడా చాలా మంచి అనుబంధంగా ఉందని తెలిపారు.

బాలకృష్ణ దగ్గర లిమిట్స్ దాటకూడదు..

ఇక ప్రస్తుతం సుమన్ ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవిలో ఉన్న సంగతి తెలిసిందే అయితే ఈ పదవి బాలకృష్ణ(Balakrishna) గారే సిఫార్సు చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. బాలకృష్ణ గారు నిత్యం ఎంతో బిజీగా గడుపుతుంటారు ఆయన బసవతారకం హాస్పిటల్ చైర్మన్ అలాగే ఒక రాజకీయ నాయకుడు ,ఒక నటుడు. వివిధ వ్యవహారాలను చూసుకుంటూ ఉన్న బాలకృష్ణ అందరితో చాలా మంచిగా మాట్లాడుతారు అయితే ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలని, తనతో మాట్లాడేటప్పుడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి అనవసరమైనవి మాట్లాడితే కచ్చితంగా ఇరిటేట్ అవుతాడని సుమన్ ఈ సందర్భంగా బాలకృష్ణ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక బాలయ్యను విసిగించినప్పుడు మాట్లాడితే తన రియాక్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అభిమానులపై కూడా ఈయన నేరుగా చేయి చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి.

Advertisement

Also Read: రామాయణ ప్రీ రిలీజ్ ఈవెంట్…సింగర్ గా మారిన సాయి పల్లవి.. ఫిదా అవ్వాల్సిందే!

Related News

రామాయణ ప్రీ రిలీజ్ ఈవెంట్…సింగర్ గా మారిన సాయి పల్లవి.. ఫిదా అవ్వాల్సిందే!

యశ్ టాక్సిక్ డిజాస్టర్ పై దిల్ రాజు కామెంట్స్.. ఇంటర్నేషనల్ లెవెల్ అంటూ!

కాఫీ విత్ కరణ్‌ షోలో ‘విరోష్’ సందడి.. విజయ్ -రష్మిక పెళ్లి రహస్యం లీక్‌!

తెరపైకి సింగర్ పీ సుశీలమ్మ బయోపిక్ చిత్రం? హీరోయిన్ ఎవరంటే?

ఆదర్శ కుటుంబం సెకండ్ సింగిల్ ‘మాల’ లిరికల్ సాంగ్ రిలీజ్!

కావ్యతో పెళ్లి.. వైరల్ గా మారిన అనిరుధ్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్!

జైలర్ 2 మూవీ.. రజిని మనవడి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×