Ramayana Pre Release: సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి అయితే త్వరలోనే మరో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రామాయణం నేపథ్యంలో బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్(Ranbir Kapoor) సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన చిత్రం రామాయణ(Ramayana). దీపావళి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా నవంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. తాజాగా చిత్ర బృందం హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్రబృందం మొత్తం పాల్గొని సందడి చేశారు.
ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించగా సీతమ్మ పాత్రలో సాయి పల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా సాయి పల్లవి ఈ సినిమాలో నటించడం గురించి తన అభిప్రాయాలను తెలియజేశారు. చిన్నప్పటి నుంచి తాను రామాయణం చూసి పెరిగానని తెలిపారు. నిజంగా రామాయణ సినిమాలో తనకు ఇలాంటి సీత పాత్రలో నటించే అవకాశం రావడం చాలా అదృష్టమని, నిజంగానే సీతమ్మ దయ నాపై ఉండటం వల్ల నాకు ఇలాంటి అవకాశం వచ్చిందని సాయి పల్లవి సీత పాత్రలో నటించడం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక రాముడి పాత్రలో నటించిన రణబీర్ కపూర్ గురించి కూడా మాట్లాడారు. తాను సౌత్ నుంచి ఒక్కసారిగా హిందీ సినిమాలకు వెళ్లడంతో మొదట్లో కాస్త భయపడ్డాను కానీ రణబీర్ కపూర్ మాత్రం తనని చాలా జాగ్రత్తగా చూసుకున్నారని డైలాగ్స్ విషయంలో కూడా నాకు చాలా సహాయం చేశారని తెలిపారు. ఇక రావణాసురుడి పాత్రలో యశ్ నటించడం గురించి కూడా సాయి పల్లవి తెలిపారు సాధారణంగా రావణాసురుడి పాత్ర మనకు నచ్చదు కానీ యశ్ నటించడం చూసిన తర్వాత రావణాసురుడు కూడా అందరికీ నచ్చుతారని తెలిపారు. ఇలా ఈ సినిమా గురించి ఎంతో గొప్పగా మాట్లాడిన సాయి పల్లవి ఈ వేడుకలో భాగంగా అద్భుతంగా పాట పాడుతూ అందరిని ఆశ్చర్యపరిచారు.
ఈ సినిమా వేడుకలో భాగంగా సుమ సాయి పల్లవిని పాట పాడమని కోరడంతో సాయి పల్లవి రామాయణ సినిమాలోని “ఘన ఘన నీల గగన.. మాధవ మురారి” అంటూ సాగిపోయే పాటను ఎంతో అద్భుతంగా ప్రొఫెషనల్ సింగర్ రేంజ్ లో పాడారు. ఇలా సాయి పల్లవి ఈ పాట పాడటంతో ఒక్కసారిగా అక్కడ పెద్ద ఎత్తున కేకలు వేస్తూ సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సాయి పల్లవిలో ఇలాంటి టాలెంట్ కూడా ఉందా? గ్రేట్ సింగర్.. చాలా అద్భుతంగా పాడారు అంటూ ఈమె పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: యశ్ టాక్సిక్ డిజాస్టర్ పై దిల్ రాజు కామెంట్స్.. ఇంటర్నేషనల్ లెవెల్ అంటూ!